వంగవీటి మోహన రంగా చనిపోయి 32 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఆపేరు ఒక సంచలనం. రాజకీయంగా, సామాజిక వర్గ పరంగా రంగాకు ఉన్న చరిష్మా అలాంటిది. అయితే రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లో ఇప్పటికీ తన ముద్రవేయలేకపోయాడు . దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2004లో విజయవాడ ఈస్ట్ కాంగ్రెస్ తరపున రాధా పోటీచేసి గెలిచారు. పార్టీలో రంగా వారసుడిగా రాధాకు వైస్సార్ వద్ద మంచి ప్రాముఖ్యత ఉండేది. […]
అమరావతి ఉద్యమంలో రాధా మరో సమిధ.. గత పది పదిహేనేళ్ల రాజకీయాలను గమనిస్తే వంగవీటి రాధాకృష్ణ కన్నా దురదృష్టవంతుడు లేరని చెప్పవచ్చు. అప్పుడెప్పుడో వైఎస్సార్ జమానాలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాధాకృష్ణ ఆ తరువాత గెలుపు ముఖం చూడలేదు . తండ్రి వంగవీటి మోహన రంగా వారసత్వాన్ని నిలబెట్టే అవకాశం వచ్చినా నిలుపుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీ గాని, ఎమ్మెల్యేగాని ఇస్తానన్న వైఎస్ జగన్ హామీని కాలదన్ని టిడిపిలో చేరి, అటు అక్కడా టికెట్ దక్కక […]