Swetha
ఇంకొద్ది గంటల్లో సోషల్ మీడియా తగలపడిపోవడం ఖాయం. ఎందుకంటే ఒకే రోజు రెండు పవర్ ఫుల్ అప్డేట్స్ వస్తున్నాయి. ఓ వైపు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోకేష్ కనగరాజ్ కూలి ట్రైలర్. మరోవైపు ఎప్పటినుంచో పవన్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న OG అప్డేట్
ఇంకొద్ది గంటల్లో సోషల్ మీడియా తగలపడిపోవడం ఖాయం. ఎందుకంటే ఒకే రోజు రెండు పవర్ ఫుల్ అప్డేట్స్ వస్తున్నాయి. ఓ వైపు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోకేష్ కనగరాజ్ కూలి ట్రైలర్. మరోవైపు ఎప్పటినుంచో పవన్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న OG అప్డేట్
Swetha
ఇంకొద్ది గంటల్లో సోషల్ మీడియా తగలపడిపోవడం ఖాయం. ఎందుకంటే ఒకే రోజు రెండు పవర్ ఫుల్ అప్డేట్స్ వస్తున్నాయి. ఓ వైపు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోకేష్ కనగరాజ్ కూలి ట్రైలర్. మరోవైపు ఎప్పటినుంచో పవన్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న OG అప్డేట్. ఆగస్ట్ 14 న రిలీజ్ కాబోతున్న కూలీ సినిమా మీద ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఒక్కో అప్డేట్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షుకులను కూడా ఊరిస్తుంది. స్టార్ యాక్టర్స్ తో లోకేష్ కనగరాజ్ స్క్రీన్ మీద ఎలాంటి మ్యాజిక్ చేశాడో చూడడానికి ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 2న ట్రైలర్ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్. సినిమా మీద మరింత అంచనాలు పెంచడానికి ఇదొక్కటి చాలు.
ఇక అది కాకుండా పవన్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా OG మూవీ. ఇన్నేళ్ళలో పవన్ ఎక్కడ కనిపించినా కానీ ఫ్యాన్స్ అంతా OG నామ స్మరణే చేస్తూ ఉన్నారు. ఎంత హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ అయినా అందరికి OG మీదే ఆసక్తి ఉన్న సంగతి తెల్సిందే. అలాగే హరి హర చేసిన గాయం మానాలంటే ఇప్పుడు OG సీన్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సిందే. సినిమా పోస్ట్ పోన్ అనే టాక్స్ వస్తున్నా సరే.. డివివి ఎంటర్ టైన్మెంట్స్ మాత్రం సెప్టెంబర్ 25 న రిలీజ్ పక్కా అని పదే పదే నొక్కి చెప్తుంది. సో ఈ క్రమంలో OG నుంచి ఫస్ట్ సింగల్ సాంగ్ రాబోతుంది. సో ఇది కచ్చితంగా సోషల్ మీడియాను ఒక ఊపేస్తోంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇలా ఒకే రోజు పవర్ హౌస్ బ్లాస్ట్ అయ్యే అప్డేట్స్ రాబోతున్నాయి. అయితే అటు కూలి కు కాంపిటీషన్ కు ఉన్న వార్ 2 నుంచి ఆల్రెడీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. కానీ ఆ తర్వాత పెద్దగా సౌండ్ చేసిందే లేదు. అలాగే ఈ ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ క్లాష్ గా చెప్పుకుంటున్న తేదీ సెప్టెంబర్ 25. ఆరోజున OG తో పాటు రిలీజ్ కానున్న మూవీ అఖండ 2. డివివి ఎంటర్ టైన్మెంట్స్ లానే అఖండ 2 కూడా వెనక్కు తగ్గేదెలే అనే పట్టుదలతోనే ఉంది. కానీ ఇంకా సీన్ లోకి మాత్రం ఎంట్రీ ఇవ్వలేదు. సో వీటి నుంచి ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.