iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో ఎదగాలంటే హీరోయిన్స్‌ రాజీపడాలి.. క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ

  • Published May 07, 2024 | 10:03 PM Updated Updated May 12, 2024 | 10:28 AM

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఛాన్సులు రావాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని.. ఇవ్వకపోతే ఛాన్సులు ఇవ్వరని ఇప్పటికే చాలా మంది చెప్పారు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ సంచలన కామెంట్స్ చేశారు.

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఛాన్సులు రావాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని.. ఇవ్వకపోతే ఛాన్సులు ఇవ్వరని ఇప్పటికే చాలా మంది చెప్పారు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ సంచలన కామెంట్స్ చేశారు.

  • Published May 07, 2024 | 10:03 PMUpdated May 12, 2024 | 10:28 AM
ఇండస్ట్రీలో ఎదగాలంటే హీరోయిన్స్‌ రాజీపడాలి.. క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ

ఒకప్పటి అందాల తార, సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. క్యాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ చేశారు. సినిమాల్లో ఎదగాలంటే హీరోయిన్స్ కొన్నిసార్లు సర్దుకుపోవాల్సి ఉంటుందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాస్టింగ్ కౌచ్.. ఈ మాట గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో నానుతున్న అంశం. చాలా మంది హీరోయిన్స్ ఈ విషయం మీద తమ గొంతు విప్పారు. ఒకప్పటి హీరోయిన్స్ నుంచి నేటి యంగ్ హీరోయిన్స్ వరకూ చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డ వాళ్ళమే అని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలని ఒక అమ్మాయి వెళ్తే కమిట్మెంట్ అడుగుతారని.. ఒప్పుకోకపోతే అవకాశాలు రావని చాలా మంది తమ బాధను చెప్పుకొచ్చారు.

నయనతార, అనుష్క శెట్టి, రకుల్ ప్రీత్ సింగ్, ఆదా శర్మ వంటి వాళ్ళు.. ఒకప్పటి హీరోయిన్స్ అయిన ఆమని వంటి వాళ్ళు కూడా కమిట్మెంట్, క్యాస్టింగ్ కౌచ్ భూతాలకి బెదిరిన వాళ్ళే. ఇప్పుడు ఈ క్యాస్టింగ్ కౌచ్ భూతం.. సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా బుల్లితెరకు కూడా పాకింది. సీరియల్ ఆర్టిస్టులను, సీరియల్ హీరోయిన్స్ ని కూడా కమిట్మెంట్ అడుగుతున్నారని స్వయంగా వాళ్ళే చెప్తున్నారు. తాజాగా ఈ క్యాస్టింగ్ కౌచ్ అంశంపై సీనియర్ నటి రమ్యకృష్ణ మాట్లాడారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. క్యాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ చేశారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉందని.. అయితే సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ఉందని అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయిలు క్యాస్టింగ్ గురించి బయటపెట్టడంతో అందరి దృష్టి సినిమావారిపైనే ఉంటుందని అన్నారు.

అయితే అన్నిసార్లు ఇది నిజం కాదని.. కొంతమంది ఫేక్ న్యూస్ ని కూడా ప్రచారం చేస్తారని అన్నారు. సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగాలంటే హీరోయిన్స్ కొన్నిసార్లు సర్దుకుపోవాల్సి ఉంటుందని.. కొన్నిసార్లు తప్పదని రమ్యకృష్ణ వ్యాఖ్యానించారు. అయితే తన విషయంలో మాత్రం అలా జరగలేదని అన్నారు. కాగా రమ్యకృష్ణ 14 ఏళ్ల వయసప్పుడే ఇండస్ట్రీకి వచ్చారు. 1984లో వెళ్లి మిందాన అనే కోలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. 1986లో విడుదలైన భలే మిత్రులు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 90ల కాలంలో సౌందర్య, రోజా, నగ్మా, మీనా వంటి స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తూ స్టార్ హీరోయిన్ గా రాణించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాష చిత్రాల్లో 200కు పైగా సినిమాల్లో నటించారు. తన కెరీర్ లో ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు.