ఇక్కడ అజిత్ వలిమైని ఎవరూ పట్టించుకోలేదు కానీ తమిళనాడులో మాత్రం సినిమా ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. ఏకంగా వంద కోట్ల క్లబ్బుకి దగ్గరగా వెళ్తూ స్ట్రాంగ్ కలెక్షన్లతో థియేటర్లను నింపుతోంది. అలా అని అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ అజిత్ ఇమేజ్, యావరేజ్ గా ఉన్నప్పటికీ స్టైలిష్ గా ప్రెజెంట్ చేసిన కంటెంట్ జనాన్ని హాళ్ల దాకా తీసుకొస్తోంది. కానీ తెలుగులో మాత్రం దారుణ పరాభవం తప్పలేదు. భీమ్లా నాయక్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ […]
రేపు విడుదల కాబోతున్న అజిత్ వలిమై మీద తెలుగు నాట పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. ఇండియన్ బిగ్గెస్ట్ బైక్ ఛేజింగ్ యాక్షన్ డ్రామాని యూనిట్ ఎంతగా ప్రమోట్ చేస్తున్నప్పటికీ మన జనం కనెక్ట్ కావడం లేదు. దానికి తోడు నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అసలు హీరో అజిత్ రాకపోవడం హైప్ కి అడ్డుపడింది. అసలు టైటిలే తెలుగులో పెట్టకుండా నిర్లక్ష్యం వహించిన నిర్మాత బోనీ కపూర్ డబ్బింగ్ లోనూ ఏ మాత్రం […]
విశ్వాసం తర్వాత కొంత గ్యాప్ తో అజిత్ చేసిన వలిమై ఎల్లుండి అంటే 24న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. తన మార్కెట్ ఇక్కడ భారీగా లేకపోయినా ఉన్నంతలో డీసెంట్ ఓపెనింగ్స్ ని అభిమానులు ఆశిస్తున్నారు. కాకపోతే మొదటి రోజు ఎలాంటి పోటీ లేకపోయినా అడ్వాన్ బుకింగ్స్ చాలా నెమ్మదిగా ఉండటం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. హైదరాబాద్ లో ఇప్పటికీ ఏ షో కంప్లీట్ గా ఫుల్ కాలేదు. ఆటలు మొదలయ్యే టైంకి నిండొచ్చు కానీ ట్రెండ్ […]
తమిళనాడు మొత్తం అజిత్ కొత్త సినిమా వలిమై ఫీవర్ తో ఊగిపోతోంది. ఆన్ లైన్ లో అడ్వాన్ బుకింగ్ టికెట్లు పెట్టడం ఆలస్యం హాట్ కేక్స్ లా నిమిషాల్లో అమ్ముడుపోతున్నాయి. ఓపెనింగ్స్ విషయంలో సరికొత్త రికార్డులు ఖాయమని ట్రేడ్ చాలా నమ్మకంగా ఉంది. 23 అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలు వేసేలా థియేటర్ల యాజమాన్యాలు ఏర్పాట్లు చేసుకున్నాయి. మొదటి వారంలోనే వంద కోట్ల గ్రాస్ రావడం పక్కా అని అక్కడి విశ్లేషకుల అంచనా. ఖాకీ ఫేమ్ వినోత్ […]
అజిత్ హీరోగా రూపొందిన వలిమై ఈ నెల 24న విడుదల కాబోతోంది. పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ చేశారు. వినోత్ దర్శకత్వంలో రూపొందిన ఈ బైక్ థ్రిల్లర్ కోసం తమిళనాడులో ఓ రేంజ్ లో హైప్ ఉంది. అక్కడ మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ బజ్ వచ్చేలా నిర్మాత బోనీ కపూర్ బృందం ప్లానింగ్ లో ఉంది. హిందీ వెర్షన్ ని భారీగా ప్రమోట్ చేయడం కోసం ఇటీవలే ఒక స్పెషల్ […]
జనవరి అయిపోయింది. 2022 కొత్త ఏడాది టాలీవుడ్ కు చాలా నిరాసక్తంగా మొదలయ్యింది. ఒక్క బంగార్రాజు మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుని 40 కోట్ల మార్కు దిశగా దూసుకుపోయి ఊరటనిచ్చింది కానీ మాములు పరిస్థితుల్లో అయితే రెండు మూడు పెద్ద సినిమాలు పోటీ పడి కనీసం 300 కోట్లకు పైగా బిజినెస్ జరిగేది. కానీ మంచి సీజన్ కళ్ళముందే కర్పూరంలా కరిగిపోయింది. ఇక ఫిబ్రవరి వంతు వచ్చింది. నిర్మాతలు ధైర్యం చేయలేకపోతున్నారు. 4న విశాల్ సామాన్యుడు తప్ప […]
ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ మరోసారి డైరెక్ట్ ఓటిటి రిలీజుల ప్రహసనం మొదలుకానుంది. ఈ కరోనా థర్డ్ వేవ్ ఎంత కాలం ఉంటుందనే క్లారిటీ లేదు కానీ తమ సినిమాలను జనాలు థియేటర్లలో చూసి పెట్టుబడితో పాటు లాభాలు ఇస్తారన్న నమ్మకం ;లేని నిర్మాతలు మెల్లగా డిజిటల్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరికొందరు మాత్రం తమ సినిమాలు బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ కోసమే అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కు 350 కోట్ల దాకా ఆఫర్ వచ్చింది. […]
ఒకప్పుడు ఏదైనా ఇతర బాష సినిమాని తెలుగులో డబ్ చేస్తున్నప్పుడు దాని టైటిల్ ని మనవాళ్ళకు అనుగుణంగా అర్థమయ్యేలా పెట్టేవాళ్ళు. ఒకవేళ సాధ్యం కాకపోతే ఇంగ్లీష్ లో పెట్టేవాళ్ళు తప్ప మరీ తమిళం మలయాళంలో ఉన్నవి యధాతథంగా ఉంచేసిన సందర్భాలు లేవు. కానీ ఈ మధ్యకాలంలో ఆ మాత్రం పెట్టే ఓపిక లేకనో లేదా తెలుగే కదా ఎలా ఉన్నా ఆడియన్స్ చూస్తారని ధైర్యమో తెలియదు కానీ ఇప్పుడో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. సదరు భాషలో పదానికి […]
బాలీవుడ్ లో బైక్ ఛేజింగ్ దొంగతనాలను బేస్ చేసుకుని వచ్చిన సినిమాల్లో ఇప్పటిదాకా ధూమ్ దే ప్రత్యేక స్థానం. మూడు భాగాలు వచ్చినా దేనికవే బ్లాక్ బస్టర్లు. జాన్ అబ్రహం తర్వాత విలన్ పాత్రను చూసి ముచ్చటపడి ఏరికోరి మరీ హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్ లు ఈ క్యారెక్టర్ చేశారంటే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ధూమ్ 4 అనుకున్నారు కానీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం నిన్న […]
రాబోయే సంక్రాంతి పండక్కు అజిత్ వలిమై విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి దీని తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఒకేసారి వస్తుందనే అంచనాలో అభిమానులు ఉన్నారు. కానీ ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లతో పాటు బంగార్రాజు రేస్ లో ఉండటంతో వలిమై నిర్మాత బోనీ కపూర్ ఇక్కడ థియేట్రికల్ రిలీజ్ కు మొగ్గు చూపడం లేదట. థియేటర్ల సమస్య వస్తుంది కాబట్టి రెవిన్యూ పరంగా వర్కౌట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఆ ఆలోచన డ్రాప్ […]