iDreamPost

2023 నాకు చాలా స్పెషల్..ఎందుకంటే.?

ఈ ఏడాది అనేక మంది హీరోలు బాక్సాఫీసు వద్ద సందడి చేశారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లుఅర్జున్ వంటి బడా హీరోలు.. ఈ ఏడాది బరిలోకే దిగలేదు. నాని, ప్రభాస్ లాంటి హీరోలు రెండు సినిమాలతో సందడి చేశారు.. చేస్తున్నారు. అయితే ఈ ఏడాది కలిసొచ్చిందీ అంటే మాత్రం..

ఈ ఏడాది అనేక మంది హీరోలు బాక్సాఫీసు వద్ద సందడి చేశారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లుఅర్జున్ వంటి బడా హీరోలు.. ఈ ఏడాది బరిలోకే దిగలేదు. నాని, ప్రభాస్ లాంటి హీరోలు రెండు సినిమాలతో సందడి చేశారు.. చేస్తున్నారు. అయితే ఈ ఏడాది కలిసొచ్చిందీ అంటే మాత్రం..

2023 నాకు చాలా స్పెషల్..ఎందుకంటే.?

నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దాదాపుగా సూపర్ హిట్స్ అవడమే కాకుండా, నానికి ఆయా సినిమాలు నటుడిగా మంచి పేరుని కూడా తెచ్చి పెట్టాయి. 2008లో రిలీజైన నాని ఫస్ట్ హీరో ఫిల్మ్ అష్టాచెమ్మాతో యంగ్ హీరోగా నిలదొక్కుకున్న నానికి 2011లో వచ్చిన నందినీ రెడ్డి సినిమా అలా మొదలైందితో స్టార్ డమ్ వచ్చింది. ఇంక అక్కడ నుంచి నాని వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2015లో వచ్చి డిఫరెంట్ ఫిల్మ్ గా క్రిటికల్ ఎక్లైమ్ సాధించిన ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత అదే సంవత్సరంలో విడుదలైన భలేభలే మొగాడివోయ్ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో నాని పేరు మరింత క్రేజ్ సంసాదించుకుంది.

ట్రేడ్ లో నాని పేరుకి కమర్షియల్ స్టేటస్ తెచ్చిన సినిమా ఇది. తర్వాత వచ్చిన క్రిష్ణగాడి వీరప్రేమగాథ, జెంటిల్ మేన్, జో అచ్యుతానంద, మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి, మిడిల్ క్లాస్ అబ్బాయి, దేవదాసు, జెర్సీ, నానీస్ గ్యాంగ్ లీడర్, వి, టక్ జగదీష్, అంటే సుందరానికి, హిట్ ది సెకండ్ కేస్ మాత్రం నానిని క్లాస్ మాస్ ప్రేక్షకులకు అతి దగ్గర చేశాయి. 2023లో వచ్చిన దసరా నానిని పూర్తిగా అతని ఇమేజ్ కి దూరంగా తీసికెళ్ళి, కమర్షియల్ బ్లాక్ బస్టర్ కట్టబెట్టింది. మళ్ళీ మాస్ క్యారెక్టర్ నుంచి టోటల్ యు టర్న్ తీసుకుని నాని చేసిన ఇటీవలి చిత్రం హాయ్ నాన్న కూడా నాని ఇమేజ్ ని పండిస్తూ, ట్రేడ్ పరంగా కూడా నిలబెట్టింది. అందుకే నాని 2023 తనకి చాలా స్పెషల్ సంవత్సరం అని చెప్పుకొచ్చాడు.

’ నా కెరీర్లోనే 2023 చాలా స్పెషల్. ఎందుకంటే దసరా, హాయ్ నాన్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజై రెండింటికీ రెండూ మైల్ స్టోన్ సినిమాలయ్యాయి నాకు. మ్యాచ్ గెలుస్తారు అనుకున్న మ్యాచ్ గెలవడం ఒక రకం, గెలుస్తారా లేదా అని వాచ్ చేసినప్పుడు గెలవడం ఒక రకం. ఈ రెండు కేటగిరీస్ లోనూ నన్ను ప్రేక్షకులు గెలిపించారు. తెలుగు ఆడియన్స్ కి ఎప్పటికీ నేను విధేయుడిగా ఉండాల్సిన బాధ్యత నాది.’ అని నాని చెప్పడం ప్రత్యేకతను సంతరించుకుంది.

నిజమే. నాని ఎప్పటికప్పుడు కెరటాలకి ఎదరీదే హీరో. ఎంతో రిస్క్ తో కూడిన కథలనే ఎంపిక చేసుకుకుంటాడు. అంతా తన బాధ్యతే అన్నట్టుగా కొత్త దర్శకులకు తొలి అవకాశాలు కల్పించి మరీ సరికొత్త కథలతో, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులకు ఓ న్యూ ఎక్స్ పీరియన్స్ అందించడానికే ప్రతీ సినిమాని ఓ ఎక్స్ పెరిమెంట్ గా ప్రయత్నిస్తాడు. అలాగే ప్రేక్షకులు కూడా నానికి అలవాటు పడిపోయారు. నాని ఏ సినిమా చేసినా రెగ్యులర్, రొటీన్ కాకుండా నాని చేయడమే నాని కెరీర్ స్పెషాల్టీగా మారింది. అదే నిజానికి ఈ రోజున హాయ్ నాన్న చిత్రానికి ప్లస్ అయిందని చెప్పాలి. మీరేమంటారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి