రెండు, మూడు నెలలకు ఒకే సారి రీడింగ్ తీయడంతో కరెంట్ బిల్లుల మోత ఎలాగున్నా.. ప్రతి పక్షాలకు మాత్రం పని దొరికినట్లయింది..! తెలుగు రాష్ట్రాలు రెండు చోట్లా… దాన్నో అవకాశంగా చేసుకుని రోడ్డెక్కే ప్రయత్నం చేస్తున్నారు నేతలు. ఆంధ్రప్రదేశ్ లో అయితే.. టీడీపీ నేతలు ఒకడుగు ముందుకేసి బిల్లులు పెంచేశారు.. బాదేశారు.. అంటూ గందరగోళానికి గురి చేసి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. గత నెలలో ప్రజలకు విద్యుత్ బిల్లులు అందినకాడ నుంచీ హడావిడి మొదలుపెట్టారు. అయితే.. ప్రభుత్వానికి […]
ప్రధాన ప్రతిపక్ష హోదాలో చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై ప్రయోగిస్తున్న అస్త్రాలన్నీ తుస్సుమంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద గుడ్డి వ్యతిరేకతతో చంద్రబాబు పనికిమాలిన ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. ఇంతకీ జగన్ సర్కార్ పై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు ఏమిటంటే నర్సీపట్నం డాక్టర్ సుధాకర్, గుంటూరు జిల్లాలో రంగనాయకమ్మ, గుంటూరు జిల్లాలోని ఓ గుడిసెకు 3 వేల రూపాయల కరెంటు బిల్లు వచ్చిందని. నిజానికి ఈ ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజంలేదు. మహానాడులో కూడా చివరకు వీళ్ళ గోలను […]
విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తోందంటూ చంద్రబాబునాయుడుతో సహా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ ఉత్త డొల్లే అని తేలిపోయింది. తాజాగా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించిన లెక్కల కారణంగా విద్యుత్ బిల్లుల ఆరోపణల్లో డొల్లతనం బయటపడింది. లాక్ డౌన్ కారణంగా కుటుంబసభ్యులందరూ ఇంట్లోనే ఉన్న కారణంగా విద్యుత్ వినియోగం పెరగటంతో బిల్లులు పెరిగాయని అధికారులు చెప్పినా వినకుండా ప్రతిపక్షాలు కావాలనే గోల చేస్తున్నాయి. ఇంతకాలం నోటిమాటగా చెప్పిన వివరాలనే అధికారులు ఇపుడు లెక్కలతో సహ వివరించారు. ఉన్నతాధికారులు ఇచ్చిన […]
రాజు, ప్రజలతో పోల్చాల్సిన ఈ నానుడిని యజమాని పనివాడితో ఎందుకు పోల్చాల్సి వచ్చిందో చివరకు చెబుతాను. అధికారంలోకొచ్చిన కొత్త మోజులో, తానేం చేసినా చెల్లుబాటయ్యే సమయంలో.. తనకు తాను ఏపీకి సీఈవోగా ప్రకటించుకున్నాడు చంద్రబాబునాయుడు. దీంతో ప్రభుత్వ అధికారులతో పాటు, తమ పార్టీ పల్లకీని స్వచ్ఛంధంగా మోస్తున్న నాయకులు, కార్యకర్తలను కూడా జీతంలేని ఉద్యోగులుగానే చూసాడని ఇప్పటికీ పలువురు కీలక కార్యకర్తలు గుర్తు చేసుకుంటుంటారు. పార్టీ పరంగా చేయాల్సిన పనులకు మార్కులు కేటాయిస్తూ, వాటిని బట్టి ర్యాంకులు […]
తెలుగుదేశం పార్టీ నిన్నటి రోజున రాష్ట్రంలో అక్కడక్కడా కొంతమంది నాయకులుతో నిర్వహించిన కరెంటు దర్నా చూస్తుంటే వీరు ప్రజల జ్ఞాపక శక్తి మీద ఎంత చులకన భావంతో ఉన్నారో అర్ధం అవుతుంది. వారికి ఉన్న సామాజిక మాద్యమాల అండతో ప్రజల్లో చిన్న పాటి అపోహలు రేపి , వాటిని వారి మీడియా చానల్స్ ద్వారా పెద్దది చేసి ఆ తరువాత ఆ అంశం ప్రజల్లో ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతగా చిత్రీకరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు […]
విద్యుత్ బిల్లులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా చంద్రబాబునాయుడు ఇచ్చిన దీక్షల పిలుపు అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పాలి. చంద్రబాబు దీక్ష పిలుపును చాలామంది నేతలు పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఈ ఒక్క దీక్షే కాదు గతంలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇచ్చిన అనేక పిలుపులు కూడా ఫెయిలయ్యాయి. తాజాగా విద్యుత్ బిల్లులకు నిరసనగా చంద్రబాబు ఇచ్చిన పిలుపు అట్టర్ ఫ్లాప్ అయ్యిందనటానికి ఈనాడు దినపత్రికలో ఇచ్చిన లెక్కలే సాక్ష్యం. ఈనాడు మొదటి పేజీలో కరెంటు బిల్లులపై కన్నెర్ర […]
పరిపాలన, ఎన్నికల హామీల అమలులో విమర్శలకు తావులేకుండా పాలన సాగిస్తున్న వైఎస్ జగన్ సర్కార్ను ఎలాగైనా విమర్శించాలి, నష్టపరచాలన్న దుగ్ధతో ప్రతిపక్ష టీడీపీ అధినాయకులే వ్యవహరిస్తున్నారు. అసత్య ఆరోపణలు చేస్తూ తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారు. ఈ తంతు చంద్రబాబు నుంచి మొదలవగా ఆయన తనయుడు మాజీ మంత్రి లోకేష్ కు ఆదే దారిలో పయనిస్తున్నారు. ఆవు చేలో మేస్తుంటే.. దూడ గట్టున మేస్తుందా..? అన్న చందంగా తండ్రి కొడుకుల వ్యవహారం నడుస్తోంది. ఏపీలో కరెంట్ బిల్లులు పెరగకపోయినా.. […]
ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ పరిపాలన ప్రతిపక్ష పార్టీకి విమర్శలు, ఆరోపణలు చేసేందుకు ఎలాంటి అవకాశం లేకుండా సాగుతోంది. పరిపాలన, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి విమర్శలు చేసేందుకు అవకాశం లేకుండా పోతుండడంతో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకి ఏమి చేయాలో పాలుపోవడంతో లేదు. అందుకే రంధ్రాన్వేషణ చేసి కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్న చందంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో కరెంట్ బిల్లులు పెంచారంటూ టీడీపీ గగ్గొలు పెడుతోంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా […]
కరెంట్ చార్జీలను మూడు నెలల పాటు రద్దు చేయాలని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కొత్త డిమాండ్ను ప్రారంభించారు. బాబు చేసిన డిమాండ్ చేసిన విషయం అటుంచితే.. రద్దు అనే మాట ఆయన నోట నుంచి రావడంతో చరిత్రను గుర్తు చేశారు. రద్దు అనే మాటకు, చంద్రబాబుకు అవినాభావ సంబంధం ఉంది. ఆ రద్దు అనే మాట వల్ల చంద్రబాబు లాభ పడినా అంతకు మించి ప్రజలను కోలుకోలేని విధంగా నష్టపరిచారు. . 2014 ఎన్నికల్లో […]
ఏపీ సర్కారు కొత్త పద్ధతి అనుసరిస్తోంది. ఆందోళన చెందుతున్న వారికి నేరుగా అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగా నేరుగా ప్రతిపక్ష నేతల ఇళ్లకు కూడా అధికారులను పంపించే ప్రయత్నం చేస్తోంది. తద్వారా వివిధ సమస్యలపై వారిలో ఉన్న అభిప్రాయాలకు తగిన సమాధానం చెప్పడం ద్వారా శాంతింపజేసే విధానం అనుసరిస్తోంది. అందులో భాగంగా తాజాగా విద్యుత్ బిల్లులకు సబంధించి వివిధ పార్టీల నేతల వాదనలకు తగిన సమాధానం చెప్పేందుకు ప్రయత్నం చేసింది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు […]