ప్రభుత్వాన్ని గాడిలో పెట్టే యత్నం చేస్తూనే పార్టీని కూడా ఉత్తేజితం చేసేందుకు జగన్ దృష్టి సారించారు. దానికి అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి శాసనసభాపక్ష సమావేశంలో భవిష్యత్తు గురించి ఎమ్మెల్యేలకు సూచనప్రాయంగా తెలిపారు. వచ్చే ఎన్నికలకోసం ఇప్పటి నుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూటిగానే చెప్పారు. మళ్లీ పోటీలో ఉండాలంటే ఎమ్మెల్యేలంతా మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిందేనని తేల్చేశారు. అదే సమయంలో పనితీరు పరంగానూ, ఇతర వ్యవహారాల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్న 50 మంది ఎమ్మెల్యేలకు […]
గత సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరఫున 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో దాదాపు సగం మంది కొత్తవారే. వీరిలో అధిక శాతం మంది సీఎం వైఎస్ జగన్‌కు సమకాలికులే. రాబోయే 30 ఏళ్లపాటు ప్రజలకు ముఖ్యమంత్రిగా సేవలందించాలనే అభిలాషతో సీఎం వైఎస్ జగన్ ఉన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ఆయన వ్యక్తపరిచారు. అందుకు అనుగుణంగానే సీఎం జగన్ పాలన సాగిస్తున్నారు. ప్రజల అభిమానాన్ని చూరగొనేందుకు, నమ్మకాన్ని పొందేందుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే […]
వైసిపి అంతర్గత వ్యవహారాలపై కొద్దిరోజులుగా వరుసగా కథనాలు అచ్చేస్తున్న ఎల్లోమీడియాకు కొందరు ఎంఎల్ఏలు షాకిచ్చారు. తాము పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నామంటూ రాసిన రాతలపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజారంజక పాలనను అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిపై తమకు అసంతృప్తి వుండాల్సిన అవసరం ఏమిటంటే ఎంఎల్ఏలు, ఎంపి నిలదీశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇసుక కొరత లాంటి సమస్యలను లేవనెత్తామే కానీ తాము అసంతృప్తితో ఉన్నట్లు ఎప్పుడూ చెప్పలేదంటూ ఎల్లోమీడియాను వాయించేశారు. పార్టీ ఎంఎల్ఏలు బొల్లా బ్రహ్మనాయుడు, చిర్ల జగ్గిరెడ్డి, సీదిరి […]