Nidhan
థియేటర్లో వసూళ్ల ఊచకోత కోసిందా చిత్రం. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కానీ ఆ మూవీ ఓటీటీ లెక్క మాత్రం తెగట్లేదు.
థియేటర్లో వసూళ్ల ఊచకోత కోసిందా చిత్రం. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కానీ ఆ మూవీ ఓటీటీ లెక్క మాత్రం తెగట్లేదు.
Nidhan
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్ల కంటే ఓటీటీల్లోనే ఎక్కువ మూవీస్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నారు ఆడియెన్స్. టాక్ బాగుంది, సూపర్ హిట్ అన్న చిత్రాలను బిగ్ స్క్రీన్స్‌లో చూస్తున్నారు. కాస్త యావరేజ్‌గా ఉన్నా ఓటీటీల్లో చూసేస్తున్నారు. హిట్టయిన మూవీస్‌ను థియేటర్లో మిస్సయితే ఓటీటీల్లో స్ట్రీమింగ్ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. సాధారణంగా ఏ మూవీ అయినా రిలీజైన 6 నుంచి 8 వారాల్లోపు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. అయితే కొన్ని సినిమాల విషయంలో మాత్రం ఇది ఆలస్యమవుతోంది. ఓటీటీ డీల్స్ సెట్ కాకపోవడం, ఇతర కారణాల వల్ల స్ట్రీమింగ్ డిలే అవుతోంది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద జాతర చేసిన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘మంజుమ్మెల్ బాయ్స్’ విషయంలోనూ ఇదే జరుగుతోంది.
మలయాళంలో చిన్న చిత్రంగా విడుదలైన ‘మంజుమ్మెల్ బాయ్స్’ రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజైన ఈ ఫిల్మ్ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ ఫిల్మ్ ఓటీటీ లెక్క మాత్రం ఇంకా తెగట్లేదట. ఈ మూవీ టీమ్ రూ.20 కోట్ల వరకు డిమాండ్ చేస్తుంటే.. పలు ఓటీటీ సంస్థలు మాత్రం రూ.10 కోట్లు మాత్రమే ఇస్తామని అంటున్నాయట. ఇప్పటికే ‘మంజుమ్మెల్ బాయ్స్’ను చాలా మంది థియేటర్లలో చూసేశారు. కాబట్టి ఓటీటీలో ఎక్కువగా రీచ్ ఉండదని ఆయా కంపెనీలు రీజన్స్ చెబుతున్నాయట. అయితే చిత్ర యూనిట్ మాత్రం భారీ ధరకే అమ్మాలని అనుకుంటోందట. అటు ఓటీటీ సంస్థలు అదే ధరకు భీష్మించుకొని కూర్చోవడమే స్ట్రీమింగ్ డిలే అవడానికి కారణమని వినికిడి.
ఇక, మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ను తెలుగులో మార్చి 15వ తేదీన రిలీజ్ చేస్తారనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు పెద్దగా సౌండ్ లేదు. తెలుగు వెర్షన్ విడుదలతో పాటు ఓటీటీ స్ట్రీమింగ్ మీద కూడా స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ‘మంజుమ్మెల్ బాయ్స్’ స్టోరీ సింపుల్‌గానే ఉన్నప్పటికీ.. సర్వైవల్ డ్రామా కావడంతో బిగ్ స్క్రీన్స్‌లో ఆడియెన్స్‌ను థ్రిల్‌కు గురిచేస్తోంది. కేరళతో పాటు తమిళనాడులోనూ ఈ మూవీకి సూపర్‌హిట్ టాక్ వచ్చింది. కేరళలోని మంజుమ్మెల్ అనే ఊళ్లోని కొందరు కుర్రాళ్లు కొడైకెనల్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు జరిగిన ఘటనలను ఆధారంగా చేసుకొని సినిమా ముందుకు సాగుతుంది. ఆ ట్రిప్‌లో స్నేహితుల్లోని ఒకరు గుహలో పడిపోతారు. మిగతా ఫ్రెండ్స్ అంతా కలసి అతడ్ని ఎలా కాపాడారనేది కథ. మరి.. ‘మంజుమ్మెల్ బాయ్స్’ తెలుగు వెర్షన్ కోసం మీరెంతగా ఎదురుచూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Vishwambhara: ‘విశ్వంభర’లో త్రిష స్పెషల్ ట్రీట్!