iDreamPost
android-app
ios-app

ప్రతి రోజూ 3500 మందిని బలిగొంటున్న వ్యాధి! ఎలా అడ్డుకోవాలి?

  • Published Apr 20, 2024 | 5:05 PM Updated Updated Apr 20, 2024 | 5:05 PM

Viral Hepatitis, WHO: ప్రతి రోజు 3500 మంది ప్రాణాలను ఓ వ్యాధి బలిగొంటోంది. అసలు ఆ వ్యాధి ఏంటి? ఎందుకు అంత ప్రమాదకరంగా మారుతోంది? దానిన్ని ఎలా అడ్డుకోవాలి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Viral Hepatitis, WHO: ప్రతి రోజు 3500 మంది ప్రాణాలను ఓ వ్యాధి బలిగొంటోంది. అసలు ఆ వ్యాధి ఏంటి? ఎందుకు అంత ప్రమాదకరంగా మారుతోంది? దానిన్ని ఎలా అడ్డుకోవాలి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 20, 2024 | 5:05 PMUpdated Apr 20, 2024 | 5:05 PM
ప్రతి రోజూ 3500 మందిని బలిగొంటున్న వ్యాధి! ఎలా అడ్డుకోవాలి?

మూడేళ్ల క్రితం కరోనా పేరు చెబితే అంతా వణికిపోయారు. ఆ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంతో కోట్ల మందిని బలితీసుకుంది. అయితే.. కరోనా విజృంభణ తర్వాత 2022లో అత్యధిక మరణాలు వైరల్‌ హైపటైటిస్‌, టీబీ కారణంగా సంభవించాయంటే నమ్మడం కష్టంగా ఉండొచ్చు. కానీ, అదే నిజం. వైరల్ హెపటైటిస్‌తో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య భారత్‌లోనే ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్ 2024లో స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైరల్ హెపటైటిస్ రోగుల్లో 11 శాతం మంది మన దేశంలోనే ఉన్నారు. అయితే.. ఈ వైరల్‌ హైపటైటిస్‌ వ్యాధి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ 3500 మరణిస్తున్నారు.

అసలేంటి ఈ హైపటైటిస్‌..?
హెపటైటిస్ అనేది ఓ కాలేయ వ్యాధి. 5 రకాల వైరస్‌ల ద్వారా ఇది సంక్రమిస్తుంది. వీటిల్లో హెపటైటిస్ ఏ, ఈ.. అనేవి కలుషిత నీరు, ఆహారం ద్వారా వస్తాయి. జ్వరం, పొత్తికడుపునొప్పి, కామెర్లు, మూత్రం నల్లగా రావడం ఈ వ్యాధి లక్షణాలు. కలుషిత సిరంజిలు, సూదుల ద్వారా హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ సంక్రమిస్తాయి. హెపటైటిస్ బీతో బాధపడుతున్న వారికి హెపటైటిస్ డీ కూడా సంభవిస్తుంది. 2022లో ప్రపంచ వ్యాప్తంగా 187 దేశాలలో ఒక కోటి 30 లక్షలమంది హెపటైటిస్ కారణంగా చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ హెపటైటిస్ బీ, సీ కారణంగా 3,500 మంది చనిపోతున్నారు. వీరిలో 18 ఏళ్లలోపు పిల్లల నుంచి 54 ఏళ్ల వయసు వారు ఉన్నారు. అయితే.. వైరల్ హెపటైటిస్ వ్యాధి నిర్థరణ రేటు ఇండియాలో చాలా తక్కువగా ఉంది. హెపటైటిస్ బీ, సీ కేసుల స్క్రీనింగ్, వ్యాధి నిర్థరణకు భారత్ ఉచిత ప్రభుత్వ పథకాన్ని ఏర్పాటుచేసినా, వ్యాధి నిర్థరణ రేటు ఇప్పటికీ తక్కువగానే ఉంది.

మరి దీనికి చికిత్స ఏంటి, రాకుండా ఎలా అడ్డుకోవాలి అనేద ఇప్పుడు తెలుసుకుందాం.. హెపటైటిస్ ఏ, బీ వ్యాక్సిన్లు తీసుకోవాలి. లైంగిక చర్యలలో కండోమ్ వాడాలి. మత్తుమందులకు దూరంగా ఉండాలి. మద్యంతో పాటు కలుషిత నీటిని తాగకూడదు. శరీర శుభ్రతతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఏడాది పిల్లల నుంచి 18 ఏళ్ళ వరకు హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ రెండు లేదా మూడు డోసులు ఇస్తారు. పెద్దవాళ్ళు వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న ఆరు లేదా పన్నెండు నెలల తరువాత బూస్టర్ డోస్ తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల 15 నుంచి 20 ఏళ్ల పాటు మీకు ఈ హైపటైటిల్‌ వచ్చే ప్రమాదం ఉండదు. మరి సైలెంట్‌గా మనుషుల ప్రాణాలు తీస్తున్న ఈ వైరల్‌ హైపటైటిస్‌ని నివారించేందుకు పైన చెప్పిన సూచనలు పాటించండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.