iDreamPost
android-app
ios-app

సూపర్ స్టార్ కోసం ‘నిజం’ విలన్

  • Published Mar 06, 2020 | 5:17 AM Updated Updated Mar 06, 2020 | 5:17 AM
సూపర్ స్టార్ కోసం ‘నిజం’ విలన్

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి తమిళ్ లో టైటిల్ ఫిక్స్ చేశారు కానీ తెలుగుది ఇంకా నిర్ణయించలేదు. అన్నయ్య అని పెట్టే దిశగా ఆలోచనలు జరుగుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాలో స్టైలిష్ గా కనిపించే విలన్ పాత్ర కోసం గోపీచంద్ ని లాక్ చేసినట్టు చెన్నై అప్ డేట్. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ దాదాపు ఖరారు అయినట్టేనని వినికిడి. శివ చాలా ప్రత్యేకంగా గోపీచంద్ కోసం ఈ పాత్రను డిజైన్ చేశాడట.

దానికి కారణం లేకపోలేదు. శివకు దర్శకుడిగా మొదటి ఆఫర్ ఇచ్చింది గోపి చందే. శౌర్యం చిత్రంతో శివను పరిచయం చేశాడు. అది పర్వాలేదు అనిపించుకుంది కానీ మరీ బ్లాక్ బస్టర్ కాలేదు. అయినా కూడా శివ మీద నమ్మకంతో వరసగా రెండో ఆఫర్ శంఖం రూపంలో ఇచ్చాడు. ఇదీ యావరేజ్ దగ్గర నిలబడిపోయింది. వీటి టేకింగ్ నచ్చి రవితేజ దరువుకు ఓకే చెప్పాడు. అలా శ్గివ టాలీవుడ్ ప్రస్థానంలో గోపీచంద్ పాత్ర ఉంది. అందుకే ఆ కృతజ్ఞతతోనే గోపిచంద్ కు శివ రజని సినిమాలో అవకాశం కల్పించినట్టుగా చెబుతున్నారు.

పాత్ర తీరుతెన్నులు వగైరా తదితర వివరాలు తెలియాల్సి ఉంది. శివ తెలుగులో సక్సెస్ కాకపోయినా కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. అజిత్ తో బ్యాక్ టు బ్యాక్ మూడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు. అందుకే రజని ఏరికోరి మరీ ఆఫర్ ఇచ్చాడు. గోపిచంద్ కు విలనిజం కొత్తేమి కాదు. జయం, వర్షం సినిమాల్లో ప్రతినాయకుడిగా హీరోలతో సమానంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక మహేష్ బాబు నిజంలో క్రూరమైన పాత్రలో గోపీచంద్ విశ్వరూపమే చూపించాడు. అందుకే శివ స్పెషల్ ఇంటరెస్ట్ తో గోపీచంద్ కు ఈ రోల్ ఆఫర్ చేయడమే కాక రజినితో తలపడే సీన్స్ ని కూడా ఒక రేంజ్ లో డిజైన్ చేశాడట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet