ఒక జానర్ కో లేదా ఒక ఫార్ములాకో కట్టుబడి సినిమాలు తీయడంలో ఎలాంటి ప్రత్యేకత ఉండదు. అది అందరూ చేసేదే. అలా కాకుండా నమ్మిన సిద్ధాంతాలు, సమాజానికి ఏదో సందేశం ఇవ్వాలన్న తాపత్రయం ఉన్న దర్శకులు అరుదుగా ఉంటారు. అందులో ఒకరు క్రిష్. మొదటి సినిమా గమ్యంతో విమర్శకులను ప్రేక్షకులను ఏకకాలంలో మెప్పించిన క్రిష్ కు రెండో చిత్రమే అల్లు అర్జున్ లాంటి స్టార్ తో చేయాల్సి వస్తే ఎలాంటి కథను ఎంచుకుంటారు. కమర్షియల్ ఫార్మాట్ లో […]
సరిగ్గా 11 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లాలో ఒక చిన్న పట్టణంలో తెల్లవారుఝామున మహేష్ బాబు కొత్త సినిమా బెనిఫిట్ షో చూసి బయటికి వస్తున్న కుర్రాడు కం అభిమాని మనసులో రకరకాల అనుమానాలు. పక్కవాడిని అడిగి తీర్చుకుందామంటే వాళ్లకూ అవే సందేహాలు. ఏదో అసంతృప్తి. అతడు కాంబినేషన్ కదా దానికి మించి ఉందనుకుంటే ఇలా అయ్యిందేమిటి అనే నిట్టూర్పు కుదురుగా ఉండనివ్వడం లేదు. బాబుకి మరో ఫ్లాప్ ఖాయమని మనసు చెబుతోంది. తోటి అభిమానులు హిట్ […]
సాధారణంగా డ్యూయల్ రోల్ సినిమాల్లో హీరో వేసిన పాత్రల మధ్య రక్త సంబంధం ఉంటుంది. అలనాటి రాముడు భీముడుతో మొదలుపెట్టి జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ దాకా చూసుకుంటే ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. నాగార్జున హలో బ్రదర్ చూసినా బాలకృష్ణ అపూర్వ సహోదరులు చూసుకున్నా ఇదే తీరు. అయితే మినహాయింపులుగా నిలిచినవి లేకపోలేదు. కమల్ హాసన్ ఇంద్రుడు చంద్రుడు, చిరంజీవి రౌడీ అల్లుడు కొన్ని ఉదాహరణలు. అధిక శాతం మాత్రం బ్లడ్ రిలేషన్ కాన్సెప్ట్ తో రూపొందినవే. […]
భాగమతి వచ్చి రెండేళ్లు దాటింది. లేట్ అయితే అయ్యింది పోనీ నిశ్శబ్దం చూస్తాం కదా అనుకుంటే కరోనా లాక్ డౌన్ దెబ్బకు మళ్లీ వాయిదా పడింది. థియేటర్లో వస్తుందా లేదా ఓటిటినా అనేది ఎవరికీ తెలియదు. క్రైమ్ థ్రిల్లర్ కం హారర్ జానర్ లో రూపొందిన ఈ సినిమా గత ఆరు నెలలుగా పలుమార్లు వాయిదా పడింది. ఇప్పటికైతే సెన్సార్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. దీని సంగతలా ఉంచితే అనుష్క తర్వాత ఏ […]
ఇద్దరూ సీనియర్ హీరోయిన్లే. దశాబ్దం పైగా కెరీర్ ని ఎంజాయ్ చేసి ఇప్పటికీ అవకాశాలు రాబట్టుకుంటున్న వాళ్ళు. పైగా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది. త్వరలో ఆ ఛాన్స్ ఉందని చెన్నై టాక్. వాళ్ళే అనుష్క, త్రిష. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందబోయే లవ్ యాక్షన్ డ్రామాలో ఈ ఇద్దరినే ఎంచుకున్నట్టు తెలిసింది. తొలుత ఇది అజిత్ తో గతంలో తీసిన ఎన్నై అరిందాల్(తెలుగులో ఎంతవాడుగాని)కు […]
నిజమో కాదో కానీ అనుష్కకు సంబంధించిన రెండు వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో మొదటిది పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతున్న విరూపాక్ష(ప్రచారంలో ఉన్న టైటిల్)లో తనే హీరొయిన్ గా సెలెక్ట్ అయ్యిందని. గతంలో జాక్వలిన్ ఫెర్నాండెజ్ ఎంపికైనట్టు టాక్ వచ్చింది కాని అది సపోర్టింగ్ రోలట. కథలో కీలకంగా ఉంటుంది కాని పవన్ కు జోడి కాదన్నది ఫ్రెష్ అప్ డేట్. హీరోని ప్రేమిస్తుంది కాని దక్కించుకోలేక […]
థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని అనిశ్చితిలో ఓటిటి ప్లేయర్లు తమ బాణాలకు పదును పెడుతున్నారు. పక్క రాష్ట్రంలో సూర్య లాంటి అగ్ర హీరోనే తన భార్యతో తీసిన సినిమాను వచ్చే నెల ప్రైమ్ లో రిలీజ్ చేయబోతున్నాడు. దీనిపట్ల ఎగ్జిబిటర్లు తీవ్రంగా నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఇవాళ 30 చిన్న మరియు మీడియం నిర్మాతలు సుర్యకు మద్దతుగా స్టేట్ మెంట్ ఇవ్వడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీన్నలా ఉంచితే ఇప్పుడు తెలుగులోనూ ఆ […]
కొత్త సినిమాలు ఎప్పుడు విడుదలకు నోచుకుంటాయో థియేటర్లు, ఎప్పుడు తెరుచుకుంటాయో అర్థం కాని అయోమయం మధ్య మన తెలుగు నిర్మాతలు ఎలాంటి కంక్లూజన్ కు రాలేకపోతున్నారు. ప్రభుత్వాలు షూటింగులకు అనుమతి త్వరగా ఇస్తాయో లేదో కూడా తెలియదు. ఈ గందరగోళం మధ్య ఓటిటిలు భారీ ఆఫర్లతో ప్రొడ్యూసర్లను ఊరిస్తున్నారు. ఎంతగా అంటే తమ పెట్టుబడితో పాటు నిర్మాతలు మంచి లాభాన్ని వెనకేసుకునే లెవెల్ లో. కాని ఒక్కసారి ఈ పోకడ మొదలైతే తర్వాత జరిగే పరిణామాలు ఊహకందడం […]
మార్చ్ లో ఒక్క నాని ‘వి’ తప్ప అంతా చప్పగా గడిచిపోతోందే అని ఫీలవుతున్న టాలీవుడ్ ప్రేమికుల కోసం ఏప్రిల్ లో ఫుల్ మీల్స్ రాబోతున్నాయి. క్రేజీ సినిమాలన్ని వరసగా రాబోతుండటంతో వేసవిలో కనువిందైన వినోదం పలకరించబోతోంది. ముందుగా ఏప్రిల్ 2నే తీసుకుంటే ఏకంగా మూడు భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాయి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన ‘ఉప్పెన’, అనుష్క రెండేళ్ళ గ్యాప్ తర్వాత చేసిన ‘నిశబ్దం’, […]
భాగమతి తర్వాత ఏకంగా రెండేళ్ల గ్యాప్ తీసుకుని అనుష్క చేసిన నిశ్శబ్దం వచ్చే నెల 2న విడుదల కాబోతోంది. అభిమానులు తన కోసం ఎదురు చూసి చూసి ఇప్పటికే కళ్ళు కాయలు కాచాయి. వాటికి చెక్ పెడుతూ స్వీటీ వెండితెరపైకి వస్తోంది. నిన్న సోషల్ మీడియా వేదికగా నాని ద్వారా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. కథ విషయానికి వస్తే ఆ అమ్మాయి(అనుష్క)కు మాటలు రావు. చెవులు వినిపించవు. ఓ విచిత్రమైన పరిస్థితిలో తన మీద దాడి […]