iDreamPost
android-app
ios-app

RRR & Valimai : రాజమౌళితో బోనీ ఢీ కొట్టేది ఇందుకేనా ?

  • Published Dec 15, 2021 | 7:04 AM Updated Updated Dec 15, 2021 | 7:04 AM
RRR & Valimai : రాజమౌళితో బోనీ ఢీ కొట్టేది ఇందుకేనా ?

ఆర్ఆర్ఆర్ లేదు రాధే శ్యామ్ లేదు నా రేంజే వేరు అనే తరహాలో సంక్రాంతికి అజిత్ వలిమై కూడా ఫిక్స్ కావడంతో బాక్సాఫీస్ వేడి మరింత పెరిగింది. నిన్న విడుదల చేసిన మేకింగ్ వీడియోనే ట్రైలర్ రేంజ్ లో సోషల్ మీడియాలో హడావిడి చేసింది. బైక్ రేసర్ గా అజిత్ చేసిన స్టంట్ లు, దర్శకుడు వినోత్ యాక్షన్ ఎపిసోడ్లను చిత్రీకరించిన విధానం అంచనాలును అమాంతం పెంచేసింది. తెలుగు ఆడియన్స్ లో ఇప్పటికి దీని మీద భారీ హైప్ లేదు కానీ దాన్నెలా పెంచాలో ఆల్రెడీ నిర్మాత బోనీ కపూర్ టీమ్ ప్రణాళిక వేసుకునే ఉందట. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గే ప్రసక్తే ఉండదని తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు సమాచారం వెళ్లిపోయిందని వినికిడి.

బోనీ కపూర్ ఆర్ఆర్ఆర్ కు ఎదురు వెళ్లడం గురించి మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఆయన నిర్మాతగా తీసిన అజయ్ దేవగన్ మైదాన్ గత ఏడాది లాక్ డౌన్ సద్దుమణిగాక అక్టోబర్ కి రిలీజ్ డేట్ ని ప్రకటించారు. దాన్ని పట్టించుకోకుండా రాజమౌళి తన సినిమాను అదే తేదీకి విడుదల చేస్తానని చెప్పారు. అప్పుడు కొంత వాతావరణం వేడెక్కింది. ఇలా చేయడం భావ్యం కాదని జక్కన్న మీద బోనీ కపూర్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ రెండూ రిలీజ్ కాలేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి బాహుబలిలో చేయకపోవడం గురించి రాజమౌళి చెప్పిన మాటలు కూడా మనసులో ఉండే ఉంటాయి. ఇవన్నీ కలగలిసి వలిమైని ఆర్ఆర్ఆర్ తో పోటీకి రెడీ చేశారట.

ఇదంతా వాస్తవమని చెప్పలేం కానీ ఇంటర్ లింక్ చూస్తే నిజమే అనిపించక మానదు. ఆర్ఆర్ఆర్ కు ఎంత క్రేజ్ ఉన్నా తమిళనాడులో వలిమైని ఢీ కొట్టడం అంత సులభం కాదు. అజిత్ ఫాన్ ఫాలోయింగ్, అతని సినిమాల కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడే విధానం చూస్తే కేరళ తమిళనాడులో పోటీ తేలికగా ఉండదు. ధూమ్ తరహాలో పూర్తి బైక్ యాక్షన్ ఎపిసోడ్స్ మీద రూపొందిన వలిమైలో మన ఆరెక్స్ 100 కార్తికేయ మెయిన్ విలన్ గా నటించడం విశేషం. కండలు తిరిగిన బాడీ, ఒళ్ళంతా టాటూలు ఇవన్నీ చూస్తే క్యారెక్టర్ కు గట్టి ఎలివేషన్లే కనిపిస్తున్నాయి. వలిమై రిలీజ్ డేట్ ని ట్రైలర్ తో పాటు ప్రకటించబోతున్నారు

Also Read : Pushpa Promotions : ప్రమోషన్ల కోసం బన్నీ వన్ మ్యాన్ ఆర్మీ

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş