iDreamPost
android-app
ios-app

Valimai : అజిత్ సినిమా గురించి టాక్ నిజమేనా

  • Published Feb 06, 2022 | 1:19 PM Updated Updated Feb 06, 2022 | 1:19 PM
Valimai : అజిత్ సినిమా గురించి టాక్ నిజమేనా

అజిత్ హీరోగా రూపొందిన వలిమై ఈ నెల 24న విడుదల కాబోతోంది. పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ చేశారు. వినోత్ దర్శకత్వంలో రూపొందిన ఈ బైక్ థ్రిల్లర్ కోసం తమిళనాడులో ఓ రేంజ్ లో హైప్ ఉంది. అక్కడ మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ బజ్ వచ్చేలా నిర్మాత బోనీ కపూర్ బృందం ప్లానింగ్ లో ఉంది. హిందీ వెర్షన్ ని భారీగా ప్రమోట్ చేయడం కోసం ఇటీవలే ఒక స్పెషల్ షోని సెలెక్టెడ్ సెలబ్రిటీలతో పాటు కొందరు మీడియా ప్రముఖులకు వేశారు. అది చూశాక వచ్చిన అనూహ్యమైన స్పందనను పబ్లిసిటీ కోసం వాడుకోబోతున్నారు. ఆ ప్రీమియర్ కు అటెండ్ అయినవాళ్లు ఇప్పటికే ట్వీట్లు వేయడం మొదలుపెట్టారు.

మాములుగానే అజిత్ సినిమా అంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. కానీ తెలుగులో తనకు అంతగా మార్కెట్ లేదు. అయితే ఇక్కడ బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోల సినిమాలు లేని గ్యాప్ ని వాడుకునేందుకు వలిమై పక్కా ప్లాన్ ని సిద్ధం చేసుకుంది. ఆరెక్స్ 100 కార్తికేయ విలన్ గా నటించడం మన ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందనే కోణంలో ఇంటర్వ్యూలు గట్రా సిద్ధం చేస్తున్నారు. చాలా సీరియస్ సబ్జెక్టుగా రూపొందిన వలిమైలో టెక్నాలజీని వాడుకుని బైకులను రాకెట్ స్పీడ్ తో బైకులు నడిపించే దొంగల బ్యాచ్ కి, వాళ్ళను పట్టుకునేందుకు సిద్ధపడ్డ పోలీస్ ఆఫీసర్ కి మధ్య వార్ గా వినోత్ దీన్ని తీర్చిదిద్దినట్టు తెలిసింది.

తెలుగు ట్రైలర్ ని ఇంకా వదల్లేదు. ఒక గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ చేసి లాంచ్ చేయబోతున్నారు. అలా అని వలిమైకు తెలుగులో పోటీ లేదని కాదు. 25న ఆడవాళ్ళూ మీకు జోహార్లు, సెబాస్టియన్ ఆల్రెడీ ప్రకటించేసాయి. ఏపిలో సెకండ్ షోలకు పర్మిషన్లు వస్తే భీమ్లా నాయక్ కూడా రంగంలోకి దిగుతాడు.ఒకవేళ డ్రాప్ అనుకుంటే వరుణ్ తేజ్ గని రేస్ లో ఉన్నాడు. సో ఎలా చూసుకున్నా వలిమైకి టాలీవుడ్ లో అంత స్వీట్ వెల్కమ్ ఏమి లేదు. కాకపోతే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం డబ్బింగా స్ట్రెయిటా అని చూడకుండా మరీ మన ప్రేక్షకులు సినిమాను రిసీవ్ చేసుకుంటారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ రేంజ్ లో వలిమైలో ఛెజులు ఉంటాయని ముంబై టాక్

Also Read : Rocket Boys : రాకెట్ బాయ్స్ రిపోర్ట్

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Giriş