iDreamPost
iDreamPost
జనవరి అయిపోయింది. 2022 కొత్త ఏడాది టాలీవుడ్ కు చాలా నిరాసక్తంగా మొదలయ్యింది. ఒక్క బంగార్రాజు మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుని 40 కోట్ల మార్కు దిశగా దూసుకుపోయి ఊరటనిచ్చింది కానీ మాములు పరిస్థితుల్లో అయితే రెండు మూడు పెద్ద సినిమాలు పోటీ పడి కనీసం 300 కోట్లకు పైగా బిజినెస్ జరిగేది. కానీ మంచి సీజన్ కళ్ళముందే కర్పూరంలా కరిగిపోయింది. ఇక ఫిబ్రవరి వంతు వచ్చింది. నిర్మాతలు ధైర్యం చేయలేకపోతున్నారు. 4న విశాల్ సామాన్యుడు తప్ప ఇంకే చెప్పుకోదగ్గ రిలీజ్ లేదు 11న ఖిలాడీ, డీజే టిల్లు వస్తున్నాయి కానీ చివరి నిమిషం మార్పులకు ఎవరూ అతీతం కాదు కాబట్టి అప్పుడే ఒక నిర్ధారణకు రాలేం.
అసలైన సందడి మాత్రం వచ్చే నెల నాలుగో వారం నుంచి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముందుగా అజిత్ వలిమైని 24కి ప్లాన్ చేస్తున్నారని చెన్నై టాక్. 25న శర్వానంద్ ఆడవాళ్ళూ మీకు జోహార్లు మొన్నే ప్రకటించేసింది. భీమ్లా నాయక్ వస్తుందా రాదా అనే దాని మీద కన్ఫ్యూజన్ ఇంకా కొనసాగుతోంది. ఆర్ఆర్ఆర్ మార్చి 18 రావడం దాదాపు కష్టమే. ఏప్రిల్ 1 ఆచార్య రాదని ఫిలిం నగర్ టాక్. అదే జరిగితే ఆ స్థానంలో భీమ్లా నాయక్ దిగొచ్చు. రాధే శ్యామ్ టీమ్ ఇంకా పరిస్థితిని విశ్లేషించే పనిలో ఉంది. ఎటూ తేల్చుకోలేక ఆలస్యం చేస్తుండటం అభిమానులను టెన్షన్ పెడుతోంది. ఇంకొద్దిరోజుల్లో క్లారిటీ రావొచ్చు.
ఇకవేళ ఖిలాడీ కనక 11న వచ్చేస్తే సందడి అక్కడి నుంచి స్టార్ట్ అనుకోవచ్చు. పూర్తి స్థాయిలో హంగామా చూడాలంటే మార్చి రావాల్సిందే. అప్పటిదాకా వెయిటింగ్ తప్పదు. కరోనా మెల్లగా తగ్గుముఖం పట్టింది. కేసులు బాగా తగ్గిపోయాయి. ఎన్ని లక్షల పాజిటివ్స్ వచ్చినా అవన్నీ ఇంట్లోనే రికవర్ అయిపోతున్నాయి. ఆసుపత్రి దాకా వెళ్లాలనే భయం ఇప్పుడెవరికి లేదు. ఆ కారణంగానే బంగార్రాజుకు మంచి వసూళ్లు దక్కాయి. వీకెండ్స్ లో జనం బాగానే థియేటర్లకు వస్తున్నారు. సరైన సినిమాలు పడితే నాలుగైదు స్క్రీన్లున్న మల్టీ ప్లెక్సుల వద్ద కూడా హౌస్ ఫుల్ బోర్డులు చూడొచ్చు. ఆ రోజుల కోసమే అందరి ఎదురు చూపులు
Also Read : F3 Movie : రిలీజ్ డేట్ చెప్పగానే సరిపోదుగా