పిల్లలకు జ్వరం, దగ్గు లేదా జలుబు లాంటివి వస్తే సిరప్లు తాగిస్తుంటారు. పెద్దలకు ఇచ్చినట్లు సూదులు, ట్యాబ్లెట్స్ను ఎక్కువగా ఇవ్వరు. ముఖ్యంగా చిన్నారులకు వైద్యులు సిరప్లు ఇస్తుంటారు. అయితే అధిక లాభాపేక్షతో కొన్ని కంపెనీలు నాసిరకం మందులను తయారు చేస్తున్నాయి. చిన్న పిల్లలకు ఇచ్చే మందుల్లో కూడా నాసిరకంవి వస్తున్నాయి. అలాంటి ఒక నాసిరకం సిరప్ విషయంలో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ఇండియాలో తయారై ఇరాక్‌లో అమ్ముడవుతున్న మరో నాసిరకం […]
దేశంలో కరోనా మరణాలు ఎన్ని..? అసలు కరోనా వల్ల ఎంతమంది చనిపోయారు..? అనే ప్రశ్నలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలను లెక్కించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రయత్నాలు ప్రారంభించగా.. సదరు సంస్థ అనుసరిస్తున్న ప్రమాణాలు తమకు సరిపోవని భారతదేశం చెబుతుండడంతో వివాదం నెలకొంది. భారత్ అనుసరిస్తున్న విధానంపై అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు రాయడంతో.. భారత్‌లో కరోనా మరణాల సంఖ్యపై మరోసారి రాజకీయ రగడ ప్రారంభమైంది. దేశంలో కరోనా మరణాలు 40 లక్షలకుపైగా […]
కోవిడ్ 19 వచ్చాక ఆర్ధిక, సామాజిక స్థాయీ బేధాల్లో తీవ్రమైన మార్పులే వచ్చాయి. వీటిని అనుసరించే వాళ్ళు ఉండనీ ఉండకపోనీ.. కానీ కోవిడ్ ముందు అందరూ ఒక్కటేనని ఇప్పటికే అనేకసార్లు తీర్పువచ్చేసింది. సామాన్యుడి నుంచి దేశా«ద్యుక్షుల వరకు కోవిడ్‌కు అతీతులేమీ కాదని తేల్చేసింది. అయితే దీనిని గురించి పట్టించుకోకుండా ఇంకా కొంత మంది అతి తెలిపిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. తమతమ దేశాల్లోని ప్రజలందరికీ వ్యాక్సిన్లు కావాలని ముందుగానే డబ్బులు పెట్టి ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. ఇది ఆయా దేశాల […]
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని ఎంతలా వణికించేస్తోందో అందరూ చూస్తున్నదే. వైరస్ పుట్టినల్లయిన చైనాలోని వూహాన్ లో మొట్టమొదటి కేసు నమోదైనపుడు దాన్ని అంతుచిక్కని న్యుమోనియాగా నిపుణులు, డాక్టర్లు అభిప్రాయపడ్డారట. చాలా రోజుల తర్వాత కానీ ఇది కరోనా వైరస్ అన్న విషయాన్ని గుర్తించలేకపోయినట్లు చైనా విడుదల చేసిన శ్వేతపత్రంలో స్పష్టం చేసింది. ప్రపంచంలో వైరస్ చేస్తున్న విధ్వంసానికి చైనానే కారణమని, డ్రాగన్ దేశమే బాధ్యత వహించాలనే డిమాండ్లు పెరిగిపోతున్న నేపధ్యంలో చైనా ఒత్తిడికి లొంగి చివరకు […]
ప్రపంచ ఆరోగ్య సంస్ధకు ఊహించని షాకిచ్చింది అగ్రరాజ్యం అమెరికా. డబ్ల్యూహెచ్ఓతో అన్నీ రకాలుగా తమ సంబంధాలను తెంచుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ ప్రకటిస్తారని ఎవరూ ఊహించలేదు. కరోనా వైరస్ సమస్య వచ్చిన దగ్గర నుండి ట్రంప్ ఇటు చైనా అటు డబ్ల్యూహెచ్ఓపై చాలాసార్లు మండిపడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సంస్ధకు ఇస్తున్న నిధులను కూడా తాత్కాలికంగా నిలిపేయటంపై ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రపంచదేశాలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిధులను ట్రంప్ ఆపేయటం […]
ప్రాణాంతక కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తేనే అంతర్జాతీయ హాకీ పోటీలను నిర్వహిస్తామని ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్) ప్రకటించింది. హాకీ క్రీడా పోటీలను 5 దశలలో పునరుద్ధరిస్తామని ఎఫ్ఐహెచ్ తెలిపింది. మొదటిదశలో సామాజిక దూరం పాటిస్తూ నెదర్లాండ్స్,బెల్జియం దేశాలలో శిక్షణతో అంతర్జాతీయ హాకీ కార్యకలాపాలు ప్రారంభిస్తాము.తదుపరి దశలో ప్రాంతీయ టోర్నీల నిర్వహణ ఉంటుంది. అలాగే మూడో దశలో పొరుగు దేశాలలో జరిగే టోర్నీలలో మ్యాచులు జరుగుతాయి. తర్వాత ఖండాంతర టోర్నీలు నిర్వహిస్తూ, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక […]
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తన లేఖల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసిన చంద్రబాబు.. తాజాగా ఈ రోజు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. విపత్తులు వచ్చినప్పుడే నాయకత్వ సమర్థత బయట పడుతుంది. కానీ ప్రస్తుతం ఏపీ పరిస్థితి చూస్తే కరోనా నియంత్రణ చేతగాక కరోనా తో కలిసి జీవించాలి.. అంటూ […]
దేశంలో పరిస్థితిపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యంగా లాక్ డౌన్ కొనసాగించాలా లేదా అన్నది అంతుబట్టని విషయంగా మారింది. ఈవిషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చివరకు సీఎంల సమావేశంలో కూడా ప్రధాని ముందు పలు రకాల వాదనలు వినిపించాయి. దాంతో కేంద్రం మే 3 తర్వాతి పరిస్థితిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దీనిపై కీలక అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచంలో అప్పటికే పలు దేశాలు లాక్ డౌన్ ని అనుసరిస్తున్న సమయంలో మార్చ్ 24 అర్థరాత్రి నుంచి […]
రంజాన్ సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముస్లిం సంస్థలకు జాతీయ ఆరోగ్య సంస్థలు తెలియజేయాలని డబ్ల్యూహెచ్ఓ కోరింది.ఈ మాసంలో ముస్లిములు సామూహిక ప్రార్థనలు రద్దుచేసుకుని ప్రత్యామ్నాయంగా డిజిటల్,సోషల్ మీడియా లాంటి వేదికలను ఉపయోగించుకోవాలని సూచించింది.ఇఫ్తార్ విందులకు బదులుగా ఆహారం ప్యాక్ చేసి పంపాలని సూచనలు చేసింది. నమాజ్‌కు ముందు 70 శాతం ఆల్కహాల్ ఉన్న శానిటైజర్,సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలంది.ఇఫ్తార్ సమయంలో వ్యర్థాలను డస్ట్‌బిన్‌లో వెయ్యాలని తెలిపింది.ప్రార్థనల సమయంలో కార్పెట్‌పై వ్యక్తిగత […]
అగ్రరాజ్యం అమెరికా అధిపతి డొనాల్డ్ జే ట్రంప్ కు కోపం వస్తే ఏమి చేస్తాడో ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ)కు బాగా తెలిసివచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో చైనాపై ట్రంప్ కు బాగా కోపం ఉంది. అదే సమయంలో చైనాను వెనకేసుకొచ్చిని డబ్ల్యూహెచ్ఓ అంటే కూడా బాగా మండిపోతున్నాడు. చైనా నుండి వచ్చిన ముప్పుకన్నా డబ్ల్యూహెచ్ఓ వల్ల ప్రపంచానికి జరిగిన నష్టమే ఎక్కువని ట్రంప్ అభిప్రాయపడుతున్నాడు. అందుకనే అమెరికా నుండి డబ్ల్యూహెచ్ఓకి వెళ్ళే నిధులను నిలిపేస్తు […]