iDreamPost
android-app
ios-app

వరుడికి రూ.2 లక్షలు ఫైన్ వేసిన పోలీసులు.. కారణమేంటంటే..

  • Published Jun 16, 2022 | 1:48 PM Updated Updated Jun 16, 2022 | 1:48 PM
వరుడికి రూ.2 లక్షలు ఫైన్ వేసిన పోలీసులు.. కారణమేంటంటే..

ఎంతో ఉత్సాహంగా పెళ్లి వేదిక వద్దకు డ్యాన్స్ చేస్తూ వెళ్లిన వరుడిని ట్రాఫిక్ పోలీసులు రూ.2 లక్షలు జరిమానా విధించారు. ఈ ఘటన యూపీలో జరిగింది. విషయం ఏమిటంటే.. ఇక్కడ పెళ్లికొడుకు తన ఇంట్లోనో లేదా పెళ్లి వేదిక వద్దో డ్యాన్స్ చేయలేదు. కారులో ఊరేగింపుగా వస్తూ.. డ్యాన్స్ చేస్తూ సెల్ఫీలు తీసుకుంటూ.. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించాడు. అది వీడియో తీసిన ఓ బాటసారుడు.. ఆ పెళ్లికొడుకుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు.

“నేను హరిద్వార్ నుండి నోయిడాకు ప్రయాణిస్తున్నప్పుడు, ముజఫర్‌నగర్ జిల్లాలో కొంతమంది తమ వినోదం కోసం ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నాను’ అని కుమార్ ట్వీట్‌లో రాశాడు. వరుడిగా ఉన్న వ్యక్తి కారులో నిలబడి తన స్నేహితులతో కలిసి కార్ స్టంట్స్ చేస్తూ సెల్ఫీలు దిగాడు. అది ట్రాఫిక్ కు అంతరాయం కలిగించింది. ఆ వీడియో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) అభిషేక్ యాదవ్ దృష్టికి చేరగా.. వెంటనే ముజఫర్‌నగర్‌లోని ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వీడియో ఆధారంగా తొమ్మిది వాహనాలను గుర్తించామని, యజమానులకు రూ.2 లక్షల చలాన్లు జారీ చేశామని ట్రాఫిక్ ఎస్పీ కుల్దీప్ సింగ్ తెలిపారు. ఆ వాహనాలన్నీ ఢిల్లీ రిజిస్ట్రేషన్ గా ఉన్నాయని, అంతే కాకుండా సంబంధిత సెక్షన్ల కింద తగిన చర్యలు తీసుకోనున్నారు.