Swetha
కోవిడ్ మొదలైనప్పటినుంచి ఓటిటి హావ బాగా పెరిగిపోయిందన్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు కూడా ఆ భాష ఈ భాష అని తేడా లేకుండా కంటెంట్ బావుంటే అన్ని సినిమాలను ఆదరిస్తున్నారు.దీనితో అటు మేకర్స్ కూడా అన్ని భాషలలో సినిమాలను డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకుని వస్తున్నారు. వారానికి కనీసం ఏడూ నుంచి ఎనిమిది సినిమాలైనా మంచివి రిలీజ్ అవుతూ ఉన్నాయి.
కోవిడ్ మొదలైనప్పటినుంచి ఓటిటి హావ బాగా పెరిగిపోయిందన్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు కూడా ఆ భాష ఈ భాష అని తేడా లేకుండా కంటెంట్ బావుంటే అన్ని సినిమాలను ఆదరిస్తున్నారు.దీనితో అటు మేకర్స్ కూడా అన్ని భాషలలో సినిమాలను డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకుని వస్తున్నారు. వారానికి కనీసం ఏడూ నుంచి ఎనిమిది సినిమాలైనా మంచివి రిలీజ్ అవుతూ ఉన్నాయి.
Swetha
కోవిడ్ మొదలైనప్పటినుంచి ఓటిటి హావ బాగా పెరిగిపోయిందన్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు కూడా ఆ భాష ఈ భాష అని తేడా లేకుండా కంటెంట్ బావుంటే అన్ని సినిమాలను ఆదరిస్తున్నారు.దీనితో అటు మేకర్స్ కూడా అన్ని భాషలలో సినిమాలను డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకుని వస్తున్నారు. వారానికి కనీసం ఏడూ నుంచి ఎనిమిది సినిమాలైనా మంచివి రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అయితే ఈ కౌంట్ ఇంకా పెరిగిపోయింది. చూడబోతుంటే థియేటర్ కంటే ఓటిటి లోనే ఎక్కువ సినిమాలు వస్తున్నట్లు అనిపిస్తున్నాయి.
దొరికే ఒక్క వీకెండ్ లో ఏ సినిమా చూడాలో ఏది లైట్ తీసుకోవాలి అర్థంకాని కన్ఫ్యూజన్ లో పడిపోతున్నారు. ఈ వీక్ లిస్ట్ చూస్తే ఇది నిజం అని అనక మారారు. థియేటర్ లో ప్లాప్ అనిపించుకున్న నితిన్ తమ్ముడు మూవీ నెట్ ఫ్లిక్ల్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మొదటి రోజే డిజాస్టర్ అనిపించుకోవడంతో రెగ్యులర్ ఆడియన్స్ సినిమాను మిస్ అయ్యారు. సో వారు ఈ సినిమాను ట్రై చేసే ఛాన్స్ ఉంది. ఇక డీసెంట్ టాక్ సంపాదించుకున్న సిద్దార్ధ్ ‘3 బిహెచ్కె’ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ కచ్చితంగా మిస్ అవ్వకుండా సినిమాను చూస్తారు. అలాగే సుహాస్ ఓ భామ అయ్యోరామా థియేటర్ లో ఫెయిల్ అయింది కానీ.. ఓటిటిలో హిట్ టాక్ ఏ వస్తుందని నిర్మాతలు వెయిటింగ్.
ఇక తెలుగు డబ్బింగ్ తో పాటు అన్ని మెయిన్ లాంగ్వేజెస్ లో .. కేవలం 100 రూపాయలకు యూట్యూబ్ లోకి అందుబాటులోకి వచ్చిన ‘సితారే జమీన్ పర్’ మూవీ. అమీర్ ఖాన్ కోసమైనా ఈ సినిమాను చూస్తారని మేకర్స్ అనుకుంటున్నారు. ఇవి కాకుండా తమిళ కోర్ట్ రూమ్ డ్రామా ‘సట్టముం నీతియుమ్’ జీ 5 లో తెలుగులోకి అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈటీవీ విన్ లో ‘రెడ్ శాండల్ వుడ్’ అనే మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇవి కాకుండా ఇంకా చాలానే సినిమాలు , వెబ్ సిరీస్ లు ఓటిటి లో స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఇలా వారం వారానికి కంటెంట్ ఓవర్ లోడ్ అవుతూ.. ఓటిటి ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇక ముందు ముందు ఓటిటి మేకర్స్ ఎలాంటి కంటెంట్ ను తీసుకుని వస్తారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.