iDreamPost
android-app
ios-app

రిషబ్ శెట్టి జై హనుమాన్ మూవీ ఎంత వరకు వచ్చినట్టు..!

  • Published Jul 31, 2025 | 4:33 PM Updated Updated Jul 31, 2025 | 4:33 PM

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ సౌండ్ చేస్తూ ఉంటాయి. మరికొన్ని ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాయి. హనుమాన్ సినిమా కూడా ఆయా కోవలోకి చెందిందే. లిమిటెడ్ బడ్జెట్ , నార్మల్ క్యాస్టింగ్ ఎలాంటి హడావిడి లేదు.. అయినా సరే పాన్ ఇండియా రేంజ్ లో సినిమా సెన్సేషనల్ హిట్ అయింది.

  • Published Jul 31, 2025 | 4:33 PMUpdated Jul 31, 2025 | 4:33 PM
రిషబ్ శెట్టి జై హనుమాన్ మూవీ ఎంత వరకు వచ్చినట్టు..!

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ సౌండ్ చేస్తూ ఉంటాయి. మరికొన్ని ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాయి. హనుమాన్ సినిమా కూడా ఆయా కోవలోకి చెందిందే. లిమిటెడ్ బడ్జెట్ , నార్మల్ క్యాస్టింగ్ ఎలాంటి హడావిడి లేదు.. అయినా సరే పాన్ ఇండియా రేంజ్ లో సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. ఇక అదే సమయంలో పార్ట్ 2 ప్రకటించిన సంగతి తెలిసిందే. తిరిగి ప్రశాంత్ వర్మ అదే సిక్వెల్ తో వస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఈలోపు మరికొన్ని ప్రాజెక్ట్స్ సైన్ చేశాడు ఈ దర్శకుడు. ఈ సినిమా గురించి పెద్దగా టాక్ లేకుండా పోయింది.

ఇక జై హనుమాన్ లో రిషబ్ శెట్టి కూడా హనుమంతుడిగా నటిస్తున్నట్లు ఓ అప్డేట్ వచ్చింది. దీనితో సినిమా మీద ఇంకాస్త అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే అప్డేట్ వస్తుందిలే అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు.. రిషబ్ శెట్టి నుంచి ఊహించని అప్డేట్ వచ్చింది. ఈ హీరో నిర్మాత నాగవంశీతో కలిసి సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. మరో వైపు కాంతారా సిక్వెల్ కూడా ఉండనే. ఓ వైపు ప్రశాంత్ సినిమాలు .. మరో వైపు రిషబ్ సినిమాలు. దీనితో ఇప్పడూ ప్రేక్షకులలో జై హనుమాన్ ఎక్కడా అనే సందేహాలు మొదలయ్యాయి. అదిగో ఇదిగో అంటున్నారే తప్ప సినిమా గురించి మాత్రం అప్డేట్ ఇవ్వడం లేదు. సో ఇప్పటికైనా మేకర్స్ ఏదైనా అప్డేట్ ఇస్తే మంచిది లేదంటే సినిమా మీద బజ్ తగ్గిపోతూ ఉంటుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.