iDreamPost
android-app
ios-app

Ravi Teja, Sree Vishnu: సంక్రాంతికి మల్టీ స్టారర్ ప్లానింగ్

రవితేజ-శ్రీవిష్ణు కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు.

రవితేజ-శ్రీవిష్ణు కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు.

Ravi Teja, Sree Vishnu: సంక్రాంతికి మల్టీ స్టారర్ ప్లానింగ్

హింసలు, రక్తపాతం చూసి విసుగెత్తి జనాలు మళ్లీ ఫ్యామిలీ సినిమాల వైపు మళ్లుతున్నారేమో అన్నారు నిర్మాత నాగవంశీ ఓ ఫంక్షన్ లో. అది కూడా నిజమే అనుకోవాలేమో? అనిల్ రావిపూడి ప్రతి సంక్రాంతికి వదులుతున్న మధ్యతరగతి ఫ్యామిలీ సినిమాలు. మా ఇంటి బంగారం సినిమాను మహిళలు ఆదరించడం చూస్తే ఈ అభిప్రాయం కలుగుతుంది. 2027 సంక్రాంతికి వెంకీ-కళ్యాణ్ రామ్ కాంబినేషన్ ఫ్యామిలీ మల్టీ స్టారర్ వస్తోంది. అదే టైమ్ లో విడుదల చేసే ఆలోచనతో మరో మల్టీ స్టారర్ కు ప్లానింగ్ జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

రాజ రాజ చోర లాంటి ఎంటర్ టైన్ మెంట్ సినిమా అందించిన దర్శకుడు హర్షిత్ గోలి డైరక్షన్ లో రవితేజ-శ్రీవిష్ణు కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. రవితేజ ది లౌడ్ వెటకారం. శ్రీవిష్ణుది నెమ్మదిగా వుంటూనే ఫట్ మని పేలే వెటకారం. ఈ ఇద్దరి కాంబినేషన్ కు సరైన సీన్లు, డైలాగులు రాయాలే కానీ అదిరిపోయే కామెడీ పుడుతుంది.

అయితే ఇక్కడ సమస్య ఒకటే. అయిదారు నెలల్లో ఈ సినిమాను రెడీ చేసి సంక్రాంతికి విడుదల చేయగలరా అన్నదే. రవితేజ ఈ లోగా ఇరుముడి సినిమాను పూర్తి చేసి విడుదల చేయాల్సి వుంటుంది. శ్రీవిష్ణు చేతిలో కూడా రెండు మూడు సినిమాలు వున్నాయి.

ఇద్దరు హీరోలు, దర్శకుడు, నిర్మాత గట్టిగా డిసైడ్ అయితే తప్ప ఇది పాజిబుల్ కావడం కష్టం. చూడాలి ఈ ప్రాజెక్ట్ ఎలా ముందుకు వెళ్తుందో మరి?

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş