భారతీయ జనతా పార్టీ తన జోరు కొనసాగిస్తోంది. అనుమానాలను పటాపంచలు చేస్తూ మరోసారి విజయపతాకం ఎగురవేసింది. తాజాగా వెల్లడైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో నాలుగింటిని కైవసం చేసుకుంది. ఇక భవిష్యత్ లో జరిగే ఎన్నికల్లో బీజేపీ గురి ప్రధానంగా తెలంగాణపై ఉంది. ఇప్పటికే ఏడాదిన్నరగా రాష్ట్రంలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పుడు తాజా ఎన్నికల ఫలితాల అనంతరం మరింత దూకుడు పెంచనుంది. యూపీ ప్రభావం తెలంగాణపై ఉంటుందని మొదటినుంచీ ప్రచారం జరుగుతూనే ఉంటుంది. అనుకున్నట్లే ఉత్తరప్రదేశ్ను మరోసారి […]
మనకు బాగా అలవాటైన దారిలో వెళ్ళడమే సులభంగా అన్పిస్తుంటుంది. ఎన్నికల్లో ఒక్కోసారి ఇలా సులభమైన దారిలో ప్రయాణించడానికే పలు పార్టీలు, నాయకులు ప్రయత్నిస్తుంటారు. కానీ ఇది జనాన్ని ఎంత వరకు ఆకట్టుకుంటుందన్నది తేలాలంటే ఎన్నికల్లో విజయమే గీటు రాయి అవుతుంది. ప్రస్తుతం తెలంగాణాలో జీహెచ్యంసీ ఎన్నికల వేడి ముమ్మరంగానే పెరిగిపోతోంది. అన్ని పార్టీల నాయకులు తమ ప్రత్యర్ధులను నోటికొచ్చిన పాండిత్యాన్నంతా ఉపయోగించి ఆడేసుకుంటున్నారు. ఇదే రీతిలో బీజేపీ కూడా తమకు అత్యంత ఇష్టమైన అంశాన్నే భుజానికెత్తుకుంది. బీజేపీ […]
తెలంగాణా రాజకీయాల్లో కీలక మలుపులు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాదని, బీజేపీగా ప్రకటించడం ద్వారా టీఆర్ఎస్ ఓ సంకేతానికి సిద్దమయినట్టు కనిపించింది. కాంగ్రెస్ తో సహా కేసీఆర్ ని వ్యతిరేకించే శక్తులన్నీ బీజేపీని బలపరిచేందుకు ఆ ప్రకటన తోడ్పడింది. చివరకు బీజేపీ విజయానికి టీఆర్ఎస్ ప్రకటన కూడా ఓ కారణంగా భావించేవాళ్లున్నారు. అంతేగాకుండా భవిష్యత్ తెలంగాణా రాజకీయ ముఖచిత్రంపై పలు మార్పులకు దోహదపడేందుకు దుబ్బాక ఫలితాలు తోడ్పడినట్టు […]
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ పరిస్థితిని గమనిస్తున్న పరిశీలకులకు ఇప్పుడీ డౌటే ప్రధానంగా వస్తోందట. తెలుగు రాష్ట్రాలను ఏలేద్దామని బీజేపీ ఎప్పట్నుంచో కలలుకంటోంది. తెలంగాణాలో పార్టీ పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం నోటాతోనే పోటీపడుతోంది. బలపడే అవకాశం వచ్చినప్పుడు టీడీపీ పల్లకీని మోస్తూ బీజేపీ నాయకులు పుణ్యకాలం గడిపేసారంటుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యలు స్వీకరించిన సోము వీర్రాజు బీజేపీలో రారండోయ్.. అంటూ తలుపులు బార్లా తెరిచి బహిరంగ ఆహ్వానాలు ప్రతి […]