iDreamPost
android-app
ios-app

పెద్ద సినిమాలకు కొత్త సమస్యను తెచ్చిపెట్టిన ఓటీటీ రూల్స్!

  • Published Mar 02, 2024 | 8:21 PM Updated Updated Mar 02, 2024 | 8:21 PM

ఓటీటీ సంస్థలు పెట్టిన నయా రూల్స్ పెద్ద సినిమాలకు కొత్త సమస్యను తెచ్చిపెట్టాయి. దీని వల్ల బడా మూవీస్​కు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు.

ఓటీటీ సంస్థలు పెట్టిన నయా రూల్స్ పెద్ద సినిమాలకు కొత్త సమస్యను తెచ్చిపెట్టాయి. దీని వల్ల బడా మూవీస్​కు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు.

  • Published Mar 02, 2024 | 8:21 PMUpdated Mar 02, 2024 | 8:21 PM
పెద్ద సినిమాలకు కొత్త సమస్యను తెచ్చిపెట్టిన ఓటీటీ రూల్స్!

గత రెండు, మూడేళ్లలో ఓటీటీ ఇండస్ట్రీ చాలా మార్పులకు గురైంది. కరోనా దాడి తర్వాత ఒక్కసారిగా ఓటీటీ డీల్స్​కు డిమాండ్ పెరిగింది. అయితే థియేటర్లలో మళ్ళీ సినిమాలు ఆడటం మొదలుపెట్టిన అనంతరం కొద్ది రోజులు తెలుగులో చిన్న సినిమాలకి వరంగా మారింది ఓటీటీ బిజినెస్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తెలుగు సినీ నిర్మాతలకు లాభం రావడం మొదలైంది. ఆ క్రమంలో కొన్ని చిత్రాలు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలయ్యాయి. అయితే తొందర్లోనే ఆ పరిస్థితి తారుమారైంది. కచ్చితంగా థియేటర్లలో ఫిల్మ్​ను విడుదల చేశాకే ఓటీటీలో రిలీజ్ చేస్తామనే కండీషన్ పెట్టాయి ఓటీటీ సంస్థలు. తాజాగా పెద్ద సినిమాలకు కూడా తమ చిన్న కండీషన్ తో కొత్త సమస్యను తెచ్చిపెట్టాయి.

ఈ రోజుల్లో పెద్ద సినిమాలు ఓటీటీ డీల్స్‌కు అనుకున్న విధంగా భారీ బిజినెస్ జరగడం లేదు. అయితే దీని వెనక ఒకే ఒక చిన్న, సాధారణ కారణం ఉంది. ఓటీటీ సంస్థల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. ఇటీవలి కాలంలో కొన్ని పెద్ద సినిమాలు డిజిటల్ బిజినెస్ డీల్స్ సరిగా జరపడంలో విఫలమయ్యాయి. అయితే అందుకు కారణం నిర్మాతలు అడుగుతున్న ధర లేదా బడ్జెట్ కాదు. తాము నిర్మిస్తున్న సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేకపోవడం వల్లే ఈ సమస్య వస్తోందట.

విడుదల తేదీని ముందుగా అనౌన్స్ చేస్తే సినిమాని తీసుకుంటామని ఓటీటీ సంస్థలు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాయి. కానీ కొందరు తెలుగు నిర్మాతలు మాత్రం ఇదే విషయంపై ఫిక్స్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మన స్టార్ డైరెక్టర్ లు, స్టార్ హీరోలు చేసే సినిమాల షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తవడం చాలా తక్కువ సార్లు మాత్రమే జరుగుతుంది. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. అందుకే నిర్మాతలు సినిమా విడుదల తేదీని చాలా ఆలస్యంగా ప్రకటిస్తారు. 2024లో రాబోయే కొన్ని పెద్ద సినిమాలకు సంబంధించిన బిజినెస్ ను OTT ప్లాట్​ఫామ్స్​లో భారీ ధరలకు జరిగిందని వార్తలు వచ్చినప్పటికీ, వాస్తవానికి ఆ ఒప్పందాలను ఇంకా పూర్తి చేయలేదని తెలుస్తోంది. విడుదల తేదీపై స్పష్టత ఇవ్వడంలో నిర్మాతలు విఫలమైనందున ఆ సినిమాలకు ఓటీటీ బిజినెస్ ఇంకా అవలేదు. కాబట్టి, ఇప్పుడు నిర్మాతలు విడుదల తేదీని ముందుగా ప్రకటిస్తేనే ఓటీటీ బిజినెస్ అనుకున్న విధంగా జరుగుతుంది.

ఇదీ చదవండి: పెళ్లి కబురు చెప్పిన వరలక్ష్మి.. కాబోయేవాడి బ్యాగ్రౌండ్ ఇదే!