nagidream
Dangerous Salt: మనం డైలీ వినియోగించే సాల్ట్.. డెత్ సాల్ట్ గా మారింది. రోజుకు 10 వేల మంది.. ఏటా 40 లక్షల మంది ఉప్పు వల్ల చనిపోతున్నారు. అందులో కూడా మగాళ్లే ఎక్కువగా చనిపోవడం గమనార్హం. ఈ క్రమంలో డబ్ల్యుహెచ్ఓ హెచ్చరించంది. దీనికి గల కారణాలు ఏంటంటే?
Dangerous Salt: మనం డైలీ వినియోగించే సాల్ట్.. డెత్ సాల్ట్ గా మారింది. రోజుకు 10 వేల మంది.. ఏటా 40 లక్షల మంది ఉప్పు వల్ల చనిపోతున్నారు. అందులో కూడా మగాళ్లే ఎక్కువగా చనిపోవడం గమనార్హం. ఈ క్రమంలో డబ్ల్యుహెచ్ఓ హెచ్చరించంది. దీనికి గల కారణాలు ఏంటంటే?
nagidream
అతిగా ఉప్పు తింటున్నారా? అయితే మీరు డేంజర్ జోన్ లో పడ్డట్టే. రోజుకు ఎంత ఉప్పు తినాలో తెలుసా? తెలియకపోతే ప్రాణాలకే ముప్పు. అవును సాల్ట్ చాలా డేంజరస్ అని.. ప్రాణాంతకమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. అతిగా ఉప్పు వినియోగించడం ప్రాణాలకే ప్రమాదం అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తుంది. ఉప్పు అతిగా వినియోగించడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండదని.. అది ప్రాణాంతకంగా మారుతుందని ఇటీవల తన నివేదికలో తెలిపింది. యూరప్ లో ఉన్న వారు ఎక్కువగా సాల్ట్ వినియోగిస్తారు. 30 నుంచి 79 ఏళ్ల వయసున్న వారిలో ముగ్గురు కంటే ఎక్కువ మంది రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
‘యాక్షన్ ఆన్ సాల్ట్ అండ్ హైపర్ టెన్షన్’ పేరుతో ఒక నివేదికను కోరింది. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సాల్ట్ వినియోగాన్ని తగ్గించడానికి, రక్తపోటుని మెరుగ్గా గుర్తించేలా, నియంత్రించేలా ఎలాంటి విధానాలను అవలంభించాలన్న దానిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోరింది. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం.. యూరప్ ప్రాంతంలో ఉండేవారికి అంగ వైకల్యం, అకాల మరణాలకు గుండె సంబంధిత వ్యాధులే ప్రధాన కారణం. దీని వల్ల ఏటా 42.5 శాతం మంది చనిపోతున్నారని.. ఇది రోజుకు 10 వేల మరణాలతో సమానమని నివేదికలో తేలింది. ఆడవారితో పోలిస్తే మగవారిలోనే ఈ మరణాలు అధికంగా ఉన్నాయని తెలిపింది. ఆడవారితో పోలిస్తే 2.5 శాతం మంది మగవారు గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని పేర్కొంది.
ఇందులో 30 నుంచి 69 ఏళ్ల వయసు వారే అధికంగా ఉన్నారని తేలింది. వెస్టర్న్ యూరప్ తో పోలిస్తే ఈస్టర్న్ యూరప్, సెంట్రల్ యూరప్ లలో ఐదు రెట్లు అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. ఏటా 40 లక్షల మంది గుండె సంబంధిత వ్యాధుల కారణంగా చనిపోతున్నారని.. ఇందులో మగాళ్లే అధికంగా ఉంటున్నారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అయితే ఇందుకు పరిష్కారం కనుగొనేందుకు డబ్ల్యూహెచ్ఓ ప్రయత్నిస్తోంది. 2030 నాటికి 25 శాతం సాల్ట్ వినియోగాన్ని తగ్గించి తద్వారా 9 లక్షల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా విధానాలను అమలుచేస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్లే రక్తపోటు, హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ సహా ఇతర గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని తేలింది. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఫుడ్ తినడం వల్ల ఈ మరణాలు ఎక్కువయ్యాయని వెల్లడించింది.
ప్రాసెస్ చేసిన ఫుడ్స్ లో ఉప్పు ఎక్కువగా వినియోగిస్తున్నారని.. అది తగ్గిస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపింది. యూరప్ లో సాల్ట్ డేంజర్ బెల్స్ మోగించిన క్రమంలో డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఉప్పు వినియోగాన్ని తగ్గించకపోతే ముప్పు వాటిల్లుతుందని తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ సూచించిన దాని ప్రకారం ఒక మనిషి రోజుకు 5 గ్రాముల సాల్ట్ తీసుకోవాలి. కానీ మన దేశంలో 8 గ్రాముల సాల్ట్ తీసుకుంటున్నారు. అది డబ్ల్యూహెచ్ఓ సూచించిన దాని కంటే ఎక్కువ. అధికంగా ఉప్పు వినియోగించడం వల్ల రక్తపోటు, గుండె వ్యాధులు, గుండెపోటు, స్టమక్ అల్సర్, కిడ్నీ సమస్యలు సహా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తేలింది. కాబట్టి సాల్ట్ వినియోగాన్ని తగ్గిస్తే మంచిది.