iDreamPost
android-app
ios-app

రంజాన్ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు:

రంజాన్ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు:

రంజాన్ సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముస్లిం సంస్థలకు జాతీయ ఆరోగ్య సంస్థలు తెలియజేయాలని డబ్ల్యూహెచ్ఓ కోరింది.ఈ మాసంలో ముస్లిములు సామూహిక ప్రార్థనలు రద్దుచేసుకుని ప్రత్యామ్నాయంగా డిజిటల్,సోషల్ మీడియా లాంటి వేదికలను ఉపయోగించుకోవాలని సూచించింది.ఇఫ్తార్‌ విందులకు బదులుగా ఆహారం ప్యాక్ చేసి పంపాలని సూచనలు చేసింది.

నమాజ్‌కు ముందు 70 శాతం ఆల్కహాల్ ఉన్న శానిటైజర్,సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలంది.ఇఫ్తార్‌ సమయంలో వ్యర్థాలను డస్ట్‌బిన్‌లో వెయ్యాలని తెలిపింది.ప్రార్థనల సమయంలో కార్పెట్‌పై వ్యక్తిగత రగ్గులను వాడాలని సూచించింది.ప్రార్థనల కోసం ఒకే ప్రదేశంలో గుమిగూడం ప్రమాదకరమని పేర్కొంది.వ్యక్తుల మధ్య సామాజిక దూరం పాటిస్తూ రంజాన్ మాసంను జరుపుకుంటే కరోనా బారినపడకుండా ప్రజలను రక్షించవచ్చని పేర్కొంది.

ఉపవాస దీక్షలో ఉన్న వాళ్లు ఉమ్మి కూడా మింగకుండా బయటకు ఉస్తారు.ఉమ్మి ద్వారా కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై తగిన సూచనలను మతపెద్దలకు డబ్ల్యూహెచ్ఓ మరియు ప్రభుత్వాలు ఇవ్వాల్సి ఉంది.