iDreamPost
android-app
ios-app

ఆదిత్య 999.. ఈసారి అంచనాలకు మించిన కథతో..

  • Published Jul 30, 2025 | 3:42 PM Updated Updated Jul 30, 2025 | 3:42 PM

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో.. అందరికి ఆల్ టైం ఫెవరెట్ మూవీ అంటే అది ఆదిత్య 369 సినిమానే. అప్పట్లోనే ఫ్యూచర్ లో పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది అప్పట్లోనే.. చాలా రియలిస్టిక్ గా చూపించారు. ఈ సినిమా వచ్చి 34 ఏళ్ళు పూర్తయింది. ఎలాంటి టెక్నాలిజీ అందుబాటులో లేని సమయంలోనే.. డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు సృష్టించిన మాయాజాలం ఎప్పటికి అందరికి గుర్తుండిపోతుంది .

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో.. అందరికి ఆల్ టైం ఫెవరెట్ మూవీ అంటే అది ఆదిత్య 369 సినిమానే. అప్పట్లోనే ఫ్యూచర్ లో పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది అప్పట్లోనే.. చాలా రియలిస్టిక్ గా చూపించారు. ఈ సినిమా వచ్చి 34 ఏళ్ళు పూర్తయింది. ఎలాంటి టెక్నాలిజీ అందుబాటులో లేని సమయంలోనే.. డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు సృష్టించిన మాయాజాలం ఎప్పటికి అందరికి గుర్తుండిపోతుంది .

  • Published Jul 30, 2025 | 3:42 PMUpdated Jul 30, 2025 | 3:42 PM
ఆదిత్య 999.. ఈసారి అంచనాలకు మించిన కథతో..

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో.. అందరికి ఆల్ టైం ఫెవరెట్ మూవీ అంటే అది ఆదిత్య 369 సినిమానే. అప్పట్లోనే ఫ్యూచర్ లో పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది అప్పట్లోనే.. చాలా రియలిస్టిక్ గా చూపించారు. ఈ సినిమా వచ్చి 34 ఏళ్ళు పూర్తయింది. ఎలాంటి టెక్నాలిజీ అందుబాటులో లేని సమయంలోనే.. డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు సృష్టించిన మాయాజాలం ఎప్పటికి అందరికి గుర్తుండిపోతుంది .ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న క్రమంలో ఈ సినిమాను కూడా 4కె వెర్షన్ ప్రింట్ తో రీరిలీజ్ చేశారు. కానీ ఆడియన్స్ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.

సరే ఇదంతా పక్కన పెడితే.. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే.. ఆదిత్య 369 కి సిక్వెల్ తీయాలని ఎప్పటినుంచో బాలకృష్ణ కు ఉన్న కోరిక. ఇప్పుడు ఆ సిక్వెల్ కి శ్రీకారం చుట్టే రోజులు దగ్గరపడ్డాయని ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త. ఇప్పుడు ఈ సిక్వెల్ బాధ్యతలు డైరెక్టర్ క్రిష్ కు అప్పగించారన్నది టాక్. ఈ సిక్వెల్ కు ఆదిత్య 999 అనే టైటిల్ ని ఫిక్స్ చేసి.. బాలకృష్ణ స్వయంగా ఓ కథను రెడీ చేసుకున్నారు. ఇందులో ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా నటించనున్నాడన్న వార్తా ఎప్పుడో వచ్చింది. ఇది మోక్షజ్ఞ డెబ్యూ ఫిలిం కింద కన్సిడర్ చేయొచ్చు. బాలకృష్ణ తన తండ్రి సినిమాల ద్వారా ఎలా అయితే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారో.. తన కొడుకుని కూడా అదే పద్దతిలో తీసుకురానున్నారట. ఎలాగూ సినిమా సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్ కాబట్టి.. బాగానే స్కోప్ దక్కుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

ఇక సినిమాలో ఆశ్చర్య పరిచే ఇంకొక మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమాలో బాలకృష్ణ మూడు పాత్రలలో కనిపించనున్నారట. ఇలానే గతంలో అధినాయకుడు అనే సినిమా వచ్చింది కానీ ఇది ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. అదంటే రెగ్యులర్ మూవీ.. కానీ ఆదిత్య 999 ఇలా కాదు కాబట్టి పక్కా హిట్ కొడుతుందని అనుకుంటున్నారు. పైగా ఈసారి ఆ టైం మిషన్ లో ద్వాపర యుగం త్రేతా యుగాలకు తీసుకుని వెళ్తుందని టాక్. అయితే సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటి అనే విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. సో ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.