iDreamPost
android-app
ios-app

The Goat Day 1 Collections: ది గోట్ డే 1 కలెక్షన్లు! ఇది దళపతి మాస్ రేంజ్ వసూళ్లు..

  • Published Sep 06, 2024 | 8:04 AM Updated Updated Sep 06, 2024 | 10:42 AM

The Goat Day 1 Collections, Thalapathy Vijay: దళపతి విజయ్ ది గోట్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. తొలిరోజే భారీ వసూళ్లను సాధించి.. తన రేంజ్ ఏంటో దళపతి మరోసారి చాటిచెప్పాడు. మరి ఫస్ట్ డే విజయ్ ఎన్ని కోట్లు రాబట్టాడో ఇప్పుడు చూద్దాం.

The Goat Day 1 Collections, Thalapathy Vijay: దళపతి విజయ్ ది గోట్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. తొలిరోజే భారీ వసూళ్లను సాధించి.. తన రేంజ్ ఏంటో దళపతి మరోసారి చాటిచెప్పాడు. మరి ఫస్ట్ డే విజయ్ ఎన్ని కోట్లు రాబట్టాడో ఇప్పుడు చూద్దాం.

  • Published Sep 06, 2024 | 8:04 AMUpdated Sep 06, 2024 | 10:42 AM
The Goat Day 1 Collections: ది గోట్ డే 1 కలెక్షన్లు! ఇది దళపతి మాస్ రేంజ్ వసూళ్లు..

‘ది గోట్’.. ప్రస్తుతం థియేటర్ల దగ్గర రచ్చ చేస్తోంది. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దళపతి విజయ్ డ్యూయెల్ రోల్ చేయడం, వెంకట్ ప్రభు డైరెక్షన్ కావడంతో.. ఈ సినిమాపై ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అదీకాక ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఆ హైప్ ఇంకాస్త ఎక్కువైంది. దాంతో బుకింగ్స్ లో కూడా జోరు చూపించాడు దళపతి. తొలిరోజే భారీ వసూళ్లను అందుకుని తన రేంజ్ ఏంటో మరోసారి తెలియజేశాడు. మరి ది గోట్ మూవీ డే 1 లో ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాం.

విజయ్ దళపతి, డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ది గోట్’. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తమిళ్ లో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ.. మిగతా భాషల్లో మంచి టాక్ తో రన్ అవుతోంది. ఇక తెలుగులో విజయ్ తన మార్క్ ను చూపెట్టాడు. అయితే.. లియో రేంజ్ బుకింగ్స్ మాత్రం ఇక్కడ అందుకోలేకపోయాడు. తమిళ్ లో మాత్రం సాలిడ్ వసూళ్లను రాబట్టాడు దళపతి. మరి ది గోట్ తొలిరోజు లెక్కలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ది గోట్ మూవీపై ఫస్ట్ నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. పైగా విజయ్ ద్విపాత్రాభినయం చేస్తుండటం.. ఆ అంచనాలను ఇంకా పెంచాయి. దాంతో అదిరిపోయే బుకింగ్స్ జరిగాయి. థియేటర్లు కూడా హౌస్ ఫుల్ గా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉన్నప్పటికీ.. విజయ్ జోరు చూపించాడు. ఇక్కడ ఫస్ట్ డే రూ. 3 కోట్లను  రాబట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కోలీవుడ్ లో రూ. 38.3 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. హిందీతో రూ. 1.7 కోట్లను వసూళ్ చేసింది. అయితే ఆఫ్ లైన్ టికెట్లు పెరిగితే.. ఈ లెక్క ఇంకా పెరిగే ఛాన్స్ లు ఉన్నాయంటున్నారు సినీ విశ్లేషకులు. దాంతో ఇండియాలోనే ఫస్ట్ డే విజయ్ దాదాపు రూ. 55 కోట్లకు పైగా గ్రాస్.. రూ. 43 కోట్లు నెట్ వసూళ్లను సాధించింది.

ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ. 90 నుంచి 95 కోట్ల గ్రాస్ ను అందుకునేందుకున్నట్లు సమాచారం. కాగా.. ముందు వీకెండ్ ఉండటంతో ఈ మూవీ థియేటర్ల దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ది గోట్ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 185 కోట్లు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 187 కోట్ల షేర్ సాధించాలి. అంటే రూ. 375 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దళపతి విజయ్ రాబట్టాల్సి ఉంటుంది. తొలిరోజే దాదాపు వంద కోట్లు కొల్లగొట్టిన విజయ్.. వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా థియేటర్ల దగ్గర పెద్ద సినిమాలు లేవు. ఇది దళపతికి కలిసొచ్చే అంశం. మరి ది గోట్ తొలిరోజు వసూళ్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio