iDreamPost
android-app
ios-app

‘నిశబ్దం’గా భారీ డిజిటల్ ఆఫర్ ?

  • Published Apr 27, 2020 | 1:00 PM Updated Updated Apr 27, 2020 | 1:00 PM
  • Published Apr 27, 2020 | 1:00 PMUpdated Apr 27, 2020 | 1:00 PM
‘నిశబ్దం’గా భారీ డిజిటల్ ఆఫర్ ?

థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని అనిశ్చితిలో ఓటిటి ప్లేయర్లు తమ బాణాలకు పదును పెడుతున్నారు. పక్క రాష్ట్రంలో సూర్య లాంటి అగ్ర హీరోనే తన భార్యతో తీసిన సినిమాను వచ్చే నెల ప్రైమ్ లో రిలీజ్ చేయబోతున్నాడు. దీనిపట్ల ఎగ్జిబిటర్లు తీవ్రంగా నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఇవాళ 30 చిన్న మరియు మీడియం నిర్మాతలు సుర్యకు మద్దతుగా స్టేట్ మెంట్ ఇవ్వడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీన్నలా ఉంచితే ఇప్పుడు తెలుగులోనూ ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. చిన్న సినిమాలు మరీ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవు కానని అదే పేరున్న స్టార్ తో నిర్మించిన హెవీ బడ్జెట్ మూవీ అయితే ఖచ్చితంగా దానికి స్పందన వేరే లెవెల్ లో ఉంటుంది.

ఇప్పటికే నాని వి, రామ్ రెడ్ లకు క్రేజీ ఆఫర్స్ వచ్చినా ఆ నిర్మాతలు నో చెప్పారన్న విషయం అందరికి తెలిసిందే. అనుష్క నిశబ్దం గురించి కూడా ఇలాంటి టాకే వచ్చింది కాని నిర్మాతలు గట్టిగా అయితే ఖండించలేదు. తాజాగా వస్తున్న అప్ డేట్ ప్రకారం ప్రైమ్ నుంచి నిశబ్దంకు 25 కోట్ల ఆఫర్ వచ్చినట్టుగా తెలిసింది. దీనికి ప్రొడ్యూసర్లు సానుకూలంగా స్పందించినట్టు కూడా వినికిడి. ఇంకొద్ది రోజుల్లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రావొచ్చని అంటున్నారు. నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చేదాకా దీన్ని ధృవీకరించలేం కానీ ఇప్పటికైతే టాక్ బలంగా ఉంది.

హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ హారర్ కం థ్రిల్లర్ లో మాధవన్ తో పాటు అంజలి, షాలిని పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్ చాలా రోజుల క్రితమే రిలీజై ఆసక్తి రేపింది. మరి నిశ్శబ్దం తనకు వచ్చిన భారీ ఆఫర్ ని వాడుకుని ఇంట్లోనే వినోదాన్ని అందిస్తుందా లేక వేచి చూద్దాం అంటే ఫార్ములాని పాటిస్తుందా కాలమే సమాధానం చెప్పాలి. భాగమతి తర్వాత ఏకంగా రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని అనుష్క చేసిన మూవీ కావడంతో స్వీటీ ఫ్యాన్స్ దీని మీద చాలా ఆశలే పెట్టుకున్నారు.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetgrandpashabetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş