iDreamPost
android-app
ios-app

విపక్షాల వంకలు.. అధికారపక్షంలో ఉత్సాహం !

విపక్షాల వంకలు.. అధికారపక్షంలో ఉత్సాహం !

యుద్ధంలో పోరాడి ఓడితే వీరుడు అంటారు.. యుద్ధానికి వెళ్ళకముందే ప్రత్యర్థి మీద రకరకాల సాకులు చెప్పే వారిని ఏమంటారు? ప్రత్యర్థి మీద నిందలు వేసి వారి నుంచి తప్పుకోవాలని చూసే వారిని ఏమని పిలుస్తారు? ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల సాక్షిగా ఇదే తంతు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. సంక్షేమ పథకాల దన్నుతో, స్థానిక ఎన్నికల్లో విజయాల వరుసతో జోష్ మీద కనిపిస్తున్న అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఇలాంటి కారణాల వెతుకుతున్నట్లు కనిపిస్తోంది.

తిరుపతి ఉప ఎన్నిక ల్లో విపక్షాలు తమ ఓటమిని ముందుగానే నైతికంగా అంగీకరించినట్లే కనిపిస్తున్నాయి. అధికార పార్టీ హవా స్పష్టంగా కనిపించడంతో వాటికీ ఇప్పుడు ఓటమి కారణాలు, అధికార పార్టీ మీద సాకులు వెతికే పని ఇప్పటి నుంచే మొదలు పెట్టాయి . రకరకాల వంకలు వెతుకుతూ, ఆరోపణలు చేస్తూ తిరుపతి లోక్సభ పరిధిలో ఏదో జరుగుతున్నట్లు ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాల్లో దిగుతున్నట్లు కనిపిస్తున్నాయి.

రెండు లక్షల బోగస్ ఓట్లట!

తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14 లక్షల కోట్లు పైగా ఉన్నాయి. 2019 ఓటర్ లిస్టులో మళ్లీ ఎవరు మార్పులు చేర్పులు చేయలేదు. 2019 ఎన్నికల్లో అధికార పార్టీ కు సుమారు ఆరు లక్షల పైగా ఓట్లు సాధిస్తే, రెండో స్థానంలో నిలిచిన టీడీపీ నాలుగు లక్షల కోట్లు పైగా సాధించింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యకుమార్ తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని ఏకంగా 2 లక్షల పైగా బోగస్ ఓట్లున్నాయని ఆరోపణలు చేయడం విడ్డూరంగా అనిపిస్తుంది. 2019 ఎన్నికల్లో వాడిన ఓటర్ లిస్ట్ నే మళ్లీ ఉప ఎన్నికల్లో వాడేందుకు అవకాశం ఉంది. ఈ మధ్యలో రెండు లక్షల బోగస్ ఓట్లు ఎలా పుట్టుకొచ్చాయి అన్నది బిజెపి నేతలకే తెలియాలి. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం 2019 ఓటర్ లిస్టు ఆధారంగానే ఎన్నికల కమిషన్ నిర్వహించింది. కొత్త ఓటర్ లిస్టు లో ఇప్పటికిప్పుడు తయారు చేసే అవకాశం కూడా లేదు. దీంతో తిరుపతి ఉప ఎన్నికల్లో దాదాపు 2019 ఓటర్ లిస్ట్ ఆధారంగానే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ మధ్య కాలంలోనే రెండు లక్షల బోగస్ ఓట్లు ఎలా వచ్చి పడ్డాయి..? ఒక అలా వచ్చి ఉంటే బీజేపీ ఇప్పటివరకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు..?? అన్నది ఆలోచించుకోవాలి.

Also Read : ప్ర‌త్యేక హోదాపై కేంద్రం నిర్ల‌క్ష్యం వెనుక‌..?

ఇక విపక్ష పార్టీ తెలుగుదేశం వైసీపీ తిరుపతి లోక్సభ ఎన్నికలలో గెలిచేందుకు తన అధికార బలాన్ని, రౌడీయిజాన్ని నమ్ముకుందన్న ప్రచారాన్ని ఇప్పటికే మొదలు పెట్టింది. తిరుపతి నగరంలో ఇప్పటివరకు మంచి పట్టు ఉంది అనుకున్న సమయంలో కార్పొరేషన్ ఎన్నికల్లో ఏకంగా లో 49 డివిజన్లు గెలుచుకొని, తిరుగులేని విజయం సాధించడంతో తిరుపతి పైన ఆశలు కోల్పోయిన టిడిపి నేతలు ఏదో ఒక రభాస సృష్టించాలని, దానిని అధికారపార్టీకి ముడి పెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనిమీద ఇప్పటికే ప్రభుత్వానికి ఓ నివేదిక వెళ్లినట్లు సమాచారం. తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోనిలో ఏదో ఒక సంఘటన ను సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలి అనేది టిడిపి నేతల ఆలోచన. అయితే దీని మీద అధికార పార్టీ ముద్ర కూడా వేస్తే రాజకీయంగా ఉపయోగపడుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. దీంతో ఇప్పటికే టీడీపీ కీలక నేతల ప్రసంగాల్లో అధికార పార్టీ రౌడీయిజం చేస్తోంది అంటూ మాట్లాడటం మొదలు పెట్టారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో గెలవడం ఒక ఎత్తయితే అధికారపార్టీ మీద ఎలాంటి చెడు ముద్ర పడకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్న తరుణంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగే ప్రతి అంశం మీద పోలీస్ అధికారులు దృష్టిపెట్టారు. ఇంటిలిజెన్స్ విభాగపు కీలక అధికారులు ఇప్పటికే తిరుపతి లో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విపక్ష పార్టీలో కీలకమైన నేతల చర్యలను ఎప్పటికప్పుడు ఆరాతీస్తూ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశాలు జరగకుండా ప్రభుత్వం తగు ప్రణాళికతో ముందుకు వెళుతోంది.

Also Read : నామినేషన్ దాఖలు : ప‌న‌బాక‌లో మార్పు క‌నిపించేనా..?