ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాలన్నీ దాదాపు నెల తిరగకుండానే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. సరే జనాలకు తెలియని సినిమాలు రెండు మూడు వారాలకే స్ట్రీమింగ్ అవుతున్నాయంటే అది వేరు. కానీ.. పాన్ ఇండియా రేంజ్ సినిమాలు కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ లకు ఒకే విధంగా అయిపోయింది. అయితే.. కొన్ని ఓటిటిలకు ప్రొడక్షన్ హౌస్ లతో లింక్స్ ఉండేసరికి.. ఆ సినిమాలు స్ట్రీమింగ్ ఎప్పుడు కావాలో నిర్మాతలే డిసైడ్ చేస్తుంటారు. ప్రస్తుతం జైలర్ విషయంలో అదే జరుగుతుందని అంటున్నారు ఫ్యాన్స్. సూపర్ స్టార్ రజినీకాంత్.. చాలా గ్యాప్ తర్వాత జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే.
రోబో 2 తర్వాత రజినీ నుండి బాక్సాఫీస్ ని షేక్ చేసే సినిమాలు రాలేదు. కానీ.. ఆయన ప్రతీ సినిమా మినిమమ్ ఓపెనింగ్స్ రాబడుతుంటాయి. జైలర్ విషయానికి వస్తే.. బీస్ట్, డాక్టర్ సినిమాల ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్.. జైలర్ ని రూపొందించాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ బిగ్ బడ్జెట్ తో జైలర్ ని నిర్మించారు. అయితే.. ఆగష్టు 10న తమిళ, తెలుగు భాషలతో పాటు హిందీ, కన్నడ, మలయాళం భాషలలో విడుదలైన జైలర్.. ఫస్ట్ డే నుండి పాజిటివ్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ నమోదు చేసింది. వెరసి.. మొదటి వీకెండ్ లోనే దాదాపు రూ. 450 కోట్లకు పైగా వసూల్ చేసింది.
ప్రస్తుతం రూ. 650 కోట్లకు పైగా వసూల్ చేసిన జైలర్.. థియేటర్స్ లో ఇంకా విజయవంతంగా రన్ అవుతోంది. వచ్చే వారం వరకు జైలర్ కి మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. కానీ.. అనూహ్యంగా మేకర్స్ సినిమాని ఓటిటిలో రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయారు. జనరల్ గా థియేట్రికల్ రన్ అయ్యాక కొద్దిరోజులకు సినిమాలను డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తుంటారు. జైలర్ విషయంలో ప్రొడ్యూసర్ అలాంటి గ్యాప్ ఏం ఇవ్వట్లేదు. ఏకంగా నెల తిరగకుండానే ఓటిటిలో రిలీజ్ చేసేస్తున్నాడు. ఆగష్టు 10న రిలీజైన జైలర్ ని.. సెప్టెంబర్ 7 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన ఇచ్చేశారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుంది. మరి జైలర్ ఓటిటి రిలీజ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Jailer’s in town, it’s time to activate vigilant mode! 🔒🚨#JailerOnPrime, Sept 7 pic.twitter.com/2zwoYR6MqV
— prime video IN (@PrimeVideoIN) September 2, 2023