Swetha
బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీకి రిలీజ్ సమయంలో ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో తెలియనిది కాదు. అమ్మాయిలను చదివించాలి , వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలి.. దానికోసం అంతా ప్రోత్సహించాలి అనే ఓ చక్కని సందేశంతో.. అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఆ సమయంలో ఈ సినిమా మంచి టాక్ తో పాటు మంచి వసూళ్లను కూడా రాబట్టింది.
బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీకి రిలీజ్ సమయంలో ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో తెలియనిది కాదు. అమ్మాయిలను చదివించాలి , వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలి.. దానికోసం అంతా ప్రోత్సహించాలి అనే ఓ చక్కని సందేశంతో.. అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఆ సమయంలో ఈ సినిమా మంచి టాక్ తో పాటు మంచి వసూళ్లను కూడా రాబట్టింది.
Swetha
బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీకి రిలీజ్ సమయంలో ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో తెలియనిది కాదు. అమ్మాయిలను చదివించాలి , వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలి.. దానికోసం అంతా ప్రోత్సహించాలి అనే ఓ చక్కని సందేశంతో.. అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఆ సమయంలో ఈ సినిమా మంచి టాక్ తో పాటు మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఇంకో మైల్ స్టోన్ ను దాటింది. 71 వ నేషనల్ అవార్డ్స్ లో భగవంత్ కేసరి సినిమాకు గౌరవం లభించింది. ఈ సినిమాకు నేషనల్ అవార్డును సొంతం చేసుకుంది. దీనితో ఆ మూవీ టీం తో పాటు బాలయ్య అభిమానులంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.
నేషనల్ అవార్డ్ సొంతం చేసుకుందంటే మాటలు కాదు. ఇలాంటి ప్రెస్టేజియస్ అవార్డ్స్ కొన్ని సినిమాలకే లభిస్తుంది. ఈ సినిమాకు అవార్డ్ రావడానికి మెయిన్ రీజన్ సినిమాలో దాగి ఉన్న రియల్ ఎమోషన్స్. ఎప్పటిలా కాకుండా అనిల్ రావిపూడి బాలయ్యను తన రేంజ్ కు తగినట్టు చూపించాడు. కూతురుగా శ్రీలీల మీద చూపించిన ప్రేమ ఆప్యాయత ఎంతో మంది మహిళలను ఆకట్టుకుంది. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించినా కూడా ఎక్కడ ఎబ్బెట్టుగా అనిపించలేదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టేనేమో.. స్కూల్స్ , కాలేజిలలో సైతం సినిమాను ప్రదర్శించారు.
నిజానికి ఈ సినిమాకంటే ముందే బాలయ్య నట విశ్వరూపం చూపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. భైరవ ద్వీపం, ఆదిత్య 369 లాంటి ఎన్నో క్లాసిక్ మూవీస్ ఉన్నాయి. ప్రేక్షకులలో ఈ సినిమాలకు మంచి ఆదరణ లభించింది కూడా. ఇలాంటి సినిమాలకు అవార్డ్స్ వస్తాయని అంతా ఆశించారు కానీ అది జరగలేదు. ఇప్పుడు ఇన్నేళ్లకి బాలయ్యకు నేషనల్ అవార్డు రావడంతో అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాలయ్య సక్సెస్ ట్రాక్ లోనే నడుస్తున్నాడు. ఇక ముందు ముందు బాలయ్య నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయో.. ఎలాంటి అవార్డ్స్ ను దక్కించుకుంటారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.