Tirupathi Rao
What Is Parrot Fever: ప్రస్తుతం అందరూ పారెట్ ఫీవర్ గురించి కంగారు పడుతున్నారు. అసలు ఈ పారెట్ ఫీవర్ అంటే ఏంటి? ఎలా వ్యాపిస్తుంది.
What Is Parrot Fever: ప్రస్తుతం అందరూ పారెట్ ఫీవర్ గురించి కంగారు పడుతున్నారు. అసలు ఈ పారెట్ ఫీవర్ అంటే ఏంటి? ఎలా వ్యాపిస్తుంది.
Tirupathi Rao
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పారెట్ ఫీవర్ గురించి ఎక్కువగా వినిపిస్తోంది. ఇన్నాళ్లు మంకీ ఫీవర్ గురించి భయపడ్డారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి పారెట్ ఫీవర్ కూడా చేరింది. ప్రస్తుతం యూరప్ దేశాలను ఈ పారెట్ ఫీవర్ వణికిస్తోంది. ఈ పారెట్ ఫీవర్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరి.. అంత ప్రమాదకరంగా చెబుతున్న పారెట్ ఫీవర్ లక్షణాలు ఏంటి? ఎలా వ్యాపిస్తుంది? ఎక్కడి నుంచి వ్యాపిస్తుంది? అనే విషయాలు తెలుసుకుందాం.
ప్రస్తుతం యూరప్ దేశాల్లో ఈ పారెట్ ఫీవర్ కారణంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పారెట్ ఫీవర్ ని సిటాకోసిస్ అని కూడా అంటారు. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి 2023 ప్రారంభంలో ప్రబలింది. గతేడాది ఈ పారెట్ ఫీవర్ కి సంబంధించి 14 కేసులు నమోదు అయ్యాయి. మళ్లీ 2024 ప్రారంభంలో ఫిబ్రవరిలో వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఫిబ్రవరి 27 వరకు డెన్మార్క్ దేశంలో మొత్తం 23 మందిలో ఈ పారెట్ ఫీవర్ లక్షణాలు కనిపించాయి. అలాగే ఒకరిలో వ్యాధి నిర్ధారణ కూడా అయ్యింది. జర్మనీలో ఇప్పటికే 5 కేసులు నమోదు అయ్యాయని వైద్యులు తెలిపారు. ఇలాగే కొనసాగితే ఈ వ్యాధి మరింత వ్యాపించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.
ఈ పారెట్ ఫీవర్ ను సిటాకోసిస్ అని కూడా అంటారు. ఇది క్లామినియా ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది. ఈ వ్యాధి పెంపుడు పక్షలు, అడవి పక్షులు, కోళ్ల కారణంగా వ్యాపిస్తుంది. నిజానికి వాటిలో ఈ వ్యాధి ఉంది అని కూడా కనుక్కోవడం కష్టమని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ వ్యాధి సోకినా పక్షుల్లో ఈ లక్షణాలు అంతగా కనపడవని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి వ్యాపించేందుకు పక్షులు శ్వాస తీసుకోవడం, మల విసర్జనలే కారణంగా చెబుతున్నారు. వాటి వల్లే ఈ పారెట్ ఫీవర్ బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. ఆ డస్ట్ ని పీల్చినప్పుడు మనుషులు కూడా ఈ పారెట్ ఫీవర్ బారిన పడతారని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్స్ వాళ్లు వెల్లడించారు.
అడవి పక్షులు, పెంపుడు పక్షులతో అనుబంధంగా ఉండేవారికి ఈ వ్యాధి వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే పక్షుల నుంచి మనుషులకు వచ్చే ఈ వ్యాధి.. మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే ఆస్కారం ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. ఇప్పటివరకు వచ్చిన కేసులన్నీ పక్షులతో కాంటాక్ట్ ఉన్న వారికే వచ్చినట్లు డబ్ల్యూహెచ్వో తెలిపింది. ఈ వ్యాధి సోకిన తర్వాత అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుంత వైద్యులు, ఆరోగ్య నిపుణులు యూరప్ దేశాలు సహా ఎఫెక్టెడ్ దేశాల్లో ప్రజలను, పెంపుడు పక్షులు కలిగిన వారిని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.