iDreamPost

ఈ కమెడియన్ చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడని తెలుసా..?

సినిమా హిట్ అయ్యి మంచి పేరు, పలుకుబడి, డబ్బు వచ్చిందంటే.. కొంత మంది నటులు మద్యానికి, ఇతర చెడు అలవాట్లకు లోనై, ఇంటిని, ఒంటిని గుళ్ల చేసుకుంటారు. ఎవ్వరూ చెప్పినా వినరు. చివరకు అంతా అయిపోయింది అనుకున్న సమయంలో..

సినిమా హిట్ అయ్యి మంచి పేరు, పలుకుబడి, డబ్బు వచ్చిందంటే.. కొంత మంది నటులు మద్యానికి, ఇతర చెడు అలవాట్లకు లోనై, ఇంటిని, ఒంటిని గుళ్ల చేసుకుంటారు. ఎవ్వరూ చెప్పినా వినరు. చివరకు అంతా అయిపోయింది అనుకున్న సమయంలో..

ఈ కమెడియన్ చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడని తెలుసా..?

చెడు అలవాట్ల కారణంగా సినీ పరిశ్రమలో అనేక మంది పత్తా లేకుండా పోయారు. మద్యం, జూదం, మాదక ద్రవ్యాల అలవాట్ల కారణంగా మూవీ ఛాన్సులు కూడా పొగొట్టుకుని, కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఈ అలవాట్ల కారణంగా షూటింగ్స్ ఆలస్యంగా రావడం, డైరెక్టర్ చెప్పిన విధంగా నటించకపోవడం వంటి పనులు వల్ల తమ ఇమేజ్‌ను డామేజ్ చేసుకుంటున్నారు. సీనియర్ నటులే అనుకుంటే పొరపాటు.. అప్పుడప్పుడే కెరీర్ గాడిలో పడుతున్న నటులు కూడా ఇలానే ప్రవర్తిస్తున్నారు. ఒక్కసారిగా చేతిలోకి వచ్చిన డబ్బులతో జల్సాలకు అలవాటు పడి.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా.. తప్పుడు దారిలో నడుస్తూ.. వారి చేతితోనే వారి లైఫ్ ను కిల్ చేసుకుంటున్నారు.

అటువంటి నటుల్లో ఒకరు రోబో శంకర్. స్టాండప్ కమెడియన్ గా కెరీర్ స్టార్ చేసిన శంకర్.. అనతి కాలంలోనే తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ధనుష్ మూవీ మారిలో అతడికి మంచి మార్కులే పడ్డాయి. అప్పుడప్పుడు తాగే అలవాడు ఉన్న అతడికి.. చేతినిండా అవకాశాలు రావడంతో.. డబ్బులు వస్తుండటంతో మద్యానికి బానిసగా మారాడు. ఇష్టమొచ్చినట్లు తాగడంతో.. అనారోగ్యానికి గురై.. పచ్చ కామెర్ల వ్యాధి సోకింది. దీంతో నాలుగు నెలల పాటు మంచానికి పరిమితం కావాల్సి వచ్చింది. పోతే కానీ తెలియదు దేనీ విలువైనా అని గ్రహించి.. మారాడు. మద్యాన్ని దూరం పెడుతూ.. కఠినమైన ఆహార పదార్ధాలను అనుసరిస్తూ ఆరోగ్యంగా తయారయ్యేందుకు ప్రయత్నాలు చేయసాగాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోబో శంకర్.. మద్యానికి బానిసై.. తాగడం ఆపలేక..ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించానని, పచ్చి తాగుబోతులా తయారయ్యానని అన్నాడు. ఎవ్వరి మాటా పట్టించుకోలేదు. ధనుష్ కూడా తనలాగే మందు తాగుతాడని, అతడు డైరెక్ట్ గా తనకు ఎటువంటి అవకాశాలు ఇవ్వకపోయినా.. ఓ రకంగా మారి సినిమాతో జీవితాన్ని ఇచ్చాడని అన్నారు. ఆ షూటింగ్ సమయంలో అతడు చాలా సరదాగా ఉండేవాడని, మా మధ్య మంచి బాండింగ్ ఉందన్నారు. ఓ సారి ధనుష్ కీలక నిర్ణయం తీసుకున్నాడని, స్వచ్ఛందంగా మందు మానేశాడన్నారు. ఏ పార్టీలోనూ మందు ముట్టుకోలేదని, అయితే తాను మాత్రం మద్యానికి బానిసై.. చావు అంచుల వరకు వెళితే కానీ జీవితం విలువ తెలియలేదని అన్నారు. అప్పుడే పూర్తిగా మందు మానేసినట్లు చెప్పారు. చెడు అలవాట్లకు పోవద్దని సలహాలిస్తున్నారు రోబో శంకర్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి