మాస్ మహారాజాగా మినిమమ్ గ్యారెంటీ హీరోగా బలమైన మార్కెట్ ఏర్పరుచుకున్న రవితేజ కెరీర్ ఈ మధ్య ఎగుడుదిగుడుగా సాగుతోంది. క్రాక్ లాంటి సూపర్ హిట్ తో పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇచ్చినప్పటికీ ఆ వెంటనే ఖిలాడీ డిజాస్టర్ రూపంలో షాక్ ఇచ్చింది. అయినా కూడా తనకంటూ ఉన్న ఫాలోయింగ్ ఎప్పటికప్పుడు ఇమేజ్ ని కాపాడుతూ వస్తోంది. అయితే రామారావు ఆన్ డ్యూటీకి ఆశించినంత బజ్ లేకపోవడం అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. బాక్సాఫీస్ వద్ద నెలకొన్న అనూహ్యమైన పరిస్థితులు దీనికి […]
జూలై నెల మరీ దారుణంగా ఉంది. బాక్సాఫీస్ వద్ద వరస డిజాస్టర్లు ట్రేడ్ ని విపరీతమైన నష్టాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గోపీచంద్ పక్కా కమర్షియల్ తో ఈ పర్వం మొదలయ్యింది. మారుతీ దర్శకత్వం, ఎంటర్ టైనింగ్ గా అనిపించిన ట్రైలర్లు వెరసి అంతో ఇంతో నెలకొన్న అంచనాలను పూర్తిగా అందుకోలేక చతికిలబడింది. హ్యాపీ బర్త్ డే ఇచ్చిన నష్టాల గురించి చెప్పాల్సిన పని లేదు. మైత్రి లాంటి పెద్ద బ్యానర్ అండగా ఉన్నా ఘోరమైన ఫ్లాప్ తప్పలేదు. […]
గత ఏడాది క్రాక్ రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకుని తన కంబ్యాక్ ని మరోసారి బలంగా అందుకున్న మాస్ మహారాజ రవితేజ కొత్త సినిమా రామారావు ఆన్ డ్యూటీ ఈ నెల 29న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి బోలెడు అడ్డంకులు, అవాంతరాలు, రకరకాల కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చాయి. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా మూడు డేట్లు మారి ఫైనల్ గా సెట్ చేసుకుంది. అంతా బాగానే ఉంది కానీ రామారావుకు […]