ప్రజలకు సేవ చేయాల్సిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు.. ఆఫీస్ లనే అడ్డాగా మార్చుకుని నీచమైన పనులు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు అంటే దేవాలయాంగా భావించడం మానేసి.. దర్జాగా అందులో మద్యం సేవిస్తున్న ఘటనలు మనం చాలానే చూశాం. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. విధులు నిర్వర్తించాల్సిన సమయంలో ఓ ప్రభుత్వ అధికారి కార్యాలయంలోనే దర్జాగా మద్యం సేవిస్తూ.. అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉత్తరప్రదేశ్ లోని హర్డోయ్ జిల్లాలో కపూర్ సింగ్ అనే అధికారి స్వైజ్ పూర్ రిజిస్టర్ కార్యాలయంలో విధులు నిర్వర్తించేవాడు. ఎప్పటిలాగే ఆఫీస్ కు వచ్చిన అతడు విధులు నిర్వర్తించాల్సిన సమయంలో దర్జాగా మద్యం సేవిస్తున్నాడు. ఓ చేతిలో ఫోన్, మరో చేతిలో మద్యం గ్లాస్ తో చిల్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే మద్యం సేవిస్తూ.. స్థానిక మీడియా చేతికి చిక్కాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ ప్రభుత్వ అధికారి తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. కాగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనే ఇటీవల పంజాబ్ లో వెలుగు చూసింది. పంజాబ్ లోని హోషియాపూర్ లో సెంట్రల్ జైలు పోలీసులు అంబులెన్స్ లోనే మద్యం సేవించిన ఘటన వైరల్ గా మారిందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే.. యూపీలో ఈ ఘటన జరిగింది.
#हरदोई– सरकारी दफ्तर में एक कर्मचारी का शराब पीते वीडियो वायरल,रजिस्ट्री ऑफिस सवायजपुर में तैनात चपरासी कपूर सिंह का दारू पीने का वीडियो हुआ वायरल,ऑफिस में जाम छलकते नजर आ रहा है कर्मचारी,हरदोई के सवायजपुर रजिस्ट्री ऑफिस का बताया जा रहा है @hardoipolice#ViralVideos @dmhardoi pic.twitter.com/5gVKmrEI6u
— anuj Pal (@anujPal50037043) August 27, 2023
ఇదికూడా చదవండి: భర్త పోలీస్ అయినంత మాత్రాన ఇలా చేస్తారా? ఆ మహిళ తీరుపై మండిపడుతున్న నెటిజన్స్!