అర్జున్ రెడ్డితో అనూహ్యమైన బ్లాక్ బస్టర్, గీత గోవిందం ఇండస్ట్రీ హిట్ తో యూత్ లో అశేషమైన ఫాలోయింగ్ దక్కించుకున్న విజయ్ దేవరకొండకు ఎన్ని ఫ్లాపులు వస్తున్నా ఏదో పెద్ద బ్రేక్ వస్తుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. బయట చూపించే యాటిట్యూడ్ మీద కామెంట్స్ ఉన్నప్పటికీ తన తీరే ఇంత అనేలా ప్రవర్తించే రౌడీ హీరో మొదటి సారి ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్రొజెక్ట్ అయిన సినిమా లైగర్. బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ […]
ఇంకో 24 గంటల కంటే తక్కువ వ్యవధిలో విడుదల కాబోతున్న లైగర్ బుకింగ్స్ ట్రేడ్ ని సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా నైజామ్ లో అందులోనూ హైదరాబాద్ లో జరుగుతున్న తీరు చూస్తుంటే విజయ్ దేవరకొండ గత రెండు డిజాస్టర్ల ప్రభావం దీని మీద ఎంత మాత్రం పడినట్టు కనిపించడం లేదు. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లోనే నాలుగు సింగల్ స్క్రీన్లలో ఉదయం బెనిఫిట్ షోలు వేశారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మాములుగా టైర్ 1 స్టార్లకు ఇలా […]
వచ్చే నెల 25న విడుదల కాబోతున్న లైగర్ కోసం యూనిట్ భీభత్సమైన ప్రమోషన్లు చేస్తోంది. ఆల్రెడీ ముంబై హైదరాబాద్ లలో భారీ ఎత్తున ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు చేశారు. వాటిలో విజయ్ దేవరకొండ నా తాతలు తండ్రులు ఎవరూ తెలియకపోయినా సపోర్ట్ చేస్తున్నారని అభిమానులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ట్రైలర్ కు మాస్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా తల్లి పాత్రలో రమ్యకృష్ణని డిఫరెంట్ గా ప్రెజెంట్ […]
ఇవాళ భీమ్లా నాయక్ వాయిదా ప్రకటన తర్వాత ఇప్పుడు అందరి చూపు బంగార్రాజు మీదకు వెళ్తోంది. ఇది కూడా పోస్ట్ పోన్ అవుతుందేమోనని అభిమానుల్లో అనుమానం మొదలైంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ మీటింగ్ లో అసలు దీని ఊసు కూడా రాలేదు సరికదా ఎప్పుడో ఏప్రిల్ 1 వచ్చే సర్కారు వారి పాట గురించి దిల్ రాజు ప్రస్తావన తీసుకొచ్చారు. సో ఇప్పుడు నాగార్జున ఏం చేయబోతున్నారనే ప్రశ్న తలెత్తడం సహజం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం బంగార్రాజు […]
స్టార్లతో కమర్షియల్ సినిమాలు చేసేటప్పుడు మాస్ ఎలిమెంట్స్ ని చెక్ చేసుకోవడం చాలా అవసరం. హీరోకు ఇమేజ్ మార్కెట్ ఉన్నాయి కదాని తోచిన కథతో తీస్తే ఫలితాలు గోవిందా కొట్టేస్తాయి. అదెలాగో చూద్దాం. 1995లో వరుస పరాజయాల తర్వాత చిరంజీవి తన ఎంపికను పునఃసమీక్షించుకోవడం కోసం ఏడాది గ్యాప్ తీసుకోవడం అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. ఆ కారణంగానే హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా లాంటి హ్యాట్రిక్ సూపర్ హిట్స్ పడ్డాయి. స్నేహం కోసం వాటి స్థాయిలో […]
మనకు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలకు మగ సెలెబ్రిటీలు యాంకరింగ్ చేయడం ఇప్పటిదాకా చూసాం. హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో తారక్-నాని-నాగార్జున ఇలా అందరూ మేల్ యాంకర్సే ఉంటారు. కానీ దీనికి భిన్నంగా ఇప్పుడో సీనియర్ హీరోయిన్ ని ఈ పాత్రలో చూడబోతున్నాం. ఇటీవలే కమల్ హాసన్ కు కరోనా పాజిటివ్ వచ్చి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రమాదమేమీ లేదు కానీ కొంత విశ్రాంతి అవసరమని డాక్టర్లు రికమండ్ చేయడంతో ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ […]
కమర్షియల్ స్టార్ హీరోలను ఫలానా మీటర్ లోనే చూపించాలన్న రూలేమీ లేదు కానీ దీనికీ పరిమితులు ఉంటాయన్న సంగతి మర్చిపోకూడదు. ముఖ్యంగా సమాజ పరంగా ఉన్న కొన్ని కట్టుబాట్లు, సభ్యత సంస్కృతికి సంబంధించిన అంశాలను మాత్రం ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే విజయం దక్కినా కూడా విమర్శలు తప్పవు. దానికి ఉదాహరణగా అల్లుడా మజాకా గురించి చెప్పుకోవచ్చు. 1992 ఘరానా మొగుడు ఇండస్ట్రీ హిట్ తర్వాత నిర్మాత దేవీవరప్రసాద్ మళ్ళీ చిరంజీవితో తప్ప మరో హీరోతో సినిమా […]
2022 సంక్రాంతికి బంగార్రాజుని తీసుకురాబోతున్నట్టు నాగార్జున ఫిక్స్ అవ్వడం పట్ల అభిమానులు ఇప్పటికీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఒకపక్క ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ల దెబ్బకు అంతటి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయకే వెనుకడుగు వేసే ఆలోచనలో ఉంది. ఆల్రెడీ సర్కారు వారి పాట ఏప్రిల్ కు షిఫ్ట్ అయిపోయింది. అలాంటిది మార్కెట్ కొంత డౌన్ లో ఉన్న కింగ్ ఇంత సాహసం ఎందుకు చేస్తున్నారా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. గతంలో సోగ్గాడే చిన్ని […]
ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ లో కొత్త సినిమాలకు పెద్ద రేటింగ్ రావడమే గగనం. అలాంటిది 22 ఏళ్ళ క్రితం వచ్చిన మూవీకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్స్ ని మించిన రెస్పాన్స్ వస్తే ఎలా ఉంటుంది. అది ఒక్క సూపర్ స్టార్ రజనీకాంత్ కు మాత్రమే సాధ్యమవుతుందేమో. ఇటీవలే సన్ టీవీలో నరసింహ తమిళ వెర్షన్ పడయప్పాను టెలికాస్ట్ చేశారు. ఇందులో విశేషం ఏముందనుకుంటున్నారా. ఇది ఏడేళ్ల తర్వాత అక్కడి ఛానల్ లో ప్రీమియర్ అయ్యింది. అదే రోజు […]