iDreamPost
android-app
ios-app

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ సక్సెస్ మీట్: పండగ తర్వాత సినిమా రిజల్ట్ అర్థం అవుద్ది: దిల్ రాజు

  • Published Jan 13, 2024 | 4:37 PM Updated Updated Jan 13, 2024 | 4:41 PM

సూపర్​స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. టాక్​తో సంబంధం లేకుండా వసూళ్లలో ఈ మూవీ దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్​ మీట్​లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

సూపర్​స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. టాక్​తో సంబంధం లేకుండా వసూళ్లలో ఈ మూవీ దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్​ మీట్​లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

  • Published Jan 13, 2024 | 4:37 PMUpdated Jan 13, 2024 | 4:41 PM
Guntur Kaaram: ‘గుంటూరు కారం’ సక్సెస్ మీట్: పండగ తర్వాత సినిమా రిజల్ట్ అర్థం అవుద్ది: దిల్ రాజు

తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లన్నీ కళకళలాడుతున్నాయి. సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకుంటూ సినిమాలన్నీ ఒక్కొక్కటిగా బిగ్​స్క్రీన్స్​కు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే సూపర్​స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జా ‘హనుమాన్’, విక్టరీ వెంకటేష్ ‘సైంధవ్’ రిలీజ్ అయిపోయాయి. కింగ్ నాగార్జున ‘నా సామి రంగ’ రేపు విడుదల కానుంది. మహేష్ ‘గుంటూరు కారం’ భారీ ఓపెనింగ్స్​తో అదరగొట్టింది. ‘హనుమాన్’తో స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉన్నా రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాకు మిక్స్​డ్ టాక్ వస్తున్న నేపథ్యంలో తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్​లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గుంటూరు కారం’ రిజల్ట్ ఏంటనేది పండుగ తర్వాతే అర్థం అవుద్దన్నారు. ఒంటిగంటకు పడిన షోలకు ఆడియెన్స్ దగ్గర నుంచి అలాగే సోషల్ మీడియాలో మిక్స్​డ్ టాక్ వచ్చిందన్నారు. తనకు కూడా కొందరు ఫోన్లు చేసి సినిమా యావరేజీ అని చెప్పారని దిల్ రాజు పేర్కొన్నారు.

‘గుంటూరు కారం’ తాను చూశానన్న దిల్ రాజు దాన్ని క్రాస్ చెక్ చేసుకునేందుకు సుదర్శన్ థియేటర్​లో రెండోసారి మూవీ చూశానన్నారు. ‘ఇది ప్రాపర్​గా మహేష్ బాబు క్యారెక్టర్​ను బేస్ చేసుకొని తీసిన సినిమా. ఫ్యామిలీ ఎమోషన్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. తల్లీ కొడుకు మధ్య సెంటిమెంట్​తో నడిచే కథతో తీశారు. అయితే నెగెటివ్ టాక్ వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ అయి బ్లాక్​బస్టర్​గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. ‘గుంటూరు కారం’ ఓ ఫ్యామిలీ ఎంటర్​టైనర్. కుటుంబ సభ్యులు అందరూ కలసి సరదాగా ఎంజాయ్ చేస్తూ చూడాల్సిన చిత్రం. సుదర్శన్​లో నేను మూవీ చూసినప్పుడు అదే ఫీలయ్యా. త్రివిక్రమ్ డైలాగులు, మహేష్ ఫైట్స్, క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్​కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదో పాజిటివ్ ఫిల్మ్’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

కలెక్షన్స్ చూసిన తర్వాత మిక్స్​డ్ రివ్యూలు, నెగెటివ్ టాక్ అన్నీ పోతాయన్నారు దిల్ రాజు. పండుగ తర్వాత వచ్చే వసూళ్లను చూశాకే ‘గుంటూరు కారం’ రిజల్ట్ ఏంటో తెలుస్తుందన్నారు. అప్పటిదాకా ఎలాంటి కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదన్నారు. సినిమా బాగుంటే ఆడియెన్స్ చూస్తారని.. బాగున్న మూవీస్​ను ఎవరూ ఆపలేరన్నారు. సంక్రాంతికి క్లాషెస్ జరగడం సర్వసాధారణమని.. ఇదో వ్యాపారమని దిల్ రాజు స్పష్టం చేశారు. ఇక్కడ ఎవరికీ ఎవరూ మిత్రులు కారు.. శుత్రువులు కారన్నారు. పెట్టిన రెవెన్యూను వెనక్కి తెచ్చుకోవడానికి అందరూ ప్రయత్నిస్తుంటారని పేర్కొన్నారు దిల్ రాజు. ‘గుంటూరు కారం’ నిర్మాత నాగవంశీ కూడా సినిమాపై కొన్ని మిక్స్​డ్ రివ్యూలు వచ్చాయన్నారు. అయితే ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఫ్యామిలీలు థియేటర్లకు వచ్చిన తర్వాత అదంతా పాజిటివ్​గా మారిపోయిందన్నారు. ఇది పక్కా పండుగ సినిమా అని.. ఆడియెన్స్ బాగా ఎంటర్​టైన్ అవుతారని నాగవంశీ తెలిపారు. మరి.. ‘గుంటూరు కారం’ సినిమా మీరు చూశారా? ఒకవేళ మీరు చూసినట్లయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: పూజా హెగ్డే ఇంట విషాదం.. ఏం జరిగిందంటే..?