iDreamPost
android-app
ios-app

ప్రియుడ్ని పెళ్లాడబోతున్న రవితేజ హీరోయిన్..!

  • Published Feb 06, 2024 | 5:24 PM Updated Updated Feb 06, 2024 | 5:24 PM

ఇప్పుడు హీరోయిన్స్ ఏ విషయాన్ని అయినా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. సూచాయగా ప్రేమ గురించి కూడా హింట్ ఇస్తున్నారు కానీ కన్ఫమ్ చేయడంలో మాత్రం కాస్త ఆలోచిస్తున్నారు. ఇవే రూమర్లకు దారి తీస్తున్నాయి.

ఇప్పుడు హీరోయిన్స్ ఏ విషయాన్ని అయినా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. సూచాయగా ప్రేమ గురించి కూడా హింట్ ఇస్తున్నారు కానీ కన్ఫమ్ చేయడంలో మాత్రం కాస్త ఆలోచిస్తున్నారు. ఇవే రూమర్లకు దారి తీస్తున్నాయి.

  • Published Feb 06, 2024 | 5:24 PMUpdated Feb 06, 2024 | 5:24 PM
ప్రియుడ్ని పెళ్లాడబోతున్న రవితేజ హీరోయిన్..!

నటికి హీరోయిన్‌గా ప్రమోట్ అయ్యాక.. కెమెరా కళ్లన్నీ ఆమెపైనే ఉంటాయి. ఆమె ఏం తింటుంది, ఎలాంటి దుస్తులు వేస్తుంది, ఎక్కడికి వెళుతోంది అంటూ సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు జర్నలిస్టులు. ఇక్కడ ఎవరితో కనిపించినా..ఏదో ఒక రూమర్ వచ్చేస్తుందని, విదేశాల్లో చక్కర్లు కొడుతున్నారు. ఇక ఆమె పొరపాటున ఏ హీరోతోనే లేదా బయట వ్యక్తులతో, ఫ్యామిలీ మెంబర్స్‌తో కనిపించిందా, సోషల్ మీడియా వేదికగా ఎవరికైనా రెస్సాన్స్ ఇచ్చిందా.. అదిగో ఆమెకు, అతడికి మధ్యలో ఏదో నడుస్తుందంటూ వార్తలు వస్తాయి. ఇవి కొన్ని సార్లు నిజం కూడా అవుతుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ జంట సోషల్ మీడియాకు చిక్కింది. దీంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని టాక్ నడుస్తోంది.

ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే రెజీషా విజయన్. ఈ మలయాళీ బ్యూటీ.. తెలుగులో కూడా రవితేజ సరసన యాక్ట్ చేసింది. రామారావు ఆన్ డ్యూటీ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అమ్మడు. అయితే అంతకు ముందే ధనుష్ కర్ణన్, సూర్య జై భీమ్ చిత్రాలతో టీటౌన్ ప్రేక్షకులను పలకరించింది. కార్తీ సర్దార్‌లో కనిపించింది. తమిళ్, మలయాళ మూవీల్లో బిజీ బిజీగా మారిపోయింది. జై భీమ్‌లో ఆమె నటన కట్టిపడేస్తుంది. అయితే ఈ బ్యూటీ మలయాళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్‌తో ఎప్పటి నుండో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇద్దరి పుట్టిన రోజులకు విష్ చేసుకోవడమే కాకుండా..అందులో నువ్వే నా సర్వస్వం అంటూ రాసుకొచ్చాడు.

తాజాగా  రెజీషాతో ఉన్న ఓ ఫోటో పంచుకున్నారు. అందులో ‘మేమిద్దరం ఇంకా చాలా ప్రయాణించాలి. ప్రేమ, నవ్వుతో నిండాలి’ అంటూ రాసుకొచ్చారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే రెజీషాతో ఉన్న ఫోటోలను టోబిన్ పోస్టు చేయడం కొత్తేమీ కదూ. గతంలో వీరి మధ్య రిలేషన్ గురించి చెబుతూనే ఉన్నాడు. అతడి ఇన్ స్టా ఖాతాను తిరగేస్తే.. ఆమెతో కలిసి టూర్స్, రెజీషా ఫిల్మ్ కు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో షేర్ చేస్తూనే ఉంటాడు. కానీ ఆమె అఫీషియల్ ఎనౌన్స్ చేయలేదు. మరీ ఈ డేటింగ్ రూమర్ నిజం చేస్తూ పెళ్లి పీటలు ఎక్కుతారేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Tobin Thomas (@tobin_thomas7)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş