Nidhan
టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘హనుమాన్’ మూవీ నుంచి తాజా ట్రైలర్ బయటకు వచ్చింది. ఈ ట్రైలర్ ఎలా ఉంది? ఇందులో ఏమేం హైలైట్స్ అనేది ఇప్పుడు చూద్దాం..
టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘హనుమాన్’ మూవీ నుంచి తాజా ట్రైలర్ బయటకు వచ్చింది. ఈ ట్రైలర్ ఎలా ఉంది? ఇందులో ఏమేం హైలైట్స్ అనేది ఇప్పుడు చూద్దాం..
Nidhan
‘బాహుబలి’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కార్తికేయ’ లాంటి చిత్రాలు ఇచ్చిన ధైర్యంతో చాలా మంది టాలీవుడ్ మేకర్స్ పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు. లార్జర్ దెన్ లైఫ్ కంటెంట్ ఉన్న కథలు రెడీ చేసుకొని భారీ బడ్జెట్స్, స్టార్ క్యాస్టింగ్‌తో నాలుగైదు భాషల్లో పెద్ద ఎత్తున మూవీస్ రిలీజ్లు చేస్తున్నారు. బడా మేకర్స్ మాత్రమే కాదు.. సరైన స్టోరీ దొరికితే మీడియం, స్మాల్ రేంజ్ డైరెక్టర్స్ కూడా డేర్ చేసి పాన్ ఇండియా సినిమాలు తీసేస్తున్నారు. ఈ క్రమంలో వస్తున్న మరో చిత్రమే ‘హనుమాన్’. ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’ అంటూ ఒకదాంతో ఒకదానికి సంబంధం లేని కథలతో సినిమాలు తీసి విజయాలు అందుకున్న డాషింగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన ‘హనుమాన్’ నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తుంటే సంక్రాంతికి వస్తున్న పెద్ద సినిమాలకు గట్టి పోటీని ఇచ్చేలా ఉంది.
‘హనుమాన్’ ట్రైలర్ క్వాలిటీ చూస్తే పక్కా పాన్ ఇండియా ఫిల్మ్ అనే ఫీలింగ్ కలుగుతోంది. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ.. ఇలా అన్నింటా చాలా రిచ్‌గా ఉంది. తన పవర్‌ను మరింత పెంచుకునేందుకు ఒక బలమైన శక్తి కోసం విలన్ వెతుకుతుండగా వాళ్లకు ‘హనుమాన్’ గురించి తెలియడంతో వార్ స్టార్ట్ అవుతుంది. ఆంజనేయుడి భక్తుడు ఆ విలన్ గ్యాంగ్‌కు వ్యతిరేకంగా ఎలా పోరాడాడు? అనేది కథగా కనిపిస్తోంది. ట్రైలర్ ఓపెనింగ్ షాట్ దగ్గర నుంచి ఆఖరి షాట్ వరకు ప్రతి ఫ్రేమ్ విజువల్ ఫీస్ట్‌లా ఉంది. సూపర్ హీరోగా తేజ సజ్జా ఆకట్టుకుంటున్నారు. ఆయనకు అక్కగా ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ కనిపిస్తున్నారు. ట్రైలర్లో సముద్రఖని కొత్త గెటప్‌లో షాకిచ్చారు. మూవీలో ఆయన రోల్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేలా ఉంది.
‘హనుమాన్’ ట్రైలర్లో విలన్‌గా వినయ్ రాయ్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. ఇంటెన్స్ లుక్‌లో ఆయన చెబుతున్న డైలాగ్స్ బాగున్నాయి. ట్రైలర్లో అన్ని షాట్స్ ఒకెత్తయితే లాస్ట్‌లో హనుమంతుడు రివీల్ అయ్యే సీన్ మాత్రం గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఈ షాట్ థియేటర్లలో ఇంకెంతగా ఆకట్టుకుంటుందో చూడాలి. ఓవరాల్‌గా ట్రైలర్ ద్వారా ‘హనుమాన్’ మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా జనవరి 12న బిగ్స్క్రీన్స్లోకి రానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ బాగుండటం, సూపర్ హీరో కథతో వస్తుండటంతో ప్రశాంత్ వర్మ మూవీకి బజ్ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి బరిలో ఉన్న మహేష్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేష్ ‘సైంధవ’, రవితేజ ‘ఈగల్’ లాంటి బడా మూవీస్‌కు ‘హనుమాన్’ నుంచి టఫ్ కాంపిటీషన్ తప్పేలా లేదు. మరి.. ‘హనుమాన్’ ట్రైలర్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: 2023 నాకు చాలా స్పెషల్..ఎందుకంటే.?