iDreamPost
android-app
ios-app

Big Movies : థియేటరే ముద్దు ఓటిటి వద్దు

  • Published Jan 09, 2022 | 6:32 AM Updated Updated Jan 09, 2022 | 6:32 AM
Big Movies : థియేటరే ముద్దు ఓటిటి వద్దు

ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ మరోసారి డైరెక్ట్ ఓటిటి రిలీజుల ప్రహసనం మొదలుకానుంది. ఈ కరోనా థర్డ్ వేవ్ ఎంత కాలం ఉంటుందనే క్లారిటీ లేదు కానీ తమ సినిమాలను జనాలు థియేటర్లలో చూసి పెట్టుబడితో పాటు లాభాలు ఇస్తారన్న నమ్మకం ;లేని నిర్మాతలు మెల్లగా డిజిటల్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరికొందరు మాత్రం తమ సినిమాలు బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ కోసమే అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కు 350 కోట్ల దాకా ఆఫర్ వచ్చింది. రాధే శ్యామ్ కు 300 కోట్లను డీల్ గా ఇచ్చారు. కానీ పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఎత్తున రూపొందించిన ఈ నిర్మాతలు వాటికి నిర్మొహమాటంగా నో చెప్పారు.

అజిత్ వలిమైకు ఓ దిగ్గజ సంస్థ 300 కోట్ల దాకా ఆఫర్ ఇచ్చిందట. నిర్మాత బోనీ కపూర్ నిర్మొహమాటంగా తిరస్కరించినట్టు చెన్నై టాక్. గత ఏడాది విజయ్ మాస్టర్ కు వచ్చిన కొటేషన్ 150 కోట్లే. ఇప్పుడు రెట్టింపన్న మాట. నిజంగా ఇచ్చేసినా గట్టి లాభాలు వచ్చినట్టే. అయినా కూడా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈగ విలన్ కన్నడ హీరో కిచ్చ సుదీప్ లేటెస్ట్ మూవీ విక్రాంత్ రోనాకు 100 కోట్ల టెంప్టింగ్ ఆఫర్ వచ్చిందని స్వయానా నిర్మాతే వెల్లడించారు. కానీ ఇదీ వద్దన్నారట. కేవలం ఈ నాలుగు సినిమాల డీల్సే 1000 కోట్లు దాటడం గమనించవచ్చు. భీమ్లా నాయక్ కు సైతం వంద కోట్ల పైగా అప్పట్లో ఆఫర్ చేశారని టాక్ రావడం తెలిసిందే.

ఇవన్నీ ఇవ్వలేదు కానీ ఇన్నేసి కోట్లను కేవలం స్ట్రీమింగ్ హక్కుల కోసం మంచి నీళ్లలా ఖర్చు పెట్టేందుకు ఓటిటిలు సిద్ధపడుతున్నాయంటే ఈ మార్కెట్ ఏ స్థాయిలో పుంజుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా గత రెండేళ్లలో జరిగిన అనూహ్య పరిణామాల తాలూకు ఫలితమే. ఒకవేళ కరోనా రాకపోయి ఉంటే ఈ ట్రెండ్ ఖచ్చితంగా ఉండేది కాదు. ఇంకో నాలుగైదు సంవత్సరాల తర్వాత వచ్చేది. వీటి సంగతేమో కానీ మీడియం బడ్జెట్ సినిమాలు మాత్రం ఇప్పుడు ఓటిటి బాటకే మొగ్గు చూపుతున్నాయి. హిందీ మలయాళం భాషల్లో ఎక్కువగా డిజిటల్ ప్రీమియర్లు జరగబోతున్నాయి . తెలుగులో మాత్రం ప్రస్తుతానికి తక్కువే

Also Read : Pushpa OTT : ఓటిటిలో వచ్చినా బన్నీ పరుగు ఆగలేదు