iDreamPost
android-app
ios-app

4 డిజాస్టర్లు – ఫైనల్ డ్యూటీ రామారావుదే

  • Published Jul 25, 2022 | 12:35 PM Updated Updated Dec 27, 2023 | 6:55 PM

మైత్రి లాంటి పెద్ద బ్యానర్ అండగా ఉన్నా ఘోరమైన ఫ్లాప్ తప్పలేదు. రామ్ ది వారియర్ తెస్తున్న లాసులు చాలా మందికి కునుకుని దూరం చేశాయి. భారీ థియేట్రికల్ బిజినెస్ చేయడంతో దానికి తగ్గట్టే బ్రేక్ ఈవెన్ అందుకోలేక ఈ పోలీస్ సినిమా కిందా మీదా పడుతోంది.

మైత్రి లాంటి పెద్ద బ్యానర్ అండగా ఉన్నా ఘోరమైన ఫ్లాప్ తప్పలేదు. రామ్ ది వారియర్ తెస్తున్న లాసులు చాలా మందికి కునుకుని దూరం చేశాయి. భారీ థియేట్రికల్ బిజినెస్ చేయడంతో దానికి తగ్గట్టే బ్రేక్ ఈవెన్ అందుకోలేక ఈ పోలీస్ సినిమా కిందా మీదా పడుతోంది.

4 డిజాస్టర్లు – ఫైనల్ డ్యూటీ రామారావుదే

జూలై నెల మరీ దారుణంగా ఉంది. బాక్సాఫీస్ వద్ద వరస డిజాస్టర్లు ట్రేడ్ ని విపరీతమైన నష్టాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గోపీచంద్ పక్కా కమర్షియల్ తో ఈ పర్వం మొదలయ్యింది. మారుతీ దర్శకత్వం, ఎంటర్ టైనింగ్ గా అనిపించిన ట్రైలర్లు వెరసి అంతో ఇంతో నెలకొన్న అంచనాలను పూర్తిగా అందుకోలేక చతికిలబడింది. హ్యాపీ బర్త్ డే ఇచ్చిన నష్టాల గురించి చెప్పాల్సిన పని లేదు. మైత్రి లాంటి పెద్ద బ్యానర్ అండగా ఉన్నా ఘోరమైన ఫ్లాప్ తప్పలేదు. రామ్ ది వారియర్ తెస్తున్న లాసులు చాలా మందికి కునుకుని దూరం చేశాయి. భారీ థియేట్రికల్ బిజినెస్ చేయడంతో దానికి తగ్గట్టే బ్రేక్ ఈవెన్ అందుకోలేక ఈ పోలీస్ సినిమా కిందా మీదా పడుతోంది.
4 Disasters - Rama Rao's Final Duty
నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా థాంక్ యు పరుగులు పెడుతోంది. వరస్ట్ కంటెంట్ కాకపోయినా ఆల్రెడీ చూసిన కథతోనే దర్శకుడు విక్రమ్ కె కుమార్ చేసిన అతి మాములు ప్రయత్నం నిర్మాత దిల్ రాజుకు పెద్ద దెబ్బె వేసింది. నాగార్జునకు ఆఫీసర్ లాగా చైతుకి ఈ థాంక్ యు మిగిలిపోతుందని అంటున్నారు. ఫైనల్ రన్ అయ్యేలోపు సుమారు 15 కోట్ల దాకా డెఫిషిట్ పడొచ్చని అంచనా. ఇక చివరి వారంలో వస్తోంది రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ లో రవితేజ రెవిన్యూ ఆఫీసర్ గా నటించారు. ప్రమోషన్ గట్రా టీమ్ బాగానే చేస్తోంది. నిన్న నాని ముఖ్య అతిధిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా చేశారు.

ఇది హిట్ అయితే తప్ప జూలైలో కనీస ఊరట దక్కదు. మేజర్, విక్రమ్ లు ఇచ్చిన ఆనందాన్ని ఈ నెలలో వచ్చిన సినిమాలు మొత్తం నీరుగార్చేశాయి. థియేటర్ల దగ్గర జనం లేక ఎగ్జిబిటర్లు లబోదిబోమంటున్నారు. టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం ఒక కారణం అయినప్పటికీ మరీ యావరేజ్ కంటెంట్ ఉంటే తాము హాళ్లకు వచ్చే ప్రసక్తే లేదని ఆడియన్స్ తేల్చి చెబుతున్నారు. మరి రామారావు డ్యూటీని సరిగా చేస్తే పర్లేదు. పోటీగా సుదీప్ విక్రాంత్ రోనా ఉంది కానీ దాని మీద ఏమంత చెప్పుకోదగ్గ బజ్ లేదు. క్రాక్ రేంజ్ లో టాక్ వస్తే రామారావుకు కమర్షియల్ గా మంచి గ్రౌండ్ దొరుకుతుంది. దాన్ని ఎంత మేరకు వాడుకున్నారో ఈ నెల 29న తేలనుంది.Disasters - Rama Rao's final duty