ముప్పవరపు వెంకయ్యనాయుడు.. పరిచయం అవసరంలేని పేరు. తన వాక్ఛాతుర్యంతో రాజకీయాల్లో ఉన్నతస్థాయికి ఎదిగారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా, కేంద్ర మంత్రిగా పలుమార్లు పనిచేసిన ఆయన.. ప్రస్తుతం దేశ ఉప రాష్ట్రపతిగా ఉన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్న వెంకయ్యనాయుడును 2017లో బీజేపీ అగ్రనాయకత్వం ఉప రాష్ట్రపతిగా పంపింది. అయితే కేంద్ర మంత్రిగానే ఉండేందుకే మొగ్గుచూపిన వెంకయ్య.. అయిష్టంగానే ఉప రాష్ట్రపతి పదవి స్వీకరించారు. అయిష్టంగా పదవి స్వీకరించిన వెంకయ్య.. ఆ బాధను ఇప్పటికీ వెళ్లగక్కుతున్నారు. ఈ […]
ఎన్డీఏ – 2 అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సమావేశాల్లో ఈ స్థాయిలో గందరగోళం చెలరేగడం మొదటిసారి. రాజ్యసభలో సంఖ్యాబలం లేకున్నా కూడా బీజేపీ తన రాజకీయ చతురత, తటస్థ రాజకీయ పార్టీల అవసరాల వల్ల బిల్లులు పాస్ అవుతున్నాయి. అయితే నూతనంగా తెచ్చిన వ్యవసాయ బిల్లుపై మాత్రం కథ అడ్డం తిరిగింది. ఊహించని విధంగా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఎన్డీఏ భాగస్వామి అయిన శిరోమణి అకాళిదల్ నిర్ణయం తీసుకోవడం, ఆ పార్టీ నేత హర్ సిమ్రత్ […]
కరోనా లాక్డౌన్ తో ఆగిపోయిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశాలు త్వరలో పునః ప్రారంభమైయ్యే అవకాశముందని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. దేశంలో కరోనా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వర్షకాల పార్లమెంట్ సమావేశాలపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఒకపక్క దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తుంది. మరోవైపు జూన్ చివరి వారంలోనైనా, జూలై మొదటి వారంలోనైనా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. కానీ పార్లమెంట్ సమావేశాలకు ప్రస్తుతం పరిస్థితులు సానుకూలంగా లేవు. […]
కరోనా నియంత్రణ చర్యల్లో ఏపీ భేష్ అంటూ ఉపరాష్ట్రపతి మెచ్చుకోలు … సాధారణంగా ఒక కుటుంబంలోని వ్యక్తులుగా కలసి మెలసి మెలుగుతూ కష్టసుఖాల్లో నిత్యం కలసి సాగే వాళ్ళు తమ వ్యతిరేకులు ఎవరైనా ఉన్నా తమ ఉమ్మడి టార్గెట్ గానే భావిస్తారు. ఈ విషయంలో ఇద్దరి అభిప్రాయాల్లోనూ మార్పులు ఉండవు. ఆ ఇద్దరిలో ఒకరికి వేరే ఎవరితో అయినా పోసగలేదు అంటే సదరువ్యక్తి ఆటోమేటిగ్గా రెండో ఆయనకు కూడా శత్రువు అవుతాడు. కానీ ఏపీలో తాజాగా చోటుచేసుకున్న […]
గురువారం రాజ్యసభ జీరో అవర్ లో చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగింది. దేశంలో కరోనా వైరస్ ని ఎదుర్కోవడంలో.. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో.. కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యమైందని ఆరోపిస్తూ విపక్షాలు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. విపక్ష సభ్యులు ఒకదశలో పోడియాన్ని చుట్టుముట్టి స్పీకర్ స్థానంలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎంత వారించినా వినకుండా పెద్దపెద్దగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఆ […]
రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేయడంపై ఫిర్యాదు చేసేందుకు తెలుగుదేశం ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు తలపెట్టిన ఢిల్లీ పర్యటన రద్దయినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్సీలు మంగళవారం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి మండలి రద్దుపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే వారికి ఢిల్లీలో ముఖ్య నేతలెవరూ అపాయింట్మెంట్ […]
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిరసనలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభల సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రశంగించారు. ప్రభుత్వ విజయాలు, లక్ష్యాలను రాష్ట్రపతి సభలో ప్రస్తావిస్తున్న సమయంలో ప్రతిపక్షాలు సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్, సమాజ్వాదీ తదితర పార్టీల సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఈ చట్టాల […]
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు జరుగుతుంది అన్న చర్చ జరుగుతున్న సందర్భంలో రాజ్యాంగ పరంగా శాసనమండలి హక్కులు, రాష్ట్ర ప్రభుత్వ హక్కులు గురించి తెలుసుకోవాలి. మండలి విచక్షణ ఏది? భారత రాజ్యాంగం ప్రకారం శాసనమండలి ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఇచ్చారు. ఒక రాష్ట్రం శాసనమండలిని ఏర్పాటు చేస్కొదలిస్తే కేంద్రం ఆ నిర్ణయాన్ని గౌరవించి మండలి ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 లో పొందుపరచిన ప్రకారం, రాష్ట్రము కోరుకున్న శాసన మండలి ఏర్పాటును కేంద్రం అడ్డుకోకూడదు. […]
https://youtu.be/