ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి నూతన కమిషనర్‌ను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీతో ప్రస్తుత కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పదవీ కాలం ముగియబోతోంది. ఐదేళ్ల కిందట చంద్రబాబు ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించింది. వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అత్యంత వివాదాస్పద అధికారిగా పేరుగాంచారు. నూతన ఎస్ఈసీ ఎంపిక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ […]
రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు మధ్య స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న బేధాభిప్రాయాలు చినికిచినికి గాలివానలా మారుతున్నాయి. ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ, కరోనా వల్ల ఇప్పట్లో సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతున్న వేళ.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నికల సన్నద్ధతపై బుధవారం జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని నిమ్మగడ్డ కోరగా.. ఎన్నికల నిర్వహణే ఇప్పట్లో కాదంటే.. సమావేశం అవసరం లేదని సీఎస్ ప్రత్యుత్తరం పంపారు. ఈ విషయంపై […]
రాష్ట్ర హైకోర్టు అనుబంధ విభాగాలైన విజిలెన్స్ కమిషనర్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను కర్నూల్ కి తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ను నిలుపుదల చెయ్యాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వైజాగ్ లో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో పరిపాలనా రాజధాని, కర్నూల్ లో న్యాయ రాజధాని ని ఏర్పాటు చెయ్యాలని అసెంబ్లీ లో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిన నేపథ్యంలో, దానిలో భాగంగా కోర్ట్ సంభందిత న్యాయ కార్యాలయాలన్నింటిని కర్నూల్ కి […]
అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ పాలనలో దూకుడు చూపిస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ పై ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసలు తెలిపింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ సిఎస్ నీలం సాహ్నితో భేటీ అనంతరం ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యింది. ఈ భేటీలో ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కీలక పథకాలను, కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు […]
మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో వరల్డ్ బ్యాంక్ దక్షిణాసియా మానవ వనరుల అభివృద్ధి విభాగం రీజనల్ డైరెక్టర్ షెర్‌బర్న్ బెంజ్ తో పాటు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని తో పాటు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ప్రపంచ బ్యాంక్ అధికారులతో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ […]