తిరుపతి ఉప ఎన్నికలో గెలవాలని ఎన్నో అంచనాలతో బరిలోకి దిగింది బీజేపీ. కానీ అధికార వైఎస్సార్ సీపీ ముందు తేలిపోయింది. కనీసం ప్రభావం కూడా చూపలేకపోయింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలంగాణ బీజేపీ లీడర్లు బండి సంజయ్, రఘునందన్ రావు వచ్చి ప్రచారం చేసినా.. ఫలితం మారలేదు. ప్రజలు ఏకపక్షంగా వైసీపీకి పట్టంకట్టారు. భారీ మెజారిటీ దిశగా గురుమూర్తి దూసుకువెళ్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్ ను బట్టి చూస్తే బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కే అవకాశాలు […]
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36.67 శాతం పోలింగ్ నమోదైంది. అయితే వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ టీడీపీ, బీజేపీ నేతలు హల్చల్ చేయడం ప్రారంభించారు. తిరుపతి రోడ్లపై పలు బస్సులను ఆపి.. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను రప్పించి ఓట్లు వేయిస్తున్నారంటూ టీడీపీ, బీజేపీ నేతలు నానా యాగీ చేశారు. వందల కొద్దీ బయట వ్యక్తులను తీసుకొచ్చి […]
కొన్నిసార్లు అంతే.. మాటలు కోటలు దాటుతుంటయ్. చేతలు మాత్రం ఇంటి గేటు కూడా దాటవు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ నేతల తీరు కూడా ఇలానే ఉంటుంది. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే రఘునందన్ రావు పెద్దపెద్ద మాటలే మాట్లాడారు. రత్నప్రభ గెలిస్తే కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందంట. ఒక్క ఎంపీ సీటు గెలిచినా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తారంట. అంతేనా.. ఇంకా చాలానే చెప్పారు […]
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పైకి జనసేన బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ ఆ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో బిజెపికి సహకరిస్తుందా..? అనే అనుమానాలు లేకపోలేదు తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థి రత్నప్రభ నామినేషన్ ప్రక్రియలో జనసేన నేతలు కనిపించకపోవడం ఈ అనుమానాన్ని బలోపేతం చేస్తోంది. కేవలం బీజేపీ నేతలు, కార్యకర్తలతోనే రత్నప్రభ నామినేషన్ వేశారు. బీజేపీ, జనసేన మధ్య తీవ్ర అంతరం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇరు […]
తిరుపతి ఉప ఎన్నికపై కమలదళంలో ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. జనసేన పార్టీతో సంబంధం లేకుండానే ఆ పార్టీ అభ్యర్థిని దాదాపుగా ఖరారు చేసింది. దీంతో జనసేన, బీజేపీ మధ్య తెలంగాణాలో ఏర్పడిన వివాదం ఏపీలోనూ రాజుకుంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ నుండి ఎవరు పోటీ చేస్తారనే అంశానికి తెరపడింది. పోటీకి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ముగ్గురు మాజీ ఐఏఎస్ల కుర్చీలాటకి తెరపడింది. ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్న దాసరికి శ్రీనివాసులు, రత్నప్రభ, మాజీ […]