iDreamPost
android-app
ios-app

వరుడు వేళకు రాలేదని.. అతడి సోదరుడిని పెళ్లాడిన వధువు.. ప్లాన్ మామూలుగా లేదుగా!

  • Published Feb 29, 2024 | 9:53 AM Updated Updated Feb 29, 2024 | 9:53 AM

పెళ్లిలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. వరుడు వేళకు రాలేదని అతడి సోదరుడిని పెళ్లి చేసుకుంది వధువు. దీంతో అంతా షాక్ అయ్యారు. కానీ వీళ్ల ప్లాన్ మాత్రం మామూలుగా లేదుగా.. అసలు ఏం జరిగిందంటే?

పెళ్లిలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. వరుడు వేళకు రాలేదని అతడి సోదరుడిని పెళ్లి చేసుకుంది వధువు. దీంతో అంతా షాక్ అయ్యారు. కానీ వీళ్ల ప్లాన్ మాత్రం మామూలుగా లేదుగా.. అసలు ఏం జరిగిందంటే?

  • Published Feb 29, 2024 | 9:53 AMUpdated Feb 29, 2024 | 9:53 AM
వరుడు వేళకు రాలేదని.. అతడి సోదరుడిని పెళ్లాడిన వధువు.. ప్లాన్ మామూలుగా లేదుగా!

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఓ మధురమైన ఘట్టం. ఎప్పటికీ గుర్తుండిపోయేలా తమ వివాహ వేడకను ప్లాన్ చేసుకుంటుంటారు వధూవరులు. అనుకున్న ముహూర్తానికి వివాహం జరిగేలా ఇరు కుటుంబ సభ్యులు అందుకు ఏర్పాట్లు చేస్తుంటారు. సరైన ముహూర్తానికి వరుడు వధువు మెడలో మూడుముళ్లు వేస్తాడు. ఏ పెళ్లిలో అయిన సాధారణంగా ఇలాగే జరుగుతుంది. కానీ ఓ పెళ్లిలో మాత్రం ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. తీరా పెళ్లి ముహూర్తానికి వరుడు రాకపోయే సరికి అతడి సోదరుడిని పెళ్లి చేసుకుంది పెళ్లి కూతురు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అదేంటీ వరుడు రాలేదని అతడి అన్నను పెళ్లి చేసుకోవడమేంటని షాక్ అవుతున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ప్రభుత్వం అందించే డబ్బుల కోసం ఇలా చేసినట్లు సమాచారం.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝూన్సీలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల వేదికగా సీఎం సామూహిక వివాహ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 132 జంటలకు పెళ్లిళ్లు జరిగాయి. సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు సమీప ప్రాంతాల నుంచి వధూవరులు వచ్చారు. కాగా ఝాన్సీ సమీప బామౌర్ ప్రాంతానికి చెందిన ఖుషీ అనే యువతి వివాహం మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌కు చెందిన వృష్‌ భాను అనే యువకుడితో నిశ్చయమైంది. వీరిద్దరి పేరుతో సీఎం సామూహిక వివాహ కార్యక్రమంలో 36 నంబరు రిజిస్ట్రేషను నమోదైంది. అయితే పెళ్లి జరిగే సమయంలో పెళ్లిపీటలపై ఖుషీ పక్కన వరుడిగా మరో వ్యక్తి కనిపించాడు.

ఖుషీ వరుడు కాకుండా వరుసకు బావయ్యే వృష్ ను పెళ్లాడింది. అసలు విషయం ఏంటంటే వరుడు వేళకు రాకపోవడంతో కుటుంబ సభ్యుల సలహాతో తాను కూర్చున్నట్లు చెప్పుకొచ్చాడు నకిలీ వరుడు. అతడికి ఇది వరకే పెళ్లైనట్లు తెలిసింది. ఇదంతా ఎందుకు చేశారంటే యూపీలో సీఎం సామూహిక వివాహ పథకం కింద కొత్తజంటలకు ప్రభుత్వం రూ.51 వేలు చొప్పున అందిస్తోంది. ఈ ప్రయోజనాలు పొందేందుకే వరుడు వేళకు రాకపోయే సరికి అతడి సోదరుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది తెలిసిన వారు ప్లాన్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio