Krishna Kowshik
వంగవీటి మోహన్ రంగా సతీమణి రత్నకుమారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలియగానే.. వైసీపీ నేతలు, అభిమానులు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.
వంగవీటి మోహన్ రంగా సతీమణి రత్నకుమారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలియగానే.. వైసీపీ నేతలు, అభిమానులు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.
Krishna Kowshik
దివగంత నేత వంగవీటి మోహన్ రంగా సతీమణి, మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను సమీపంలోని హెల్ప్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఈ వార్త తెలియగానే వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. అలాగే వంగవీటి అభిమానులు భారీ ఎత్తున ఆసుపత్రికి వస్తున్నారు. రత్న కుమారి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంగ వీటి మోహన్ రంగా మరణానంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు రత్న కుమారి. వీరికి ఇద్దరు పిల్లలు. రాధా కృష్ణ ప్రస్తుతం పాలిటిక్స్ లో యాక్టివ్ పర్సన్. కుమార్తె ఆషా ఉన్నారు.
వంగవీటి మోహన్ రంగాకు విజయవాడతో సహా ఏపీ వ్యాప్తంగా అనేక మంది అభిమానులున్నారు.పేదల పాలిట పెన్నిధిగా ఆయన్ను కొలుస్తారు. 1988లో మోహన్ రంగా హత్య జరిగింది. ఆ సమయంలో విజయవాడతో సహా పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు కొన్ని రోజులు కర్ఫ్యూ విధించారు. అంతగా ప్రజలపై ప్రభావితం చూపిన నాయకుడు ఆయన. రంగా మరణం తర్వాత 1989లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలుపొందారు రత్న కుమారి. 1994లో రెండవ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1997లో కాంగ్రెస్ నాయకత్వంతో విభేదాల కారణంగా ఆ పార్టీని వీడి.. టీడీపీలో చేరారు ఆమె. అనంతరం ఆమె రాజకీయంగా పెద్దగా ప్రభావితం చేయలేకపోయారు. మెల్లిగా పొలిటికల్ లైఫ్ నుండి తప్పుకున్నారు.
అనంతరం కుమారుడు రాధాకృష్ణను రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు రత్న కుమారి. 2004లో ఆమె కుమారుడు వంగవీటి రాధా కృష్ణ రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. తొలి సారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. 2008-09లో ప్రజారాజ్యం పార్టీలోకి చేరారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆ ఎన్నికల్లోనూ ఓటమి చెందారు. 2019లో విజయవాడ తూర్పు నియోజకవర్గం సీటు ఆశించి.. భంగపాటుకు గురి కావడతో వైసీపీకి దూరం అయ్యి.. టీడీపీలో చేరారు. గత ఏడాది అక్టోబర్ లో ఓ ఇంటి వాడయ్యాడు రాధాకృష్ణ. ఆ సమయంలోనే కనిపించారు రత్న కుమారి.