నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో ఉండదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. నిన్న బసవతారకం హాస్పిటల్ లో జరిగిన బాలయ్య పుట్టినరోజు వేడుకల్లో మోక్షుని చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.మోక్షజ్ఞకు శరీరం మీద అదుపు లేదని అర్థమైపోయింది. పొట్ట కూడా కనిపిస్తోంది. హైట్ కు తగ్గ బరువు లేకపోవడం స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవలి ఇంటర్వ్యూలలో త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనేలా సంకేతాలు ఇచ్చిన […]
బాలకృష్ణ గర్జన మళ్లీ వినపడింది. యూట్యూబ్ భూకంపం వచ్చినట్టు వికలమైంది. బాలయ్య వస్తూ ఉంటే నేల దద్దరిల్లి, దుమ్ము లేచింది. ఎలక్ట్రిక్ రంపాలతో కొందరు ఆయన మీదికి వెళ్తున్నారు. వాళ్లకు బాలయ్య సంగతి తెలియదు. ఆయన తొడ కొడితే ప్యాంట్ మీద లేచిన దుమ్ము, రంపపు పొట్టు కంటే ప్రమాదం. ప్రేక్షకులు ఎన్నోసార్లు ఆ రంపపు కోత భరించారు. ఈ సీన్ తర్వాత ఎవడికో నీతి బోధ చేస్తారు. మాట్లాడే పద్ధతి గురించి చెప్పి ‘‘లండీ కొడకా’’ […]
300పైగా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని సుస్థిర స్థానం సంపాదించుకున్న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ వెండితెర వారసత్వాన్ని భుజాలపై మోయడమంటే మాటలు కాదు….. కోట్లాది అభిమానుల అంచనాలు అందుకుంటూ వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఉంటూనే తనకంటూ ప్రత్యేకమైన ముద్ర సంపాదించుకోవడం సులువు కాదు….. క్లాసు మాసు తేడా లేకుండా అన్ని వర్గాల వీక్షకులను నటనా మాయాజాలంతో మురిపించి దశాబ్దాలకు పైగా స్టార్ గా తన స్థానాన్ని సుస్థిరపరుచుకోవడం అందరివల్లా కాదు….. తండ్రికున్న పదమూడు […]
టాలీవుడ్ పరంగా కంటెంట్ పరంగా ఎన్ని ప్రమాణాలు పెరుగుతున్నా మాస్ సినిమాకుండే ఆదరణే వేరు. స్టార్లకు సరైన కంటెంట్ పడాలే కాని రికార్డుల ఊచకోత ఖాయమని గతంలో చాలా సార్లు రుజువయ్యింది. కోట్లాది రూపాయల మార్కెట్ ఏర్పడడానికి ఇవే ప్రధాన కారణం. అందులోనూ నందమూరి బాలకృష్ణ గురించి చెప్పేదేముంది. ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో ఓ అరుదైన సందర్భంలోనిది. 1993లో విడుదలైన నిప్పురవ్వ మూవీ అప్పటిదాకా బాలయ్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన […]
బోయపాటి శీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. పరిస్థితి సద్దుమణగగానే తిరిగి మొదలుపెట్టబోతున్నారు. అయితే ఇప్పుడు దీని తాలూకు ఒక వార్త అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. దాని ప్రకారం ఈ సినిమాలో విలన్ గా భూమిక చావ్లా నటించబోతుదన్నది దాన్ని సారాంశం. యూనిట్ నుంచి అధికారికంగా తెలియనప్పటికీ దాదాపు ఖరారు అయినట్టేనని సమాచారం. భూమికా అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ఖుషి. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన […]
కరోనా మహమ్మారి దేశాన్ని కబళిస్తున్న వేళ సినిమా పరిశ్రమ నుంచి సహాయం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ప్రధాని పిఎం కేర్స్ కి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిధులకు విరాళాలు ఇస్తూనే మరోవైపు సినీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటికి సైతం విరివిగా డొనేషన్లు అందజేస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ తన పెద్ద మనసు చాటుకున్నారు. హీరోగా, హిందూపూర్ ఎమెల్యేగా, బసవతారకం హాస్పిటల్ చైర్మన్ గా తన తరఫున […]
( ఇండస్ట్రీ రికార్డుల్లో కొత్త చరిత్ర సృష్టించిన ఓ మాస్ సినిమా గురించి ఇతర హీరో అభిమాని మాటల్లో ) 1999వ సంవత్సరం – జనవరి 18 రాయలసీమ ప్రాంతంలో ఓ చిన్న పట్టణం …….. అపోజిషన్ హీరో అన్న అక్కసుతో అప్పటికే నాలుగు రోజులు బిగదీసుకుని ఆ సినిమాకు వెళ్ళకుండా మనసు చంపుకున్నాను. పైగా దానికి రెండు వారాల ముందు విడుదలైన మా చిరంజీవి ‘స్నేహం కోసం’ సెంటిమెంట్ తో ఫాన్స్ ని, కలెక్షన్లు తగ్గి […]
ఫాంటసీ సినిమాల్లో సైంటిఫిక్ ఎలిమెంట్స్ మిక్స్ చేసుకున్న మొదటి చిత్రంగా 1991లో విడుదలైన ఆదిత్య 369 రేపిన సంచలనం అందరికి తెలిసిందే. భూత వర్తమాన భవిష్యత్ కాలాలను కలుపుతూ దర్శకులు సింగీతం శ్రీనివాస రావు గారు చేసిన మేజిక్ కి ప్రేక్షకులు మైమరిచిపోయారు. ముఖ్యంగా ఇళయరాజా సంగీతం గట్టి వెన్నెముకగా నిలిచిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు సాధించలేదు కానీ కమర్షియల్ లెక్కల్లో ఘన విజయాన్నే సొంతం చేసుకుంది. ఇక్కడ చూస్తున్న పిక్ గుర్తు పట్టారుగా. సెకండ్ […]
నందమూరి బాలకృష్ణ అంటే ఒక బ్రాండ్. ఒకప్పుడు కేవలం ఈయన పేరు మీదే అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చేవి. మాస్ ఇమేజ్ లో చిరంజీవి తర్వాత ఇంకోమాటలో చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో ఆయన కంటే ఎక్కువ మార్కెట్ ఉండటం బాలయ్య ప్రత్యేకత. కాని కాని అదంతా గతం. వర్తమానం చూస్తే దీనికి టోటల్ రివర్స్ లో ఉంది. అర్థం పర్థం లేని హీరోయిజం ఉన్న కథలను అభిమానులు కూడా మెచ్చరని రూలర్ ఫలితం వసూళ్ళ సాక్షిగా రుజువు చేసింది. […]