iDreamPost
android-app
ios-app

ప్రపంచ ఆరోగ్య సంస్థలో తెలుగు వ్యక్తికి కీలక పదవి!

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు వివిధ దేశాల్లో స్థిర పడ్డారు. ఇక తరచూ ఏదో ఒక సందర్భంలో తెలుగు వారికి అరుదైన అవార్డులు, పురష్కారాలు లభిస్తుంటాయి. తాజాగా ఖమ్మం జిల్లా వాసికి ప్రపంచ స్థాయిలో ఓ అరుదైన గౌరవం దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు వివిధ దేశాల్లో స్థిర పడ్డారు. ఇక తరచూ ఏదో ఒక సందర్భంలో తెలుగు వారికి అరుదైన అవార్డులు, పురష్కారాలు లభిస్తుంటాయి. తాజాగా ఖమ్మం జిల్లా వాసికి ప్రపంచ స్థాయిలో ఓ అరుదైన గౌరవం దక్కింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థలో తెలుగు వ్యక్తికి కీలక పదవి!

ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడ ఉన్నా తమ ప్రత్యేకతను చాటుకుంటారు. తమదైన ప్రతిభతో తెలుగు జాతి కీర్తీని ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అంతేకాక..కొన్ని దేశాల్లో అయితే ఏకంగా  రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మన దేశంలో ఉంటున్న తెలుగు వారు.. తమ ప్రతిభతో ప్రపంచ సంస్థలో కీలక పదవులు చేపడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా వాసికి అరుదైన గౌరవం లభించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఖమ్మం జిల్లాకు చెందిన అడపా కార్తీక్ ఐఏఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసి.. సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు. 2007 జరిగిన యూపీఎస్సీ పరీక్షల్లో కార్తీక్ టాపర్ గా నిలిచారు. అనంతరం పంజాబ్‌ కేడర్‌కు వెళ్లి అంచెలంచెలుగా ఎదిగాడు. అక్కడ తనదైన పాలనతో కార్తీక్ మంచి గుర్తింపు పొందారు. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడంలో ఆయన ముందుంటారు. అందుకే అక్కడి ప్రజలకు కార్తీక్ అంటే ప్రత్యేక అభిమానం. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలోనే ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయనకు అరుదైన గౌరవం లభించింది.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో కీలక పదవి వరించింది. కార్తీక్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసియా విభాగంలో సలహాదారుగా నియమితులయ్యారు. ఆయన జాబ్ చేస్తున్న సమయంలోనే అమెరికాలోని ఉత్తర కరోలినా విశ్వవిద్యాలయంలో క్యాన్సర్ నిర్మూలన అంశంపై పీహెచ్ డీ పూర్తి చేశారు. ప్రస్తుతం దిల్లీలోని సౌత్‌ బ్లాక్‌లో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ  రీజనల్ ఆఫీస్ లో రెండేళ్ల పాటు సలహాదారుగా బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారుగా కార్తీక్ నియామకం పట్ల అతని బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక తమ జిల్లా వాసికి అరుదైన గౌరవం లభించడంతో ఖమ్మం జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి.. తెలుగు వ్యక్తి.. ఇలాంటి అరుదైన ఘనత లభించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.