తిరుపతి లోక్ సభ ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం తో ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారాన్ని పూర్తి చేసేశాయి. ఈ ఎన్నికను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండేళ్ల కింద జరిగిన సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాతి నుంచి ఆ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో భారీగా ఓట్లను కోల్పోయింది. దీనితో ఈ ఎన్నికలో కాస్తైనా ప్రభావం చూపించాలనే పట్టుదలతో ఉంది. ఆ పార్టీ అధినేత […]
తిరుపత ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ చిలక జోస్యం చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్ ఎక్కువ కాలం అధికారంలో కొనసాగలేరని చెప్పుకొస్తున్నారు. ఆరు నెలల తర్వాత వైఎస్ జగన్ ఎక్కడ ఉంటారో ఆయనకే తెలియదంటున్నారు. వైఎస్ జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి మే 30కి రెండు సంవత్సరాలు అవుతుంది. మరో మూడేళ్లు ఆయన పదవీ కాలం ఉంది. మరి చింతా మోహన్ మాత్రం వైఎస్ జగన్ ఎక్కువ కాలం […]
యుద్ధంలో పోరాడి ఓడితే వీరుడు అంటారు.. యుద్ధానికి వెళ్ళకముందే ప్రత్యర్థి మీద రకరకాల సాకులు చెప్పే వారిని ఏమంటారు? ప్రత్యర్థి మీద నిందలు వేసి వారి నుంచి తప్పుకోవాలని చూసే వారిని ఏమని పిలుస్తారు? ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల సాక్షిగా ఇదే తంతు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. సంక్షేమ పథకాల దన్నుతో, స్థానిక ఎన్నికల్లో విజయాల వరుసతో జోష్ మీద కనిపిస్తున్న అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఇలాంటి కారణాల వెతుకుతున్నట్లు కనిపిస్తోంది. తిరుపతి ఉప […]
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేయడం, ఆ పార్టీకి జనసేన మద్ధతు తెలపడం ఖాయమైంది. శుక్రవారం బీజేపీ, జనసేన అగ్రనేతలు ఈ విషయంపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు. దీంతో దాదాపు మూడు నెలలుగా బీజేపీ, జనసేన పార్టీలలో ఏ పార్టీ అభ్యర్థి తిరుపతిలో పోటీ చేస్తారనే ప్రచారానికి ఫుల్‌స్టాఫ్ పడింది. అయితే ఇప్పుడు మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. బీజేపీ తరఫున ఎవరు పోటీ చేస్తారు..? ఆ పార్టీ అభ్యర్థిత్వాన్ని […]
x aతిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పోటీపై బీజేపీ–జనసేన పార్టీలు ఓ అభిప్రాయానికి వచ్చాయి. తిరుపతి లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేసేందుకు ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. జనసేన మద్ధతుతో బీజేపీ తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ వ్యవహారాల ఇంఛార్జి మురళీధర్ రావు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్లో ఈ విషయం వెల్లడించారు. ఏపీలో […]
మత విశ్వాసం వ్యక్తిగతమైనది. కానీ ఇప్పడది రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఆయుధంగా మారింది. ప్రజల విశ్వాసాలను గౌరవించడం ప్రభుత్వాల బాధ్యత. కానీ అధికారంలోకి రావడానికే మతాన్ని మార్గంగా ఎంచుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. మత రాజకీయాల పునాదిపై దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ అదే అస్త్రాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రయోగిస్తోంది. తాజాగా తెలంగాణలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్ని మతం చుట్టూ తిప్పి బలం పెంచుకోవడంలో సక్సెస్ అయిన బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ అలాంటి వైఖరినే అవలంభిస్తోంది. […]
తాడిచెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడకు గడ్డి కోయడానికి అన్నాడట. తాడిచెట్టుకు, గడ్డికి సంబంధం లేకపోయినా ఏదోటీ సాకు చెప్పి తప్పించుకోవడమే అక్కడ ప్రధానోద్దేశ్యం అన్నమాట. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేసి సత్తాచాటాలని జనసేన అధి నేత పవన్ కళ్యాణ్ ఉవ్విళ్లూరుతూ వచ్చారు. అయితే ఆయన ఆశలపై బీజేపీ నీళ్లు జల్లేసింది. హైదరాబాద్ […]
అసలే అవి ఉప ఎన్నికలు. ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు. అయినా టీడీపీ మాత్రం తొందర పడి ఓ కోయిలా ముందే కూసిందీ అన్నట్టుగా వ్యవహరించింది. తమ పార్టీ అభ్యర్థిని అందరికన్నా ముందే ప్రకటించింది. పనబాక లక్ష్మిని మళ్లీ పోటీలో నిలపాలని నిర్ణయించింది. అయితే ఇప్పుడామె టీడీపీని టెన్షన్ పెడుతోంది. చంద్రబాబు ప్రకటన చేసినా ఆమెలో స్పందన కనిపించడం లేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిత్వం ఖరారయిన తర్వాత కూడా ఆమెలో కదలిక కనిపించడం లేదు. […]
తిరుపతి ఎంపీ, వైసీపీ నేత బల్లి దుర్గాప్రసాద్ రావు ఇటీవల అకాల మరణం పొందారు. కరోనాకు చికిత్స తీసుకుని కోలుకుంటున్న తరుణంలో గుండెపోటు రావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఎంపీ మరణంతో.. తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా..? లేక పోలింగ్ జరుగుతుందా..? అనేది ఆయా పార్టీల నిర్ణయంపై ఆధారపడి ఉంది. విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ సాంప్రదాయాన్ని ముందుకు తెచ్చింది. ఎవరైనా ప్రజా ప్రతినిధి […]