Nidhan
దర్శకధీరుడు రాజమౌళితో చేయబోయే సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు సూపర్‌స్టార్ మహేష్ బాబు. ఈ మూవీ కోసం కంప్లీట్‌గా మేకోవర్ అయిన ఆయన న్యూ లుక్‌లో అదరగొట్టేశారు.
దర్శకధీరుడు రాజమౌళితో చేయబోయే సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు సూపర్‌స్టార్ మహేష్ బాబు. ఈ మూవీ కోసం కంప్లీట్‌గా మేకోవర్ అయిన ఆయన న్యూ లుక్‌లో అదరగొట్టేశారు.
Nidhan
నయా ప్రాజెక్ట్ ఏదైనా ఒప్పుకున్నారంటే అందులో కొత్తదనం ఉండేలా చూసుకుంటారు హీరోలు. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు, మూవీ లవర్స్‌కు నచ్చేలా న్యూ లుక్స్ ట్రై చేస్తుంటారు. క్యారెక్టర్ డిమాండ్‌ను బట్టి ఒక్కోసారి జట్టు బాగా పెంచుతుంటారు, మాసిన గడ్డం, పొడుగాటి మీసాలతోనూ దర్శనమిస్తుంటారు. బరువు బాగా పెరగడం లేదా తగ్గడం కూడా పాత్ర కోసం చేసే మేకోవర్‌లో భాగమే. అందరి సంగతేమో గానీ దర్శకధీరుడు రాజమౌళి మాత్రం తన హీరోలను సరికొత్తగా ఆవిష్కరిస్తుంటారు. ఇది ఆయన సినిమాలను చూస్తేనే తెలిసిపోతుంది. ఇంతకుమందు చిత్రాల్లో లేని హెయిర్ స్టైల్, బాడీ బిల్డింగ్, డైలాగ్ డెలివరీతో హీరోల్ని ఫ్రెష్‌గా, డిఫరెంట్‌గా ఆయన ప్రెజెంట్ చేస్తుంటారు. సూపర్‌స్టార్ మహేష్ బాబును కూడా అలా కొత్తగా చూపించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. దీనికి మహేష్ న్యూ లుక్ ఉదాహరణ అని చెప్పొచ్చు.
మహేష్ బాబు న్యూ లుక్ బయటకు వచ్చేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన అన్న కొడుకు ఆశిష్ పెళ్లికి పిలవడానికి మహేష్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా నమ్రత, మహేష్‌తో దిగిన ఫొటోలను ఆయన షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ ఫొటోల్లో మహేష్ బాగా జుట్టు పెంచారు. ఆయన గడ్డం కూడా బాగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఎక్కువ హెయిర్‌తో, తక్కువ గడ్డంతో కనిపించే సూపర్‌స్టార్ ఈ ఫొటోలో మాత్రం ఒత్తయిన జుట్టుతో పాటు ఎక్కువ గడ్డంతో దర్శనమిచ్చారు. వీటిని చూసిన అందరూ షాకవుతూనే సూపర్బ్ లుక్ అని అంటున్నారు. బాస్ ఈ లుక్ సూపర్.. కుమ్మేయండి అంటూ సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా హీరోలను సరికొత్తగా చూపించడంలో రాజమౌళిని మించినోళ్లు లేరని అంటున్నారు. ఇది మేం కోరుకునేదని చెబుతున్నారు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చే మూవీకి థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని అంటున్నారు. మరి.. మహేష్ న్యూ లుక్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రాజమౌళి గట్టిగా నిలబడ్డాడు! టెన్షన్ అవసరం లేదు!
#MaheshBabu new look pic.twitter.com/5PdKBRj7wX
— Kakinada Talkies (@Kkdtalkies) February 9, 2024