పెళ్లైన 45 రోజులకే భార్య నాలుగు నెలల గర్భవతి అని తెలిసి.. భర్త, అత్తమామలు షాకయ్యారు. తాము మోసపోయామని గ్రహించి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలో వెలుగుచూసింది. కొత్తకోడలు తరచూ కడుపునొప్పి అని ఏడుస్తుండటంతో.. అత్తమామలు ఆమెను సోనోగ్రఫీ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. నవవధువును పరీక్షించిన వైద్యులు ఆమె నాలుగునెలల గర్భవతి అని చెప్పడంతో, అత్తమామలు షాకయ్యారు. ఈ విషయం తెలిసిన భర్త ఆమెను తన గ్రామానికి […]
భార్యకు ముద్దుపెట్టిన భర్తను అసభ్య పదజాలంతో తిట్టడంతో పాటు.. అతడిని పక్కకు లాగి కొట్టారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. భార్యకు ముద్దుపెడితే కొట్టడం ఏంటి ? అనే కదా మీ సందేహం. అతను తన భార్యకు నాలుగు గోడల మధ్య ముద్దుపెట్టలేదు. నలుగురూ చూస్తుండగా .. అది కూడా నదీస్నానం చేస్తుండగా ముద్దు పెట్టాడు. పవిత్రమైన నదీస్నానం చేసేటపుడు భార్యకు ముద్దుపెట్టడం అక్కడున్న వారిని ఆగ్రహానికి గురిచేసింది. ఈ ఘటన అయోధ్యలో చోటుచేసుకుంది. […]
ఎంతో ఉత్సాహంగా పెళ్లి వేదిక వద్దకు డ్యాన్స్ చేస్తూ వెళ్లిన వరుడిని ట్రాఫిక్ పోలీసులు రూ.2 లక్షలు జరిమానా విధించారు. ఈ ఘటన యూపీలో జరిగింది. విషయం ఏమిటంటే.. ఇక్కడ పెళ్లికొడుకు తన ఇంట్లోనో లేదా పెళ్లి వేదిక వద్దో డ్యాన్స్ చేయలేదు. కారులో ఊరేగింపుగా వస్తూ.. డ్యాన్స్ చేస్తూ సెల్ఫీలు తీసుకుంటూ.. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించాడు. అది వీడియో తీసిన ఓ బాటసారుడు.. ఆ పెళ్లికొడుకుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ ట్రాఫిక్ పోలీసులను […]
సూపర్ వైజర్ వేధింపులు భరించలేక మహిళా రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ లో జరగ్గా.. ఆలస్యంగా వెలుగుచూసింది. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఈ ఘటనపై విచారణ చేసేందుకు ఇద్దరు వైస్ ఛాన్సలర్ తో కూడిన కమిటీని వేశారు. నబీలా ఖానమ్ అనే యువతి ఎఎమ్ యూకు చెందిన జవహర్ లాల్ నెహ్రూ వైద్య కళాశాలలో ఇంటర్ డిసిప్లినరీ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్లో పరిశోధనలు చేస్తోంది. […]