iDreamPost
android-app
ios-app

OTT లో సూపర్ న్యాచురల్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఎక్కడంటే ?

  • Published Jun 13, 2025 | 8:10 PM Updated Updated Jun 13, 2025 | 8:10 PM

థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. అందుకే ఇతర భాషల సినిమాలను కూడా డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు ఓ తమిళ సినిమాను దాదాపు మూడేళ్ళ తర్వాత తెలుగులోకి తీసుకుని వచ్చారు. కాబట్టి ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో ఈ సినిమాను కూడా యాడ్ చేసుకోవచ్చు

  • Published Jun 13, 2025 | 8:10 PMUpdated Jun 13, 2025 | 8:10 PM
OTT లో సూపర్ న్యాచురల్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఎక్కడంటే ?

థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. అందుకే ఇతర భాషల సినిమాలను కూడా డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు ఓ తమిళ సినిమాను దాదాపు మూడేళ్ళ తర్వాత తెలుగులోకి తీసుకుని వచ్చారు. కాబట్టి ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో ఈ సినిమాను కూడా యాడ్ చేసుకోవచ్చు. అసలు ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు యుగి. 2022 లో తమిళంలో రిలీజ్ అయింది ఈ మిస్టరీ థ్రిల్లర్. కథిర్, నరైన్, జోజూ జార్జ్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ‘కార్తీక: మిస్సింగ్ కేస్’ పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేశారు. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే  సినిమా ఆరంభ‌మే కార్తీక ఏడ్చుకుంటూ రోడ్డ దాటుతుండ‌గా మిస్స‌వుతుంది. ఆ వెంట‌నే ఓ హ‌త్య కూడా జ‌రుగుతుంది. ఈ క్రమంలో ఓ డిటెక్టీవ్ బృందం ఈ కేసును టేక్ అప్ చేస్తుంది. ఆ ప్రాసెస్ లో ఆ బృందానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు అమ్మాయి దొరికిందా లేదా ? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

స్టోరీ ప్లాట్ కామన్ గానే అనిపించినా.. తెర మీద చూసేటప్పుడు మాత్రం ప్రతి క్షణం ఉత్కంఠభరితంగానే ఉంటుంది. మరీ ఎక్కువ సస్పెన్స్ లేకుండా ఓ క్లీన్ థ్రిల్లర్ సిరీస్ చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్. ఈ సినిమా జూన్ 13 నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ఆహలో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.